Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవలే తమ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ని అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో టాటా పంచ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌ అనే వేరియంట్స్ ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 5.49 లక్షల నుండి రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

టాటా పంచ్ లో ప్యూర్ వేరియంట్ మినహా మిగిలిన మూడు వేరియంట్లు (అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌) మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ప్యూర్ వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. కాగా, ఈ నాలుగు వేరియంట్లు కూడా ఒకే రకమైన 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తాయి. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

ప్రస్తుతం టాటా మోటార్స్ ఇదే ఇంజన్ ను టియాగో మరియు ఆల్ట్రోజ్ వంటి మోడళ్లలో కూడా ఉపయోగిస్తోంది. గ్లోబల్-ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో టాటా పంచ్ వయోజన రక్షణ కోసం 16.45 పాయింట్ల స్కోరును సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన చిన్న కార్లలో టాటా పంచ్ కూడా ఒకటి.

Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

ముందుగా చెప్పినట్లుగా, కొత్త టాటా పంచ్ నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందించబడుతుంది. అవి Pure, Adventure, Accomplished, and Creative.అంతేకాకుండా, కంపెనీ తమ కస్టమర్ల కోసం Rythm, Dazzle మరియు iRA వంటి వంటి ప్రత్యేక కస్టమైజేషన్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. ఈ ప్యాకేజీల ధరలు వరుసగా రూ. 35,000, రూ. 45,000 మరియు రూ. 30,000 గా ఉన్నాయి. మరి ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

టాటా పంచ్ ప్యూర్ (మ్యాన్యువల్)

టాటా పంచ్ 'ప్యూర్' అనేది బేస్ వేరియంట్ మరియు ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. టాటా పంచ్ ప్యూర్ వేరియంట్లో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • రెండు ఎయిర్‌బ్యాగులు
  • ABS + EBD
  • RPAS
  • ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్
  • సెంట్రల్ లాకింగ్
  • IAC + ISS
  • బ్రేక్ స్వే కంట్రోల్
  • ఫ్రంట్ పవర్ విండోస్
  • టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్
  • 90 డిగ్రీల వరకూ తెరచుకునే డోర్స్
  • ఫ్లాట్ ఫ్లోర్
  • LED ఇండికేటర్స్
  • Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

    ఈ వేరియంట్ కోసం కంపెనీ రిథమ్ ప్యాక్ (Rythm Pack) అనే కస్టమైజేషన్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ రిథమ్ ప్యాక్ లో 3.5 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు 4 స్పీకర్లు లభిస్తాయి.

    Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

    టాటా పంచ్ అడ్వెంచర్ (మ్యాన్యువల్ / ఆటోమేటిక్):

    టాటా పంచ్ వేరియంట్ లైనప్‌లో అడ్వెంచర్ అనేది లోయర్-మిడ్ వేరియంట్. మార్కెట్లో ఈ వేరియంట్ ధరలు రూ. 6.39 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). టాటా పంచ్ అడ్వెంచర్ వేరియంట్లో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

    • ఫ్లోటింగ్ 3.5 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్
    • 4 స్పీకర్లు
    • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
    • USB ఛార్జింగ్ పోర్ట్
    • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
    • ఆల్ పవర్ విండోస్
    • ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు
    • యాంటీ-గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
    • ఫ్లిప్ కీ మరియు సెంట్రల్ రిమోట్ లాకింగ్
    • ఫుల్ వీల్ కవర్లు
    • బాడీ కలర్ సైడ్ మిర్రర్స్
    • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
    • Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

      టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ లాగానే, అడ్వెంచర్ వేరియంట్‌లో కూడా రిథమ్ ప్యాక్ ఉంటుంది. అయితే, అడ్వెంచర్ వేరియంట్‌ కోసం అందించే రిథమ్ ప్యాక్‌లో 7 ఇంచ్ హర్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అదనంగా 2 ట్వీటర్లు, AA/ACP మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

      Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

      టాటా పంచ్ అకాంప్లిష్డ్ (మ్యాన్యువల్ / ఆటోమేటిక్):

      టాటా పంచ్ అకాంప్లిష్డ్ అనేది టాటా పంచ్ వేరియంట్ లైనప్‌లో అప్పర్-మిడ్ వేరియంట్. మార్కెట్లో ఈ వేరియంట్ ధరలు రూ. 7.29 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). టాటా అకాంప్లిష్డ్ వేరియంట్ మరింత టెక్ లోడెడ్ ఫీచర్లతో వస్తుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

      Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?
      • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో ఫ్లోటింగ్ హర్మన్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
      • ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్
      • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
      • 4 స్పీకర్లు + 2 ట్వీటర్లు
      • R15 హైపర్ స్టైల్ వీల్స్
      • పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్
      • వన్-టచ్-డౌన్ పవర్ విండోస్
      • క్రూయిజ్ కంట్రోల్
      • డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు
      • ట్రాక్షన్ ప్రో (AMT)
      • Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

        టాటా పంచ్ అకాంప్లిష్డ్ వేరియంట్ కోసం కంపెనీ డాజల్ ప్యాక్ (Dazzle Pack) ను అందిస్తోంది. ఇందులో 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్లోటింగ్ ఎఫెక్ట్ కోసం A-పిల్లర్‌పై బ్లాక్ టేప్ వంటి అదనపు ఫీచర్‌లు లభిస్తాయి.

        Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

        టాటా పంచ్ క్రియేటివ్ (మ్యాన్యువల్ / ఆటోమేటిక్):

        టాటా పంచ్ క్రియేటివ్ ఈ లైనప్‌లో టాప్-ఎండ్ వేరియంట్ మరియు ఈ వేరియంట్ ధర రూ. 8.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఇండియా). టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వస్తుంది.

        Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?
        • 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
        • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు
        • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
        • A-పిల్లర్‌పై బ్లాక్ టేప్
        • రూఫ్ రెయిల్స్
        • 7 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్
        • ఆటో హెడ్‌ల్యాంప్‌లు
        • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
        • ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్
        • ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
        • కూల్డ్ గ్లవ్ బాక్స్
        • రియర్ వైపర్ + వాషర్
        • రియర్ డీఫాగర్
        • పడల్ ల్యాంప్స్
        • వెనుక సీటులో ఆర్మ్‌రెస్ట్
        • లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్
        • Tata Punch ఏ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయి..?

          టాటా పంచ్ క్రియేటివ్ టాప్-ఎండ్ వేరియంట్ కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన యాడ్-ఆన్ ఐఆర్ఏ ప్యాక్ (iRA Pack) ను అందిస్తోంది. ఇది కారుకు iRA కనెక్టెడ్ టెక్ ఫీచర్లను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 20, 2021, 13:11 [IST]
English summary
Tata punch micro suv variant wise features and price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+