మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా తమ మైక్రో ఎస్‌యూవీ పంచ్ (Punch) ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ పండుగ సీజన్ లో ఈ బుజ్జి ఎస్‌యూవీ విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ యొక్క అధికారిక ప్రారంభ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఆటోమోటివ్ ప్రపంచం మొత్తం Tata Punch కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

Tata Punch మైక్రో ఎస్‌యూవీలో కంపెనీ అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మార్కెట్లో విడుదల అవుతుందని అంచనా. ఈ కారును విడుదల చేయటానికి ముందే కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ తమ Tata Punch ఎస్‌యూవీకి సంబంధించిన పలు టీజర్ చిత్రాలను కూడా విడుదల చేస్తూ వస్తోంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఇటీవల Tata Punch మైక్రో ఎస్‌యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ ను చూపించే టీజర్ విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు తాజాగా సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైళ్లను చూపించే టీజర్ చిత్రాలను విడుదల చేసింది. గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పో Tata Motors ఆవిష్కరించిన HBX కాన్సెప్ట్ ఆధారంగా Punch మైక్రో ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్ కంపెనీ సిద్ధం చేసింది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

నిజానికి Tata HBX కాన్సెప్ట్ లో కనిపించిన అనేక డిజైన్ ఎలిమెంట్స్ ను ఈ ప్రొడక్షన్ వెర్షన్ Tata Punch లో కూడా చూడొచ్చు. ప్రత్యేకించి దాని హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ క్లస్టర్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, సైడ్ మిర్రర్స్, మజిక్యులర్ బానెట్ లైన్స్, డోర్ హ్యాండిల్స్, ఫ్యూయెల్ క్యాప్ డిజైన్ మరియు పియానో బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన ఏ, బి, సి పిల్లర్స్ మొదలైనవి ఈ రెండు మోడళ్లలో ఒకేలా కనిపిస్తాయి.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఆసక్తికరమైన విషయం ఎంటంటే, కొత్త Tata Punch మైక్రో ఎస్‌యూవీ ముందు భాగం చూడటానికి హారియర్ (Harrier) మరియు సఫారి (Safari) వంటి పెద్ద Tata ఎస్‌యూవీల డిజైన్ ను పోలి ఉంటుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, సింగిల్ స్లాట్ బ్లాక్ గ్రిల్, డ్యూయల్-టోన్ బంపర్ మరియు బ్లాక్ సరౌండ్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ మొదలైనవి ఉంటాయి.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

Tata Motors ఈ చిన్న కారును తమ పాపులర్ ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా రూపొందించే అవకాశం ఉంది. దీని డిజైన్ లోని ఇతర హైలైట్స్ ని పరీశిలిస్తే, సి- పిల్లర్ వద్ద మౌంట్ చేయబడిన రియర్ డోర్ హ్యాండిల్స్, కాంట్రాస్ట్ కలర్ వింగ్ మిర్రర్స్ (రూఫ్ కలర్ తో మ్యాచ్ అయ్యే సైడ్ మిర్రర్స్), స్వేర్డ్ వీల్ ఆర్చెస్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటి అంశాలు ఉన్నాయి.

అంతేకాకుండా, కంపెనీ ఈ చిన్న కారుని అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో, అందించే అవకాశం కూడా ఉంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఈ మైక్రో ఎస్‌యూవీ వివిధ రకాల ట్రాక్షన్ మోడ్‌లను అందించే, ఈ విభాగపు మొదటి వాహనం అని సూచిస్తుంది. ఇందులో మడ్, శాండ్, రాక్ మరియు స్నో వంటి డ్రైవింగ్ మోడ్స్ ఉండే అవకాశం ఉంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఇంకా Tata Motors మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్-ఫస్ట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది భావిస్తున్నారు. ఫలితంగా, ఇది వివిధ భూభాగాలకు అనువుగా ఉండే, రగ్గడ్ వెహికల్ గా ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీ ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇవి కూడా HBX కాన్సెప్ట్‌నే పోలి ఉండవచ్చని తెలుస్తోంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఈ చిన్న కారులో ఆఫర్ చేయబోయే కొన్ని ప్రీమియం ఫీచర్లను కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ (Tata Altroz) మోడల్ నుండి గ్రహించే అవకాశం ఉంది. ఆల్-బ్లాక్ థీమ్ ఇంటీరియర్, కంఫర్టబల్ సీటింగ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో వంటి మరికొన్ని ఫీచర్లను ఆశించవచ్చు.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఇంకా ఇందులో HVAC కంట్రోల్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, Tata IRA కనెక్టింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారులో అన్ని రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా ఆఫర్ చేయనుంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

Tata Punch మైక్రో ఎస్‌యూవీ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్ మొదలైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఈ బ్రాండ్ నుండి వచ్చే కొత్త వాహనాలు సాధారణంగా రెండు ప్లాట్‌ఫారమ్‌లపై నిర్మించబడతాయి. హ్యారియర్ మరియు సఫారీ వంటి పెద్ద ఎస్‌యూవీలను ల్యాండ్ రోవర్ యొక్క D8 ప్లాట్‌ఫామ్ పై తయారు చేస్తుండగా, చిన్న మోడళ్లు ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ పై లాంచ్ చేయబడతాయి.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, Tata Punch లో 1.2 లీటర్, 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజ ఆప్షన్లు ఉండవచ్చు. ఇందులోని మొదటి ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానున్న Tata Punch

దేశీయ మార్కెట్లో, Tata Punch ప్రధానంగా Mahindra KUV100, Maruti Suzuki Ignis మరియు Maruti Suzuki S-Presso వంటి మోడళ్లతో పోటీపడుతుంది. అంతేకాకుండా, ఈ మినీ ఎస్‌యూవీ Hyundai Santro మరియు Reanult Kwid వంటి హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్‌ను కూడా పట్టుకోగలదని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Tata punch might be packed with few segment first features in micro suv segment details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X