Just In
- 1 hr ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 3 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 16 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 20 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Movies ‘సీరియల్స్‌లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Tata Punch గురించి మరింత సమాచారం.. ఇప్పుడు మీకోసం
Tata Motors యొక్క Tata Punch మైక్రో SUV భారతీయ మార్కెట్లో 2021 అక్టోబర్ 04 న అడుగుపెట్టనుంది. కావున కంపెనీ ఈ SUV యొక్క అమ్మకాలను కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మైక్రో SUV గురించి చాలా సమాచారం కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు విడుదలైన ఫోటోలలో Tata Punch యొక్క ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ అంటి వాటిని స్పష్టంగా చూడవచ్చు.
ఇప్పుడు వెల్లడైన చిత్రాల ప్రకారం, ఇది బ్రౌన్ కలర్ మోడల్ డ్యూయల్ టోన్ అవతార్‌లో కనిపిస్తుంది. అంతే కాకుండా రూఫ్ బ్లాక్ కలర్లో ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడటానికి ఒక చిన్న హ్యారియర్ లాగా కనిపిస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ ఫోర్ స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
కొత్త Tata Punch SUV ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన బ్లాక్ గ్రిల్ ఉంటుంది. హెడ్‌లైట్ దీనికి దిగువన ప్రొజెక్టర్ యూనిట్ ఉంటుంది. దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది మరియు హ్యాండిల్‌పై టర్న్ ఇండికేటర్ మరియు ముందు డోర్స్ పై ORVM ఇవ్వబడింది.
Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. దానికి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడింది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే, టాటా పంచ్‌లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, డాష్‌బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, IRA కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో అందించే అవకాశం ఉంటుంది.
అంతే కాకుండా ఇందులో 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.
Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.
ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.
ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం కొత్త Tata Punch నాలుగు ట్రిమ్‌లలో విడుదల కానుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ (Accomplished) మరియు క్రియేటీవ్ ట్రిమ్స్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.
ఇక కొత్త Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ ప్యూర్, అడ్వెంచర్ మరియు ఆకాంప్లిష్డ్ ట్రిమ్‌లలో లభిస్తుంది. అదేవిధంగా డ్యూయెల్ టోన్ కలర్స్ కేవలం టాప్ స్పెక్ ట్రిమ్ అయిన క్రియేటివ్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Tata పంచ్ యొక్క అధికారిక బుకింగ్స్ మరియు ధర వంటివి త్వరలో వెల్లడవుతాయి. అయితే డెలివరీలు రానున్న పండుగ సీజన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు కంపెనీ విడుదల చేయనున్న కొత్త Tata Punch మైక్రో SUV కోసం ఎదురు చూస్తున్నారు.
Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఈ SUV ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.