Tata Punch కొత్త వీడియో.. మీ డౌట్స్ అన్నింటికీ సమాధానం..ఇదే
భారతీయ వాహన తయారీ సంస్థ అయిన Tata Motors (టాటా మోటార్స్) ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త Tata Punch మైక్రో SUV ని ఆవిష్కరించబడింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కొత్త Tata Punch కి సంబందించిన ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో Tata Punch యొక్క డిజైన్, ఫీచర్లు, పరికరాలు మరియు పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి పూర్తిగా చూడవచ్చు.

Tata Motors (టాటా మోటార్స్) దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన Tata Punch యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక కంపెనీ విడుదల చేసిన ఈ వీడియోలో ఫీచర్స్ మరియు ఇంటీరియర్ డిజైన్ వంటివి స్పష్టంగా చూడవచ్చు. దీనితో పాటు Tata Punch వివిధ మార్గాల్లో ప్రయాణించడం చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో ఉన్న 'ట్రాక్షన్ ప్రో మోడ్' ఎలా పనిచేస్తుందో కూడా చూడవచ్చు.

Tata Motors ఈ కొత్త Tata Punch బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది, కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్ లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మైక్రో SUV డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ SUV ధర కంపెనీ 2021 అక్టోబర్ 20 న ప్రకటించే అవకాశం ఉంటుంది.

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్, డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ అనే 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. ఇది చాలా ఆకర్శణీయంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Tata Punch యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.
Tata Punch యొక్క కోలతలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీని ప్రకారం Tata Punch పొడవు 3,840 మిమీ, 1,800 మిమీ వెడల్పు మరియు 1635 మిమీ ఎత్తు మరియు 2,450 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

టాటా పంచ్ ప్రస్తుతం దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ప్రదర్శించబడుతోంది, ఇక్కడ సందర్శించడం ద్వారా వినియోగదారులు ఈ కారును చూడవచ్చు. అంతే కాకుండా ఈ కారుని సందర్శించే సమయంలో మీరు ఒక చిన్న వీడియో లేదా రీల్ చేసి PUNCHATHON మరియు Tata Motors హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేయడం ద్వారా దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఈ విధంగా చేసి ఉచితంగా Tata Punch సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








