Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ విఫణిలో టాటా పంచ్ (Tata Punch) అనే మైక్రో SUV విడుదల చేసినా విషయం తెలిసిందే. ఈ SUV దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇది సాధారణ వాహనంగా అయితే సరి, కానీ ఆఫ్ రోడ్ వాహనంగా ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ SUV యొక్క డిజైన్ లో మార్పులు చేయడమే కాకుండా, ఇందులో ఆఫ్ రోడింగ్ కి కావాల్సిన అన్ని మార్పులు జరిగాయి. డీఐ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

టాటా పంచ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దీనిని ఆఫ్ రోడింగ్ కి అనుకూలంగా మలచడానికి కావాల్సిన మార్పులు చేశారు. కాలం ఈ SUV యొక్క ముందు భాగంలో, దాని రూపాన్ని అలాగే ఉంచారు, అయితే మధ్యలో రెండు హెడ్‌లైట్లు అమర్చబడి ఉన్నాయి. దీని వల్ల ఇది పాత జీప్‌ను గుర్తు చేస్తుంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

అంతే కాకూండా గ్రిల్ దిగువ భాగంలో తెల్లటి లైట్ ఇవ్వబడింది, ఈ లైట్ రూఫ్ రైల్‌పై కూడా కనిపిస్తుంది. రూప్ భాగంలో రూప్ రైల్స్ కూడా కనిపిస్తాయి. కావున దీనిపైన లగేజ్ ఉంచుకోవచ్చు. ఇందులోని పెద్ద వీల్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, ఇవి ఆఫ్-రోడ్‌కు సరిపోయేలా సన్నని కట్‌లతో వస్తాయి. అయితే వెనుక భాగం కూడా అలాగే ఉంచబడింది. ఇందులో మిగిలిన ఎటువంటి మార్పులు జరగలేదు.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

ఇది చూడటానికి చిన్న SUV అయినప్పటికీ ఆఫ్-రోడ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని టెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన చాలా వీడియోలో కూడా బయటపడ్డాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే టాటా పంచ్ చిన్న SUV అయినప్పటికీ మంచి సామర్థ్యం కలిగి ఉంటుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

టాటా పంచ్ యొక్క పరిమాణం విషయానికి వస్తే, ఈ మైక్రో SUV పొడవు 3,827 మి.మీ, వెడల్పు 1,742 మిమీ, ఎత్తు 1,615 మిమీ మరియు వీల్‌బేస్‌ 2,445 మిమీ వరకు ఉటుంది. అంతే కాకూండా దీని గ్రౌడ్ క్లియరెన్స్ 187 మిమీ వరకు ఉంటుంది, అదేవిధంగా వాటర్ వెండింగ్ కెపాసిటీ 370 మిమీ వరకు ఉంటుంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

టాటా పంచ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ SUV కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో ఇది కేవలం 16.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఈ మోడల్‌లో బ్రేక్ స్వింగ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

కంపెనీ నివేదికల ప్రకారం, టాటా మోటార్స్ తన కొత్త టాటా పంచ్‌ను టర్బో పెట్రోల్‌ ఆప్సన్ తో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దీనిని కంపెనీ 2022 ఫిబ్రవరి-మార్చి నెలలో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ పైన పనిచేస్తోంది. కావున కస్టమర్లు ఈ వేరియంట్ వచ్చే సంవత్సరంలో బుక్ చేసుకోవచ్చు.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

ప్రస్తుతం తక్కువ ధర వద్ద ఆధునిక ఫీచర్స్ కలిగి, సేఫ్టీ విషయంలో తనకు తానే సాటిగా నిలిచిన టాటా పంచ్ ఎంతోమంది కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది.

Tata Punch ఆఫ్ రోడర్: పిట్ట కొంచెమైనా.. కూత ఘనమేనండోయ్

Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

Image Courtesy: NStreet Designs

Most Read Articles

English summary
Tata punch off road concept design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X