Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

భారత స్మాల్ కార్ మార్కెట్లోకి కొత్తగా మరొక మోడల్ వచ్చి చేరింది. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తమ సరికొత్త టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీని కంపెనీ నిన్న (ఆక్టోబర్ 4) అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనే నాలుగు వేరియంట్లలో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

ఈ నాలుగు వేరియంట్లలో ప్యూర్ (Pure) అనేది బేస్ వేరియంట్. టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఫీచర్ తో మాత్రే లభ్యం కానుంది, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు. మరి ఈ బేస్ వేరియంట్లో లభించే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డీటేల్స్, స్టాండర్డ్ మరియు సేఫ్టీ ఫీచర్స్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వివరాలు, మైలేజ్ అంచనా ధర వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

Tata Punch Pure ఫీచర్లు

  • ముందు వైపు మాత్రమే పవర్ విండోస్
  • టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ తో కూడిన స్టీరింగ్ వీల్
  • 90 డిగ్రీల వరకూ తెరచుకునే తలుపులు
  • ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు
  • బ్లార్ కలర్ డోర్ హ్యాండిల్స్
  • క్రోమ్ లైన్ గార్నిష్
  • పెయింట్ చేయబడిన బంపర్స్
  • బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్
  • రియు గుమ్మము క్లాడింగ్
  • Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

    Tata Punch Pure సేఫ్టీ ఫీచర్లు

    • రెండు ఎయిర్‌బ్యాగులు (డ్రైవర్, కో-డ్రైవర్)
    • ఏబిఎస్ విత్ ఈబిడి
    • ఆర్‌పిఏఎస్
    • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్
    • సెంట్రల్ లాకింగ్ సిస్టమ్
    • ఈఎస్ఎస్ టెక్నాలజీ
    • బ్రేక్ స్వే కంట్రోల్
    • Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      Tata Punch Pure ఇంజన్, గేర్‌బాక్స్

      దేశీయ విపణిలో టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ ఒకేఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభ్యం కానుంది. కాబట్టి, అన్ని వేరియంట్లలో ఒకే రకమైన ఇంజన్ ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

      Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      ఇదివరకు చెప్పుకున్నట్లుగా టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను కావాలనుకునే కస్టమర్లు మాత్రం ఇతర వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

      Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      టాటా పంచ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ లలో 'ట్రాక్షన్ ప్రో' (Traction Pro) మోడ్ ఇవ్వబడింది. కారు బురదలో చిక్కుకున్నప్పుడు ఈ మోడ్ ఉపయోగపడుతుంది మరియు అలాంటి పరిస్థితి నుండి బయటపడటానికి డ్రైవర్ ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయమని కూడా ఇది ప్రేరేపిస్తుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయని తెలుస్తోంది. వాటిలో ఒకటి సిటీ రోడ్ల కోసం, ఇంకొకటి హైవేల కోసం మరియు మరొకటి జారే లేదా తడిగా ఉండే రోడ్ల కోసం ఉపయోగించవచ్చు.

      Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      Tata Punch పెర్ఫార్మెన్స్, మైలేజ్

      కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ కేవలం 6.5 సెకండ్లలోనే గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, అలాగే, 16.5 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

      Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      ఇక మైలేజ్ విషయానికి వస్తే, టాటా మోటార్స్ ఈ విషయాన్ని కూడా లాంచ్ డేట్ వరకూ గోప్యంగా ఉంచింది. త్వరలోనే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టాటా పంచ్ కారుని టెస్ట్ డ్రైవ్ చేయబోతోంది. అప్పుడు, ఈ చిన్న కారు యొక్క హ్యాండ్లింగ్, మైలేజ్, పెర్ఫార్మెన్స్ వంటి పలు అంశాలను మీతో పంచుకుంటాము. సదూర ప్రయాణాలకు వీలుగా కంపెనీ ఈ కారులో 37 లీటర్ల ఇంధన ట్యాంక్ ను అందించింది.

      Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

      Tata Punch Pure కలర్ ఆప్షన్స్

      • ఓర్క్స్ వైట్
      • అటామిక్ ఆరెంజ్
      • డేటోనా గ్రే
      • మెటోర్ బ్రాంజ్
      • కాలిప్సో రెడ్
      • ట్రాపికల్ మిస్ట్
      • టోర్నాడో బ్లూ
      • Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

        Tata Punch Pure వీల్స్, టైర్స్ మరియు బ్రేకులు

        టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ లో కంపెనీ ఆర్15 స్టీల్ వీల్స్ ని ఆఫర్ చేస్తోంది. ఈ చక్రాలపై 185/70 R15 ప్రొఫైల్ తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. కాగా, పెద్ద చక్రాలను కోరుకునే వారు క్రియేటివ్ వేరియంట్ ను ఎంచుకోవచ్చు. ఇందులో 195/60 R16 అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లను కంపెనీ అందిస్తోంది. కాగా, అన్ని వేరియంట్లకు స్పేర్ వీల్ ( 185/70 R15 స్టీల్ వీల్) ఒకేలా ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.

        Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

        Tata Punch కొలతలు

        టాటా పంచ్ కొలతలను గమనిస్తే (సైడ్ మిర్రర్స్ పరిగణలోకి తీసుకోకుండా), ఈ చిన్న ఎస్‌యూవీ మొత్తం పొడవు 3,827 మిమీ, వెడల్పు 1742 మిమీ, ఎత్తు 1615 మిమీ మరియు వీల్‌బేస్ 2,445 మిమీ గా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

        Tata Punch Pure బేస్ వేరియంట్‌ను కొనొచ్చా? లభించే ఫీచర్లు ఏంటి?

        డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

        టాటా పంచ్ యొక్క బేస్ వేరియంట్‌లో కంపెనీ కావల్సిన అన్ని ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోంది. కాకపోతే, అంతకు మించిన కంఫర్ట్ లేదా కన్వీనెంట్ ఫీచర్లను, వినోదం కోసం పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్‌ను మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను కోరుకునే వారికి టాప్-ఎండ్ క్రియేటివ్ వేరియంట్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకేవళ మీరు బడ్జెట్‌కి లోబడి ఉన్నట్లయితే, ఈ బేస్ వేరియంట్ ను కొనుగోలు చేసి, ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులో కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.5 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

Most Read Articles

English summary
Tata punch pure base variant features safety mileage expected price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X