Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

భారతీయ మార్కెట్లో Tata Motors యొక్క కొత్త మైక్రో SUV Tata Punch ఇటీవల ఆవిష్కరించబడింది. ఈ కొత్త Tata Punch అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్శణీయంగా ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా అధికారికంగా ప్రారంభించింది. కావున కొనువులుదారులు కంపెనీ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 లతో బుక్ చేసుకోవచ్చు. Tata Punch అక్టోబర్ 20 న దేశీయ మార్కెట్లో విడుదల కానుంది.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

ఈ రోజు నుండి Tata Motors కంపెనీ ఈ కొత్త Tata Punch మైక్రో SUV ని డీలర్‌షిప్‌లో ప్రదర్శించబోతోంది, కావున కస్టమర్లు దీనిని డీలర్‌షిప్‌లో చూడవచ్చు. అంతే కాకుండా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు దీనిని ఈ రోజు నుంచి టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. కంపెనీ ఈ టెస్ట్ డ్రైవ్ కోసం టెస్ట్ మోడల్‌ని కూడా అందుబాటులో ఉంచింది.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch యొక్క కొలతలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీని ప్రకారం Tata Punch పొడవు 3,840 మిమీ, 1,800 మిమీ వెడల్పు మరియు 1635 మిమీ ఎత్తు మరియు 2,450 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Tata Punch టెస్ట్ డ్రైవ్‌ షురూ.. మీరు రెడీనా..!!

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. కొత్త Tata Punch చూడటానికి చాలా ఆకర్శణీయంగా ఉండి, ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంటుంది, కావున మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 9, 2021, 12:43 [IST]
English summary
Tata punch reaches dealership customer can test drive from today details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+