Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors; ఎలా ఉందో చూసారా!!

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రముఖ దేశీయ కంపెనీ అయిన Tata Motors ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఒక సరికొత్త మోడల్ Tata Punch (టాటా పంచ్) ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

కంపెనీ నివేదికల ప్రకారం Tata Punch పండుగ సీజన్‌లో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే Tata Punch (టాటా పంచ్) ఇప్పటికే అనేక టీజర్ వీడియోలను విడుదల చేసింది. ఇటీవల కూడా ఒక కొత్త వీడియో విడుదలైంది. ఈ వీడియోలో దాని మొత్తం డిజైన్, ముందు, వెనుక మరియు వైపు చూడవచ్చు.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

ఈ వీడియోలో మీరు గమయించినట్లతే కొత్త టాటా పంచ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ వీడియోలో, టాటా పంచ్ యొక్క గ్రిల్‌లో టాటా లోగోను చూడవచ్చు. ఇది ఎల్ఈడి డిఆర్‌ఎల్‌ల మధ్యలో ఉంచబడింది. దీనికి ఇరువైపులా హెడ్‌లైట్ కూడా చూడవచ్చు. దాని కింద ఫాగ్ లైట్ ఉంది. ఇక నంబర్ ప్లేట్ మరియు స్కిడ్ ప్లేట్ దాని క్రింద ఉంచబడ్డాయి.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

నాలుగు వైపులా ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ చూడవచ్చు, రూఫ్ తెల్లగా ఉంచబడింది మరియు రూఫ్ రైల్ బ్లాక్ కలర్‌లో ఉంచబడింది, ఇది చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తుంది, అయితే ORVM ఉంది నలుపు రంగులో ఉంచబడింది. ఇవన్నీ కూడా కారుని అద్భుతంగా చూపిస్తాయి.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

ఈ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించే మరొక విషయం దాని డోర్ హ్యాండిల్, ముందు డోర్ పై ​​హ్యాండిల్ సాంప్రదాయ పద్ధతిలో ఉంచబడింది, కానీ వెనుక డోర్‌లోని హ్యాండిల్ పైకి ఉంచబడుతుంది. వెనుక భాగంలో LED టెయిల్ లైట్ ఉంచబడింది, అలాగే స్టాప్ లైట్ ఎగువన ఉంచబడింది.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

కంపెనీ కొత్త టాటా పంచ్ యొక్క ఇంటీరియర్‌లను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావున వాహనదారుని భద్రతకు ఎలాంటి డోకా ఉండదు.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై టాటా ఆల్ట్రోజ్ వంటి కారు నిర్మించబడింది, ఇది దాని విభాగంలో 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబిడి, స్పీడ్ అలర్ట్ మరియు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. మొత్తానికి ఇది అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుందని భావించవచ్చు.

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

టాటా మోటార్స్ తన కొత్త టాటా పంచ్ ని అక్టోబర్ చివరలో లేదా నవంబర్ ప్రారంభంలో తీసుకురావచ్చని భావిస్తున్నాము. టాటా పంచ్ పండుగ సీజన్‌లో తీసుకురావాలని కంపెనీ చెబుతోంది, దీని ద్వారా కంపెనీ క్రమంగా పాపులర్ అవుతున్న మైక్రో ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించబోతోంది.

Tata Punch కొత్త వీడియో రిలీజ్ చేసిన Tata Motors

టాటా పంచ్ డిజైన్ పూర్తిగా వెల్లడి చేయబడింది కానీ ఫీచర్లు, వేరియంట్లు, ఇంజిన్ మొదలైనవి కంపెనీ వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ దీని గురించి సమాచారం ఇవ్వగలదు మరియు బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 14, 2021, 20:40 [IST]
English summary
Tata punch suv new teaser design features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+