చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రముఖ దేశీయ కంపెనీ అయిన Tata Motors ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఒక సరికొత్త మోడల్ Tata Punch (టాటా పంచ్) ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త Tata Punch యొక్క టీజర్ విడుదల చేసింది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Motors విడుదల చేసిన ఈ కొత్త Tata Punch టీజర్ ఇమేజ్ మీరు గమనించినట్లతే దాని ముందు భాగం చూడవచ్చు. ఈ కొత్త టీజర్ లో Tata Punch యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని చూపించడానికి కంపెనీ ప్రయత్నించింది. Tata Punch దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి గాను నిరంతరం టెస్ట్ చేస్తూనే ఉంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Punch యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, Tata Harrier మరియు Safari మోడల్స్ లాగా ఉందనిపిస్తుంది. అంటే ఈ కొత్త మోడల్ అదే స్ప్లిట్ హెడ్‌లైట్ మరియు గ్రిల్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ మరియు బాడీ దాని కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Punch అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీలో Tata Nexon తరహాలో 7 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటు ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది.

అంతేకాకుండా, Tata Punch లో కంపెనీ Harman ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించవచ్చు. ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆశించవచ్చు.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, Tata Punch ఈ విభాగంలో హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు మరియు మినీ ఎస్‌యూవీలకు గట్టిపోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి మోడళ్లతో పాటుగా త్వరలో రాబోయే Hyundai Casper వంటి మోడళ్లతో కూడా పోటీపడే అవకాశం ఉంది.

చిన్న కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న 'Tata Punch' టీజర్ వచ్చేసింది

Tata Motors ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ని 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ పేరు గురించి ఉన్న ఊహాగానాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి. Tata Punch రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది, కావున ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tata Punch (టాటా పంచ్) ధర వంటి వివరాలు ఇంకా పూర్తి వెల్లడవ్వలేదు, కానీ త్వరలో దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా విడుదలవుతాయి. అయితే ఈ కొత్త మినీ Tata Punch దేశీయ మార్కెట్లో విడుదలయితే ఈ సెగ్మెంట్లోని వాహనాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Saturday, August 28, 2021, 9:48 [IST]
English summary
Tata punch suv new teaser front design details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+