Tata Motors నుంచి రానున్న కొత్త మోడల్ 'Punch'; మీకు తెలుసా?
భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త ఫీచర్స్ తో విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రముఖ దేశీయ కంపెనీ అయిన Tata Motors ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఒక సరికొత్త మోడల్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Motors దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్న కొత్త మోడల్ HBX కాన్సెప్ట్. అయితే కంపెనీ ఈ కొత్త HBX మోడల్ పేరును "Tata Punch" అని నామకరణం చేసింది. Tata Punch అనేది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ కారు. ఇది చిన్న SUV కూడా.

Tata Motors ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ని 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా దీని పేరుపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ పేరు గురించి ఉన్న ఊహాగానాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి. ఎందుకంటే కంపెనీ ఈ కాన్సెప్ట్ మోడల్ పేరును ఇప్పుడు అధికారికంగా వెల్లడించింది.

కంపెనీ ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ని త్వరలో వెల్లడించనుంది. కంపేనీ దీని గురించి చెబుతూ ఇది అందరిని దృష్టిలో ఉంచుకుని తయారుచేయబడిన కారు అని తెలిపింది. కొత్త Tata Punch కాన్సెప్ట్ మోడల్ ALFA-ARC ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఈ మోడల్ కి సంబంధించిన మొదటి చిత్రాన్ని విడుదల చేసింది.

కంపెనీ విడుదల చేసిన ఈ ఫొటోలో రాబోయే Tata Punch మోడల్ యొక్క డిజైన్ చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మొత్తానికి దీని డిజైన్ చూడగానే Tata Harrier మరియు Safari మోడల్స్ లాగా ఉందనిపిస్తుంది. అంటే ఈ కొత్త మోడల్ అదే స్ప్లిట్ హెడ్‌లైట్ మరియు గ్రిల్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ మరియు బాడీ దాని కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది.

Tata Punch రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది, కావున ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కంపెనీ ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ యొక్క ఇంటీరియర్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ మోడల్ బయట లాగా, లోపల కూడా కాన్సెప్ట్ మోడల్ లాగా ఉంచవచ్చు. దాని డాష్‌బోర్డ్ రూపాన్ని అలాగే ఉంచవచ్చు.

ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఏసీ వెంట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా ఉండవచ్చు. Tata Punch యొక్క లోయర్ వేరియంట్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండవచ్చు. ఇది 86 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకూండా దాని టర్బో ఛార్జ్డ్ వెర్షన్ దాని హై వేరియంట్ లో ఉండవచ్చు, కానీ అధికారికంగా నిర్దారించలేదు.

Tata Motors యొక్క చిన్న వేరియంట్ Tata Punch కోసం వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. దీని ధర సుమారు రూ. 5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ అనేక కొత్త ఫీచర్లను మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Tata Motors కంపెనీ కొత్త Tata Punch కాన్సెప్ట్ మోడల్ తో దేశీయ మార్కెట్లో మరింత బలోపేతం కావడానికి ఎదురు చూస్తోంది. అయితే ఈ మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైతే చిన్న మోడల్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. Tata Punch దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత Maruti Ignis, Renault Kiger మరియు Nissan Magnite వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Tata Motors నుంచి ఇప్పటికే Tata Harrier వంటి మోడల్స్ విడుదలై ఇతర వాహనదారులకు గట్టి పీటీ ఇస్తున్నాయి. ఇక ఈ కొత్త మోడల్ విడుదలైతే మరింత ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే చాలామంది కస్టమర్లు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైతే మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








