ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) దేశీయ మార్కెట్లో Tata Punch అనే కొత్త మైక్రో SUV ని 2021 అక్టోబర్ 04 న ఉదయం 11 గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ కొత్త మైక్రో SUV యొక్క బుకింగ్స్ కూడా అదే రోజున ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

కొత్త Tata Punch ఇప్పటికే చాలా సార్లు స్పాట్ టెస్ట్ లో కనిపించింది. అంతే కాకుండా ఈ SUV కోసం అనధికారిక బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున డెలివరీలు అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

కంపెనీ ఈ మైక్రో SUV ని అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదలచేయకముందే, ఈని గురించి చాలా సమాచారాన్ని అందించింది. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇది మొత్తం నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ (Accomplished) మరియు క్రియేటీవ్ ట్రిమ్స్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

కొత్త Tata Punch ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. కావున టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. టాటా Punch కంపెనీ యొక్క లేటెస్ట్ మైక్రో SUV కానుంది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

కొత్త Tata Punch SUV ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన బ్లాక్ గ్రిల్ ఉంటుంది. హెడ్‌లైట్ దీనికి దిగువన ప్రొజెక్టర్ యూనిట్ ఉంటుంది. దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది మరియు హ్యాండిల్‌పై టర్న్ ఇండికేటర్ మరియు ముందు డోర్స్ పై ORVM ఇవ్వబడింది.

Tata Punch యొక్క కొలతలను గమనించినట్లయితే, దీని పొడవు 3,840 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు ఎత్తు 1,635 మిమీ ఉంటుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 187 మిమీ వరకు ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. దానికి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడింది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే, టాటా పంచ్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, డాష్‌బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, IRA కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అందించే అవకాశం ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

అంతే కాకుండా ఇందులో 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Tata Motors ఇప్పుడు ఈ కొత్త Tata Punch ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ ఇవ్వబడుతుంది. ఇది కారు ఎప్పుడైనా బురదలో చిక్కుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి డ్రైవర్ ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫీచర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

ఇప్పుడు వెలువడిన తాజా నివేదికల ప్రకారం, కంపెనీ కొత్త Tata Punch మైక్రో SUV లో 1.2-లీటర్, మూడు-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ ఉపయోగించనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే కంపెనీ యొక్క ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ Tata Tiago లో ఉపయోగించబడింది.

కంపెనీ ఇందులో ఉపయోగించిన ఇంజిన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ఆవిష్కరణకు సిద్దమైన Tata Punch; తేదీ వెల్లడించిన Tata Motors

ఇక కొత్త Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ ప్యూర్, అడ్వెంచర్ మరియు ఆకాంప్లిష్డ్ ట్రిమ్లలో లభిస్తుంది. అదేవిధంగా డ్యూయెల్ టోన్ కలర్స్ కేవలం టాప్ స్పెక్ ట్రిమ్ అయిన క్రియేటివ్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఈ SUV ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, September 30, 2021, 15:55 [IST]
English summary
Tata punch unveil on 4th october details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+