Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) గత కొంత కాలంగా చిన్న కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీని కంపెనీ నేడు (ఆక్టోబర్ 4) అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బుజ్జి ఎస్‌యూవీ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్.

Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

టాటా పంచ్ బేస్ వేరియంట్ (ప్యూర్) లో మాత్రం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు, ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. కాగా, మిలిగిన మూడు వేరియంట్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. టాటా పంచ్ వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

టాటా మోటార్స్ ఇంకా తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీ ధరలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్ లను కూడా ప్రారంభించింది. టాటా పంచ్ అక్టోబర్ 20వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది, అదే రోజున కంపెనీ దాని వేరియంట్ల ధరలను ప్రకటించనుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ కారును డీలర్‌షిప్‌లకు డెలివరీ చేయడం ప్రారంభించంది. టాటా పంచ్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే దాని డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ ఒకేఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభ్యం కానుంది. ఇందులో 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

టాటా పంచ్ ప్యూర్ (Tata Punch Pure):

టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు. ఈ వేరియంట్లో లభించే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

 • రెండు ఎయిర్‌బ్యాగులు
 • ఏబిఎస్ విత్ ఈబిడి
 • ఆర్‌పిఏఎస్
 • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్
 • సెంట్రల్ లాకింగ్ సిస్టమ్
 • బ్రేక్ స్వే కంట్రోల్
 • ఫ్రంట్ పవర్ విండో
 • టిల్ట్ స్టీరింగ్
 • 90 డిగ్రీల వరకూ తెరచుకునే తలుపులు
 • వెనుక వైపు ఫ్లాట్ ఫ్లోర్
 • ఎల్ఈడి ఇండికేటర్స్
 • బ్లాక్ డోర్ హ్యాండిల్స్
 • క్రోమ్ లైన్ గార్నిష్
 • పెయింట్ చేసిన బంపర్
 • బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్
 • Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

  టాటా పంచ్ అడ్వెంచర్ (Tata Punch Adventure):

  టాటా పంచ్ అడ్వెంచర్ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్లో పైన తెలిపిన ప్యూర్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా, క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి. అవి:

  • ఫ్లోటింగ్ 4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 4 స్పీకర్లు
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
  • యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
  • అన్ని పవర్ విండోస్
  • ఫాలో మి హోమ్ హెడ్‌లైట్
  • యాంటీ గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
  • రిమోట్ సెంట్రల్ లాకింగ్
  • ఫుల్ వీల్ కవర్స్
  • బాడీ కలర్ సైడ్ మిర్రర్స్
  • Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

   టాటా పంచ్ ఆకాంప్లిష్డ్ (Tata Punch Accomplished)

   టాటా పంచ్ ఆకాంప్లిష్డ్ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్లో పైన తెలిపిన అడ్వెంచర్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా, క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి. అవి:

   • 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
   • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
   • 4 స్పీకర్లు, 2 ట్వీటర్లు
   • రివర్స్ పార్కింగ్ కెమెరా
   • ఎల్ఈడి టెయిల్ లైట్స్
   • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
   • ఆర్15 వీల్స్
   • పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్
   • వన్‌టచ్ విండో డౌన్ బటన్
   • క్రూయిజ్ కంట్రోల్
   • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
   • ట్రాక్షన్ ప్రో (ఏఎమ్‌టిలో మాత్రమే)
   • Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

    టాటా పంచ్ క్రియేటివ్ (Tata Punch Creative):

    టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్లో పైన తెలిపిన ఆకాంప్లిష్డ్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా, క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి. అవి:

    • ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
    • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
    • ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
    • రూఫ్ రెయిల్స్
    • 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • ఆటో హెడ్‌లైట్స్
    • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
    • ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • కూల్డ్ గ్లవ్ బాక్స్
    • రియర్ వైపర్ మరియు వాషర్
    • రియర్ డీఫోగర్
    • పడల్ ల్యాంప్
    • రియర్ సీటు ఆర్మ్ రెస్ట్
    • లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ మరియు గేర్ నాబ్
    • Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

     వీటితో పాటుగా కంపెనీ ఈ వేరియంట్ల కోసం కొన్ని ఆప్షనల్ ప్యాక్‌లను అందుబాటులో ఉంచనుంది. వీటిని అదనపు యాక్ససరీలుగా పంచ్ ఎస్‌యూవీలో అమర్చుకోవచ్చు మరియు మరింత అందంగా మార్చుకోవచ్చు.

     ప్యూర్ - రిథమ్ ప్యాక్

     • 4 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
     • 4 స్పీకర్లు మరియు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
     • అడ్వెంచర్ - రిథమ్ ప్యాక్

      • 7 ఇంచ్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
      • 2 ట్వీటర్లు
      • రియర్ కెమెరా
      • ఆకాంప్లిష్డ్ - డాజిల్ ప్యాక్

       • 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
       • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
       • ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
       • ఏ పిల్లర్ బ్లాక్ టేప్
       • క్రియేటివ్ - ఐఆర్ఏ ప్యాక్

        • ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ
        • డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం
        • Tata Punch వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - ఫుల్ డీటేల్స్

         టాటా పంచ్ వేరియంట్ల వారీ ఫీచర్లను గమనిస్తే, కంపెనీ దీని బేస్ వేరియంట్‌లో కూడా అనేక ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోంది. అంతేకాకుండా, కస్టమర్లు తమ పంచ్ ఎస్‌యూవీలోని ఫీచర్లను మెరుగుపరచడానికి రిథమ్ ప్యాక్ లను కూడా అందిస్తోంది. అయితే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లో కంపెనీ అవసరమైన అన్ని ఫీచర్లను అందిస్తోంది. ఒకవేళ, ఈ వేరియంట్ సరసమైన ధరకే ప్రవేశపెట్టబడినట్లయితే, ఇది మార్కెట్లో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata punch variant wise features specs engine gearbox details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X