రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న నెక్స్ట్ జనరేషన్ టాటా సఫారీ (Tata Safari) ఎస్‌యూవీ ధరలను మరోసారి పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను ఈ మోడల్ ధరలు రూ. 3,000 నుండి రూ. 7,000 మధ్యలో పెరిగాయి. మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

టాటా మోటార్స్ తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ ధరలను పెంచిన తర్వాత, ఇప్పుడు సఫారీ ధరలను కూడా పెంచింది. అయితే, మంచి విషయం ఏంటంటే, కంపెనీ కేవలం టాటా సఫారీ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలను మాత్రమే పెంచింది, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ల ధరలను పెంచలేదు. డిసెంబర్ 2021 నెలలో ఈ ధరల పెరుగుదల రూ. 3,000 మరియు రూ. 7,000 మధ్యలో ఉంది.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

ధరల పెరుగుదల అనంతరం టాటా సఫారీ ఎక్స్ఎమ్ఏ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 17.83 లక్షలకు చేరుకుంది, అంటే ఈ వేరియంట్ పై సుమారు రూ. 3,000 మేర ధర పెరిగింది. అలాగే, ప్రస్తుతం రూ. 20.15 లక్షలుగా ఉన్న ఎక్స్‌టిఎ ప్లస్ వేరియంట్ ధర రూ. 7,000 మేర పెరిగింది. కాగా, టాటా సఫారీ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ల ధరలు ప్రస్తుతం రూ. 14.99 లక్షల నుంచి రూ. 21.89 లక్షల మధ్యలో ఉండగా, ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరలు రూ. 17.80 లక్షల నుండి రూ. 23.17 లక్షల మద్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

టాటా మోటార్స్ తమ డార్క్ ఎడిషన్ శ్రేణిని విస్తరించేందుకు కంపెనీ సఫారీ ఎస్‌యూవీలో కూడా ఓ డార్క్ ఎడిషన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో టాటా సఫారీ డార్క్ ప్రారంభించబడుతుందని అంచనా. ఈ ఎస్‌యూవీ యొక్క డార్క్ ఎడిషన్ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. నలుపు రంగులో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు చార్‌కోల్ బ్లాక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు పియానో-బ్లాక్ టచ్‌లతో రీప్లేస్ చేయబడిన క్రోమ్ భాగాలు దాని ఎక్ట్సీరియర్‌లో అత్యంత ఆకర్షణీయమైన హైలైట్‌లుగా ఉంటాయి.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

అలాగే, సైడ్ ఫెండర్‌లపై ఉన్న డార్క్ లోగో దీనిని సాధారణ వేరియంట్‌ల నుండి మరింత విభిన్నంగా ఉండేలా చేస్తాయి. అదనంగా, ఈ ఎస్‌యూవీ ముదురు నీలం రంగు ఒబెరాన్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంచబడుతుంది. క్యాబిన్ లోపల కూడా ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్ ను చూడవచ్చు. టాటా హారియర్ మాదిరిగానే, టాటా సఫారి డార్క్ ఎడిషన్ కూడా బెనెకే కాలికో లెదర్‌లో ఫినిష్ చేసిన మరింత ప్రీమియం అప్‌హోలెస్ట్రీతో వస్తుందని భావిస్తున్నారు. ఇంకా ఇందులోని సీట్ హెడ్‌రెస్ట్‌లు ట్రై-యారో రంధ్రాలను మరియు 'డార్క్' బ్రాండింగ్ ఎంబ్రాయిడరీని కలిగి ఉంటాయి.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

ఇవి మినహా స్టాండర్డ్ సఫారి యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు ఈ డార్క్ ఎడిషన్ లో లభించే అవకాశం ఉంది. కాకపోతే, ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. టాటా సఫారీ డార్క్ ఎడిషన్ లో అదే 2.0 లీటర్ క్రయోజెనిక్ డీజిల్ ఇంజన్ ను కొనసాగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడుతుంది.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

ఫీచర్ల విషయానికి వస్తే, టాటా సఫారి డార్క్ ఎడిషన్ దాని స్టాండర్డ్ సఫారి యొక్క టాప్ ఎండ్ వేరియంట్ మాదిరిగానే అన్ని ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, పానోరమిక్ సన్‌రూఫ్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు మరియు IRA కనెక్టింగ్ టెక్నాలజీని వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

ఇంకా ఇందులో లభించే ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 2 మరియు 3 వరుసలలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు, యాంబియంట్ మూడ్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. టాటా సఫారి సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రౌండ్ డిస్క్ బ్రేక్‌లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు రోల్‌ఓవర్ మిటిగేషన్ మొదలైనవి ఉన్నాయి.

రూ. 7,000 పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధరలు, ఏయే వేరియంట్లపై ఎంత పెరిగిందంటే..?

టాటా సఫారీ ప్రస్తుతం అడ్వెంచర్ పర్సనల్ మరియు గోల్డ్ ఎడిషన్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో మొదటిది ట్రాపికల్ మిస్ట్ పెయింట్ స్కీమ్‌లో స్టాండర్డ్ గా వస్తుంది. రెండవది వైట్ గోల్డ్ మరియు బ్లాక్ గోల్డ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇది ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ అల్కజార్ మరియు ఎమ్‌జి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Most Read Articles

English summary
Tata safari automatic prices increased upto rs 7000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X