టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ కొత్త ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసిన తర్వాత ఈ నెల 22వ తేదీన తమ సరికొత్త సఫారీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు మోడళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు మరో రెండు సరికొత్త వేరియంట్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

టాటా మోటార్స్ విక్రయిస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మోడళ్లలో కంపెనీ కొత్త సిఎన్‌జి వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా మోటార్స్ ఇప్పటికే, ఈ రెండు వెర్షన్లను భారత రోడ్లపై పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో కస్టమర్లు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ఆసక్తి చూపుతున్న తరుణంలో సిఎన్‌జితో నడిచే వాహనాలకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా తమ సిఎన్‌జి వాహన పోర్ట్‌ఫోలిని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) శక్తితో పనిచేసే టియాగో మరియు టిగోర్ మోడళ్లు లూనవాలా సమీపంలోని ఓ సిఎన్‌జి ఫిల్లింగ్ స్టేషన్‌లో గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకుంటుండగా, ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఏడాది చివరిలోపుగా ఎప్పుడైనా ఈ సిఎన్‌జి వెర్షన్లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

టాటా మోటార్స్ ఈ సిఎన్‌జి వెర్షన్ టియాగో, టిగోర్ మోడళ్లను భారీగా క్యామోఫ్లేజ్ చేసి, వివరాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే, ఈ రెండు మోడళ్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ఆధారంగా చేసుకొని తయారు చేసినట్లుగా తెలుస్తోంది.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

కాబట్టి, వీటి ఓవరాల్ డిజైన్ సిల్హౌట్, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరయర్ డిటేల్స్ కూడా ప్రస్తుత మోడళ్ల మాదిరిగానే ఉంటాయని ఆశించవచ్చు. అయితే, టియాగో సిఎన్‌జి మోడల్‌లో కనిపించే కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను గమనిస్తే, ఇది మిడ్-సైజ్ వేరియంట్‌గా తెలుస్తోంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

ఇక టిగోర్ టెస్టింగ్ వాహనంపై బ్లాక్ కలర్ స్టీల్ రిమ్స్‌ను ఉపయోగించడాన్ని చూస్తుంటే, ఇదొక ఎంట్రీ లెవల్ మోడల్‌గా కనిపిస్తుంది. స్టాండర్డ్ మోడళ్లలో కనిపించే ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్‌ఇడి హై మౌంట్ స్టాప్ లాంప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్ మొదలైన ఫీచర్లు ఈ సిఎన్‌జి వెర్షన్లలోనూ కొనసాగించే అవకాశం ఉంది.

MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

ప్రస్తుతానికి ఈ సిఎన్‌జి మోడళ్లలోని ఇంటీరియర్ వివరాల గురించి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ, ఇవి కూడా స్టాండర్డ్ పెట్రోల్ మోడళ్ల మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది. ఇక ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

మార్కెట్లో లభిస్తున్న టియాగో మరియు టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ఒకే రకమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో గతేడాది జనవరిలో విడుదల చేశారు. ఆ సమయంలో కఠినమైన బిఎస్6 ఉద్గార నిబంధనల కారణంగా, కంపెనీ తమ డీజిల్ ఇంజన్ ఉత్పత్తిని మార్కెట్లో నిలిపివేసింది.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

కాగా, ఈ కొత్త సిఎన్‌జి మోడళ్లలో కూడా అదే 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పెట్రోల్ వెర్షన్లలో ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని మరియు 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయిత్, సిఎన్‌జి వెర్షన్లలో ఈ గణాంకాలు మారే అవకాశం ఉంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు; త్వరలో విడుదల

పెట్రోల్ వెర్షన్ మోడళ్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తాయి. అయితే, సిఎన్‌జి టియాగో మరియు టిగోర్ మోడళ్లు మాత్రం కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనే లభించే అవకాశం ఉంది.

Source: Carandbike

Most Read Articles

English summary
Tata Motors Testing CNG Versions Of Tiago and Tigor; Spy Pics. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X