టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత విపణిలో విక్రయిస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌ల కొనుగోళ్లపై కంపెనీ కస్టమర్లకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఏప్రిల్ 2021 నెలలో పైన టియాగో లేదా టిగోర్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు టైర్ రిపేర్ కిట్‌ను ఉచితంగా పొందవచ్చు.

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

టాటా మోటార్స్ అందిస్తున్న ఈ టైర్ మొబిలిటీ కిట్‌లో ఓ ఎయిర్ కంప్రెసర్ మరియు లిక్విడ్ సీలెంట్ ఉన్నాయి. ఈ కిట్‌ను డ్రైవర్ సీట్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటుంది. టైర్లలో గాలి తగ్గినప్పుడు లేదా పంక్చర్లు జరిగినప్పుడు ఈ కిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

టైరులో గాలి తగ్గినట్లుగా అనిపిస్తే, మీరు మీ కారు ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచి, ఈ ఎయిర్ కంప్రెసర్‌ను కారులోని 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్‌కు జోడించి టైర్లలో గాలిని నింపుకోవచ్చు. ఇందులోని కంప్రెసర్ మీటర్ సాయంతో టైర్లలో ఎంత గాలి ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు.

MOST READ:అక్కడ కరోనా లాక్‌డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఒకవేళ ఫ్లాట్ టైర్ (టైరు పంక్చర్) అయినట్లయితే, ఈ కిట్‌తో పాటుగా అందించే సీలెంట్ బాటిల్‌ను ఎయిర్ కంప్రెసర్‌లో ఉన్న ఆరెంజ్ క్యాప్‌ను తొలగించి, దానికి కనెక్ట్ చేయాలి. అనంతరం కారు ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచి, ఈ ఎయిర్ కంప్రెసర్‌ను కారులోని 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్‌కు జోడించి పంక్చర్ అయిన టైరులో గాలిని నింపాలి.

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఇలా చేస్తే, కంప్రెసర్ ద్వారా బాటిల్‌లోని సీలెంట్ ద్రావణం టైరులోని ప్రవేశించి, పంక్చర్ జరిగిన ప్రాంతాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే, ఇది పంక్చర్‌కు తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని గుర్తుంచుకోండి. దీని సాయంతో మీరు సమీపంలోని పంక్చర్ రిపేర్ షాపు వరకూ సేఫ్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్లవచ్చు.

MOST READ:నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

కారులోని 12 వోల్ట్ సాకెట్‌తో ఎయిర్ కంప్రెషర్‌ను ఉపయోగించేటప్పుడు, తప్పనిసరిగా కారు ఇంజన్ రన్నింగ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని. లేదంటే, కంప్రెసర్ కారు బ్యాటరీ శక్తిని ఉపయోగించి పనిచేయటం ప్రారంభిస్తుంది, తద్వారా కారు బ్యాటరీ శక్తి ఖాలీ అయి ఇంజన్ ఆన్ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఈ ఎయిర్ కంప్రెస్ కిట్ కారు టైర్లలో ప్రెజర్‌ను చెక్ చేసుకోవటానికి మరియు అవసరమైనప్పుడు సులువుగా గాలిని నింపుకోవటానికి చాలా హ్యాండీగా ఉంటుంది. ప్రత్యేకించి వేసవి సీజన్‌లో కారు టైర్లలో గాలి వ్యాకోచించి, తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ కిట్ చాలా చక్కగా పనిచేస్తుంది.

MOST READ:కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఈ కిట్ మీ కారులో ఉన్నట్లయితే, సాధారణంగా టైర్లలో గాలిని నింపుకునేందుకు పెట్రోల్ బంకుల చుట్టూ లేదా టైర్ పంక్చర్ రిపేర్ షాపుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మార్గ మధ్యంలో టైరు పూర్తిగా పంక్చర్ అయినా, సమీపంలోని షాపుకు చేరుకునే వరకూ ఈ పంక్చర్ సీలెంట్ సహాయపడుతుంది.

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఇక టాటా టియాగో మరియు టిగోర్ మోడళ్ల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ రెండు కార్లు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తున్నాయి. ఇందులోని బిఎస్-6 కంప్లైంట్ 1.2-లీటర్ న్యాచురల్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

టాటా టియాగో, టిగోర్ మోడళ్ల కొనుగోలుపై సర్‌ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్; అదేంటంటే..?

ఈ రెండు కార్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మార్కట్లో టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.85 లక్షల నుండి రూ.6.84 లక్షల మధ్యలో ఉండగా, టిగోర్ ధరలు ర .5.49 లక్షల నుంచి రూ.7.63 లక్షల మధ్యలో ఉన్నాయి.

Image Courtesy: TYRO STATION

Most Read Articles

English summary
Tata Tiago And Tigor Gets Free Tyre Mobility Kit, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X