టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఈ మోడల్‌లో లభిస్తున్న టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను రీప్లేస్ చేస్తూ, కొత్త ఆరిజోనా బ్లూ కలర్‌ను కంపెనీ విడుదల చేసింది.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

కొత్త ఆరిజోనా బ్లూ కలర్‌లో వచ్చిన టాటా టియాగో కలర్ ఆప్షన్ చూడటానికి సఫారీ ఎస్‌యూవీలో పరిచయం చేసిన రాయల్ బ్లూ కలర్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్‌ను టాటా టియోగో హ్యాచ్‌బ్యాక్‌లోని ఎక్స్ఈ, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ అన్ని వేరియంట్లలో అందిస్తున్నారు.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

అయితే, టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో మాత్రం ఈ కలర్ ఆప్షన్‌ను అందించడం లేదు. టాటా టియాగో ఈ కొత్త కలర్ ఆప్షన్‌లో కాకుండా విక్టరీ ఎల్లో, ఫ్లేమ్ రెడ్, పియర్సెంట్ వైట్, డేటోనా గ్రే మరియు ప్యూర్ సిల్వర్ అనే ఇతర కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

టాటా టియాగో కారులో కొత్త ఆరిజోనా బ్లూ కలర్ ఆప్షన్ మినహా మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.4.85 లక్షల నుండి రూ.6.84 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

టాటా మోటార్స్ గడచిన జనవరి 2021లో టాటా టియాగో మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పటి నుండి, కంపెనీ ఈ మోడల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఇందులో కొత్తగా లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మరియు ఎక్స్‌టిఏ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

తాజాగా ఇప్పుడు ఇప్పుడు టియాగో లైనప్‌కు అరిజోనా బ్లూ కలర్ ఆప్షన్‌ను జోడించారు. ఇదివరకు టాటా మోటార్స్ ఈ లైనప్‌లో అందించిన లైట్ అండ్ స్పోర్టియర్ టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను ఈ కొత్త ఆరిజోనా బ్లూ కలర్ ఆప్షన్ రీప్లేస్ చేయనుంది. రీప్లేస్ చేయబడిన కలర్ కన్నా ఈ కొత్త కలర్ మరింత అందంగా కనిపిస్తుంది.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

టాటా టియాగో కారులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వాయిస్ కమాండ్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా టియాగోలో కొత్త కలర్ ఆప్షన్; ఇప్పుడు సఫారీ లాంటి లుక్..!

ఇందులోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, డాట్సన్ గో మరియు హ్యుందాయ్ శాంత్రో వంటి కార్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 12, 2021, 11:15 [IST]
English summary
Tata Tiago Gets New Arizona Blue Colour Option To Replace Tectonic Blue Option. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+