భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ ; వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్, టియాగో లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త టియాగో లిమిటెడ్ ఎడిషన్ యొక్క ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). టియాగో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా టియాగో లిమిటెడ్ ఎడిషన్ తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కొత్త డిజైన్‌తో తీసుకువచ్చారు. దీని రూపకల్పనలో చాలా ముఖ్యమైన మార్పులు గమనించినట్లయితే, ఇందులో కొత్త హెడ్‌లైట్, షార్క్ నోస్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్స్ మరియు టైల్ లైట్ వున్నాయి.

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

టాటా మోటార్స్ తన కొత్త టియాగోని మాన్యువల్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో కూడా అందుబాటులోకి తెచ్చారు. టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు మూడు సింగిల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. అవి ఫ్లేమ్ రెడ్, పెర్లిసెంట్ వైట్ మరియు డేటోనా గ్రే కలర్స్. టియాగో లిమిటెడ్ ఎడిషన్ లో 1.2 లీటర్ బిఎస్ 6 రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది.

MOST READ:కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000.. ఇది కోర్టు తీర్పు.. ఎందుకో మీరే చూడండి

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

ఈ కొత్త టియాగో ఎడిషన్‌లో ఉన్న ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో 14 ఇంచెస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, 3 డి నావిగేషన్ సిస్టమ్‌తో 5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిస్ప్లేతో రివర్స్ పార్కింగ్ సెన్సార్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్, ఇమేజ్ అండ్ వీడియో ప్లేబ్యాక్, రియర్ షెల్ఫ్ ఇవ్వబడ్డాయి.

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

ఈ కొత్త టియాగో లిమిటెడ్ ఎడిషన్ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు మరియు బ్రేక్ ఫోర్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉపయోగపడతాయి.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

టాటా మోటార్స్ యొక్క మార్కెటింగ్ హెడ్ 'వివేక్ శ్రీవత్స' కొత్త ఎడిషన్ ప్రారంభించడం గురించి మాట్లాడుతూ, టియాగో 2016 లో ప్రారంభించినప్పటి నుండి దాని విభాగంలో విజయవంతమైన కారుగా ఉంది. అంతే కాకుండా ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందింది. టియాగో యొక్క బిఎస్ 6 వెర్షన్ 2020 లో ప్రవేశపెట్టబడింది. ఈ కారు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొంది దాని విభాగంలో సురక్షితమైన కారుగా నిలిచింది.

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

టాటా టియాగోకు భారతదేశంలో 3.25 లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్లు ఉన్నారని, ఇది నిరంతరం కొత్త కస్టమర్లను పెంచుతోందని ఆయన తెలియజేశారు. గత ఏడాది గుజరాత్ ప్లాంట్‌లోని టాటా మోటార్స్ సనాత్ ప్లాంట్ లో 3 లక్షల టియాగో కార్లను తయారు చేశారు. టాటా మోటార్స్ కంపెనీ రూపొందించిన ఇంపాక్ట్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ కారు రూపొందించబడింది. ఈ కారు చాలా ఆకర్షణీయమైన ధర వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ కారణంగా టియాగో ఇతర కాంపాక్ట్ కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

భారత్‌లో కొత్త టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్

టాటా మోటార్స్ తన కార్ల ధరను జనవరి 22 నుండి పెంచినట్లు ప్రకటించింది. కంపెనీ తన కార్ల వేరియంట్లు మరియు మోడళ్ల ప్రకారం ధరను ప్రస్తుతం దాదాపు రూ. 26 వేల వరకు పెంచింది. జనవరి 21 న లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలో మార్పు ఉండదని కంపెనీ పేర్కొంది. కార్ల తయారీకి ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టాటా మోటార్స్ తెలిపింది.

Most Read Articles

English summary
New Tata Tiago Limited Edition Version Launched In India. Read in Telugu.
Story first published: Saturday, January 30, 2021, 14:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X