త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్.. వచ్చేసింది

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా టియాగో యొక్క ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌ను 2021 ఆగస్టు 4 న విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఈ ఎన్‌ఆర్‌జి ఎడిషన్ విడుదలకు ముందే టాటా మోటార్స్ ఈ కారు యొక్క టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

టాటా మోటార్ విడుదల చేసిన కొత్త ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్ లో బ్లాక్-అవుట్ రూప్ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ ఎడిషన్‌లో కనిపించే బ్లాక్-రూఫ్‌ను చూస్తే, ఈ కారు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

టాటా టియాగోను మొట్టమొదట 2018 సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు, అయితే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ కానీ నేపథ్యంలో ఈ కారు యొక్క ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు టాటా టియాగో ఎన్‌ఆర్‌జి హ్యాచ్‌బ్యాక్‌ రూపంలో అప్డేటెడ్ గా మార్కెట్లో అడుగుపెట్టనుంది.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

టియాగో ఎన్‌ఆర్‌జి యొక్క కొత్త బాడీ కలర్ స్కీమ్‌ ఏవిధంగా ఉంటుందని మనం ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఊహించవచ్చు. కొత్త బాడీ కలర్ స్కీమ్‌తో కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ తెలుపుతుంది. ఇందులో బ్లాక్ ఎడిషన్ హ్యాండిల్స్, ORVM లు మరియు బ్లాక్ క్లాడింగ్ మరియు వెనుక భాగంలో టైల్ లైట్ వంటి వాటిని చూడవచ్చు.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ సైడ్ లో మరియు వీల్ ఆర్చెస్ లో కూడా చూడవచ్చు. ఇవి కాకుండా, టాటా టియాగో ఎన్‌ఆర్‌జిలో కొత్త డిజైన్ బంపర్ మరియు కొత్త 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించవచ్చు. మునుపటి తరం వెర్షన్ లో మాదిరిగా కాకుండా, కొత్త టియాగో ఎన్‌ఆర్‌జిలో స్పోర్టి యాక్సెంట్స్ ఉపయోగించబడ్డాయి.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

కొత్త టియాగో దాని స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఎసి వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ ఆరెంజ్ యాక్సెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యాక్సెంట్స్ కారణంగా దాని లోపలి భాగం మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

ఇందులో నావిగేషన్ సిస్టమ్‌తో 5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉండనుంది. 2021 టాటా టియాగో ఎన్‌ఆర్‌జిలో మునుపటికంటే అప్డేటెడ్ మరియు లేటెస్ట్ స్పోర్టి ఇంటీరియర్ ఉండే అవకాశం ఉంటుంది. టియాగో ఎన్‌ఆర్‌జి యొక్క డాష్‌బోర్డ్ అప్డేట్ చేయబడి ఉంటుంది.

త్వరలో రానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి టీజర్ ఇమేజ్

టాటా టియాగో ఎన్‌ఆర్‌జి యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో అదే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉపయోగించవచ్చు. దీనిని స్టాండర్డ్ మోడల్‌లో ఉపయోగిస్తారు. ఈ ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 29, 2021, 19:02 [IST]
English summary
Tata Tiago NRG To Get Blacked Out Roof, Reveals Teaser. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+