Just In
- 2 hrs ago క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 15 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 17 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 20 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2021 టియాగో ఎన్ఆర్జి: ధర & వివరాలు
భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్' ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన 2021 టియాగో ఎన్ఆర్జి మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ప్రారంభ ధర రూ. 6.57 లక్షలు(ఎక్స్-షోరూమ్). కొత్త టియాగో ఎన్ఆర్జి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో పాటు రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది.
కొత్త టియాగో ఎన్ఆర్జి బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. ఈ టియాగో ఎన్ఆర్జి కొనుగోలు చేయదలచిన కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి మాన్యువల్ (ఎమ్‌టి) వేరియంట్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏఎమ్‌టి) వేరియంట్. వీటి ధరల విషయానికి వస్తే వరుసగా రూ. 6.57 లక్షలు మరియు రూ. 7.09 లక్షలు.
కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి నాలు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది.
అవి:
- ఫారెస్టా గ్రీన్
- ఫైర్ రెడ్
- స్నో వైట్
- క్లౌడీ గ్రే
టాటా టియాగో ఎన్ఆర్జి వెర్షన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కొత్త వెర్షన్ యొక్క ఎక్స్టీరియార్ చాలా వరకు అప్డేట్ చేయబడింది. ఇది ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్‌తో స్టాండర్డ్ మోడల్‌పై కఠినమైన వైఖరిని కలిగి ఉంది. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాల కోసం కంపెనీ డ్యూయల్-పాత్ సస్పెన్షన్‌ను అందించింది. ఇందులో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 181 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రూఫ్ రైల్స్, బ్లాక్-అవుట్ రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.
టియాగో ఎన్ఆర్జిలోని ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో చాలా వరకు దాని మునుపటి మోడల్ లోని ఫీచర్స్ ఉన్నాయి. అయితే కొన్ని అప్డేట్స్ మాత్రం గుర్తించవచ్చు. ఇందులో కొత్త చార్కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, డెకో స్టిచింగ్‌తో పూర్తి ఫాబ్రిక్ సీట్లు, కాంట్రాస్ట్ సైడ్ ఎయిర్ వెంట్స్, 8-స్పీకర్ హర్మన్ సరౌండ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్ స్టార్ట్ బటన్ వంటివి ఉన్నాయి.
2021 టాటా టియాగో ఎన్ఆర్జి హ్యాచ్‌బ్యాక్, దాని స్టాండర్డ్ మోడల్ వలె అదే ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 84.5 బిహెచ్పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి యూనిట్‌కు జత చేయబడి ఉంటుంది.
కొత్త 2021 టియాగో ఎన్ఆర్జి మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇది సేఫ్టీ విషయంలో ఏకంగా 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లో ఏబీఎస్ విత్ ఈబిడి మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రామాణికంగా వస్తుంది. అంతే కాకుండా ఇందులో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, డే అండ్ నైట్ IRVM, రియర్ పార్కింగ్ కెమెరా, ప్రిటెన్షనర్లతో సీట్ బెల్ట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
కొత్త టాటా టియాగో ఇప్పుడు అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా అద్భుతంగా ఉంది. అంతే కాకుండా ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ కూడా కొంతవరకు పునఃరూపకల్పన చేయబడింది. టియాగో ఎన్ఆర్జి పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.