నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

"Tata Motors" భారతదేశంలో పేరుమోసిన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్, కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా Tata Motors యొక్క వాహనాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తమ వాహనాలను ఇతరదేశాల్లో కూడా విడుదల చేసి మంచి ఆదరణ పొందుతున్నాయి.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

Tata Motors ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త Tata Tiago NRG (టాటా టియాగో ఎన్‌ఆర్‌జి) విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ కొత్త Tiago NRG మోడల్ ని మన సమీప దేశమైన నేపాల్ మార్కెట్లో విడుదలచేసి విక్రయాలను ప్రారంభించింది. అయితే నేపాల్ లో విడుదలైన కొత్త Tiago NRG మోడల్ ధర భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Tiago NRG కంటే ఎక్కువ.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

నేపాల్ మార్కెట్లో Tiago NRG మోడల్ ధర 33.75 లక్షల నేపాలీ రూపాయి (NPR). అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 21 లక్షల రూపాయలు.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

నేపాల్ లో విడుదలైన ఈ కొత్త Tata Tiago NRG సిప్రది డీలర్ ద్వారా విక్రయించబడుతుంది. ఈ కొత్త Tiago NRG చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. Tiago NRG నాలుగు కలర్స్ లో అందించబడుతుంది. ఇందులో ఫారెస్ట్ గ్రీన్, ఫైర్ రెడ్, స్నో వైట్ మరియు క్లౌడీ గ్రే అనే కలర్స్ ఉన్నాయి.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

Tiago NRG వెర్షన్ యొక్క ఎక్స్టీరియర్ చాలా వరకు అప్డేట్ చేయబడింది. ఇది ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్‌తో స్టాండర్డ్ మోడల్‌పై కఠినమైన వైఖరిని కలిగి ఉంది. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాల కోసం కంపెనీ డ్యూయల్-పాత్ సస్పెన్షన్‌ను అందించింది. ఇందులో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 181 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రూఫ్ రైల్స్, బ్లాక్-అవుట్ రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

Tiago NRG యొక్క ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో చాలా వరకు దాని మునుపటి మోడల్ లోని ఫీచర్స్ ఉన్నాయి. అయితే కొన్ని అప్డేట్స్ మాత్రం గుర్తించవచ్చు. ఇందులో కొత్త చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, డెకో స్టిచింగ్‌తో పూర్తి ఫాబ్రిక్ సీట్లు, కాంట్రాస్ట్ సైడ్ ఎయిర్ వెంట్స్, 8-స్పీకర్ హర్మన్ సరౌండ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్ స్టార్ట్ బటన్ వంటివి ఉన్నాయి.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

2021 Tiago NRG హ్యాచ్‌బ్యాక్, దాని స్టాండర్డ్ మోడల్ వలె అదే ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 1.2-లీటర్, 3-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 84.5 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్‌ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి యూనిట్‌కు జత చేయబడి ఉంటుంది.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో మాన్యువల్ (ఎమ్‌టి) వేరియంట్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టి) వేరియంట్ ధరలు వరుసగా రూ. 6.57 లక్షలు మరియు రూ. 7.09 లక్షలు.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

Tiago NRG యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,793 మి.మీ, వెడల్పు 1,665 మి.మీ, ఎత్తు 1,587 మి.మీ మరియు వీల్‌బేస్ 2,400 మి.మీ వరకు ఉంటుంది. ఏవిధంగా ఈ కొత్త కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ వరకు పెరిగింది.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

Tiago NRG అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో సేఫ్టీ విషయంలో ఏకంగా 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లో ఏబీఎస్ విత్ ఈబిడి మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రామాణికంగా వస్తుంది. అంతే కాకుండా ఇందులో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, డే అండ్ నైట్ IRVM, రియర్ పార్కింగ్ కెమెరా, ప్రిటెన్షనర్‌లతో సీట్ బెల్ట్‌ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

నేపాల్‌లో అడుగుపెట్టిన Tata Tiago NRG.. ధర & వివరాలు

భారత మార్కెట్లో Tata Motors యొక్క Tiago NRG అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. ఏవిధంగా ఇప్పుడు నేపాల్ లో అడుగుపెట్టిన ఈ కొత్త మోడల్ కూడా మంచి ప్రజాదరణతో మంచి అమ్మకాలతో ముందుగు సాగుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Tata tiago nrg launched in nepal price features details
Story first published: Thursday, September 30, 2021, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X