Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కొత్త టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) మహారాష్ట్రలో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. అక్కడి మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు కోసం భారీ బుకింగ్‌లు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సబ్సిడీ విధానాలే ఇందుకు ప్రధాన కారణం.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

మహారాష్ట్రలో అనుసరిస్తున్న ఈవీ పాలసీ ప్రకారం, ఆ రాష్ట్రంలో విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. ఇందులో భాగంగానే, మహారాష్ట్రలో విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే సబ్సిడీ కారణంగా Tigor EV ధర రూ. 2.30 లక్షల వరకు తగ్గింది. ఈ సబ్సిడీ Tigor EV యొక్క ప్రతి వేరియంట్ పైనా ఇవ్వడం జరుగుతుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

ఈ నేపథ్యంలో కొత్త Tata Tigor EV కోసం ముంబై నుండి 100 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, వీటి డెలివరీలు మాత్రం అక్టోబర్ 2021 నుండి ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం, అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లపై ప్రతి kWh కి రూ. 5,000 సబ్సిడీ లభిస్తుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లపై గరిష్టంగా రూ. 1.50 తగ్గింపు పొందవచ్చు. కొత్త Tigor EV ఎలక్ట్రిక్ కారులో 26 kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, కాబట్టి ఈ కారుపై మొత్తం రూ. 1.30 లక్షల సబ్సిడీ లభిస్తుంది. అంతేకాకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31, 2021 కి ముందు రిజిస్టర్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లపై అదనంగా రూ. 1 లక్ష డిస్కౌంట్ ను కూడా ఇస్తోంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

ఈ రెండు రాయితీలకు కలిపి టాటా టిగోర్ ఈవీపై గరిష్టంగా రూ. 2.30 లక్షల తగ్గింపు లభిస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు Tigor EV ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా, ఫ్లీట్ ఆపరేటర్లు మరియు వాణిజ్య వినియోగం కోసం విక్రయించబడే Tigor EV Xpres-T వేరియంట్‌ పై గరిష్టంగా రూ. 2.07 లక్షల సబ్సిడీని పొందవచ్చు.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

మహారాష్ట్రలో కొత్త Tata Tigor EV యొక్క ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: XE, XM మరియు XZ+. కొత్త Tata Tigor EV ని కంపెనీ తమ పాపులర్ జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ ను ఉపయోగించి తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్ పై కంపెనీ తమ ప్రస్తుత నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

అధునాతన Ziptron టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కారణంగా కొత్త Tata Tigor EV మునుపటితో పోలిస్తే, మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ ని కలిగి ఉంటుంది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌పై 90 నుండి 100 కిమీ రేంజ్‌ ని మాత్రమే ఆఫర్ చేసేది. అయితే, ఈ జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఇది ఇప్పుడు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

అంతేకాకుండా, కొత్త Tigor EV లో కంపెనీ Ziptron టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా దాని పవర్ మరియు రేంజ్‌లను కూడా పెంచింది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ ల టార్క్‌ ని జనరేట్ చేస్తుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

చార్జింగ్ సమయం విషయానికి వస్తే, Tigor EV ని ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 1 గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే, సాధారణ ఛార్జర్‌ తో పూర్తిగా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

Tata Motors ఈ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఇందులో IP67 రేటింగ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇవి పూర్తిగా జలనిరోధితమైనవి (వాటర్‌ప్రూఫ్)గా ఉంటాయి. అంటే, వర్షాకాలంలో కూడా ఈ ఎలక్ట్రిక్ కారును నడపడం సమస్యగా ఉండదు.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

కొత్త Tata Tigor EV లో కంపెనీ అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ అసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

Tata Tigor EV పై రూ.2.30 లక్షల సబ్సిడీ; క్యూ కడుతున్న కస్టమర్లు..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇటీవల నిర్వహించిన యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో, ఇది 5 స్టార్లకు గానూ 4 స్టార్ల సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. వయోజన రక్షణలో 17 పాయింట్లకు గాను 12 పాయింట్లు మరియు పిల్లల భద్రతలో 49 పాయింట్లకు గాను 37.24 పాయింట్ల స్కోర్ దక్కించుకుంది. ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ తో ఇది సురక్షితమైన కారుగా నిలిచింది.

Source: Autocar India

Most Read Articles

English summary
Tata tigor ev gets rs 2 30 lakh discount in mumbai and grabbed 100 unit bookings
Story first published: Wednesday, September 15, 2021, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X