Just In
Don't Miss
- Sports
PBKS vs CSK: నిప్పులు చెరిగిన చహర్.. చెలరేగిన అలీ, ఫాఫ్.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం!!
- News
ఏపీలో నీటి ఎద్దడి.. తెలంగాణలో జలసిరులు... రివర్ బోర్డు లేఖ
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్టింగ్ దశలో టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కార్: రేంజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ వాహన పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీని విక్రయిస్తున్న టాటా మోటార్స్, త్వరలోనే టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా విడుదల చేసందుకు ప్లాన్ చేస్తోంది.

తాజాగా టాటా టిగోర్ ఈవీ మరోసారి టెస్టింగ్ దశలో కెమెరాకి చిక్కింది. లేటెస్ట్ స్పై చిత్రాల ప్రకారం, టాటా టిగోర్ ఈవీ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ కార్ అఫీషియల్ లాంచ్‌కి సంబంధించి కంపెనీ ఓ ప్రకటన విడుదల చసే అవకాశం ఉంది.

వాస్తవానికి టాటా టిగోర్ ఈవీ ఇప్పటికే పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేయబడుతోంది. అయితే, ప్రస్తుతం ఇది కేవలం ప్రభుత్వ మరియు వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ నుండి రాబోయే కొత్త టిగోర్ ఈవీ మోడల్స్ సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా తయారు చేయనున్నారు.
MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్యూవీ పొందిన మహ్మద్ సిరాజ్
కొత్త టాటా టిగోర్ ఈవీ డిజైన్ చూడటానికి అచ్చం టిగోర్ ఐసి ఇంజన్ (పెట్రోల్) మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను హైలైట్ చేయటానికి డిజైన్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేయబడ్డాయి. ఇందులో కారు ముందు భాగంలో మెష్ గ్రిల్ స్థానంలో ఇప్పుడు నిగనిగలాడే బ్లాక్ గ్రిల్ ఉంటుంది.

అలాగే, ముందు వైపు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, గ్రిల్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ వంటి మార్పులు చేశారు. ఇందులో కారు బంపర్‌పై ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా చూడొచ్చు. టాటా టిగోర్ ఈవీ ఫ్రంట్ గ్రిల్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.
MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

కొత్త టాటా టిగోర్ ఈవీ టాప్-ఎండ్ వేరియంట్లలో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ టోన్ బాడీ పెయింట్ మరియు బాడీ కలర్ సైడ్ మిర్రర్‌లు లభిస్తాయి. సాధారణ పెట్రోల్ వెర్షన్ టిగోర్‌తో పోలిస్తే, టిగోర్ ఈవీని వేరుగా ఉంచడానికి ఈ కారుపై అనక చోట్ల బ్లూ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త టాటా టిగోర్ ఈవీలో మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంచాయి. కారు లోపల ఎయిర్ కండిషన్ వెంట్స్ చుట్టూ బ్లూ బెజల్స్ కనిపిస్తాయి. ఇంకా ఇందులో హర్మాన్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్-ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.
MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

ప్రస్తుతం మార్కెట్లో ఇతరులకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తోనే కంపెనీ ఈ కొత్త టిగోర్ ఈవీని సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ కారును జిప్‌ట్రాన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడదు. ఈ కారులో 21.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉపయోగించబడింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 15 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో, కేవలం 2 గంటల్లోనే 0-80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా టిగోర్ ఈవీలోని ఎలక్ట్రిక్ మోటార్ 40 బిహెచ్‌పి పవర్‌ను మరియు 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ మరియు వాణిజ్య కస్టమర్ల కోసం ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎమ్ ప్లస్ మరియు ఎక్స్‌టి ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది.
MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

ఎంచుకునే వేరియంట్‌ను బట్టి టాటా టిగోర్ ఈవీ ఒకే ఛార్జీపై 140 కిలోమీటర్లు లేదా 213 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ధరలు రూ.9.58 లక్షల నుండి రూ.9.90 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారు కొనుగోలుపై ప్రభుత్వం అందించే ఫేమ్ రాయితీలను పొందవచ్చు.
Image Courtesy: The Fat Biker