కొత్త లగ్జరీ కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

చిరుత సినిమాతో తెలుసు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి ఎందరో అభిమానులను కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి కుమారుడు 'రామ్ చరణ్ తేజ్'. రామ్ చరణ్ తేజ్ కి లగ్జరీ కార్స్ మరియు బైకులపైన ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. దాదాపు మార్కెట్లో తనకు నచ్చిన లగ్జరీ వాహనాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉంటాడు.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఇటీవల 'రామ్ చరణ్ తేజ్' జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన Mercedes Benz (మెర్సిడెస్ బెంజ్) యొక్క Maybach GLS 600 SUV ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ లగ్జరీ కారుని బాలీవుడ్ స్టార్స్ అయిన 'అర్జున్ కపూర్' మరియు 'కృతి సనన్' కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఇటీవల 'రామ్ చరణ్ తేజ్' Mercedes Maybach GLS 600 SUV విషయానికి వస్తే, ఇది కస్టమైజ్డ్ వెర్షన్. దీని ధర దాదాపు రూ. 4 కోట్ల రూపాయలుగా తెలిసింది. అయితే ఈ Mercedes Maybach GLS 600 ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 2.43 కోట్లు. ఇది చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

రామ్ చరణ్ ఇప్పటికే ప్రముఖ లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నారు. ఇందులో ఆస్టన్ మార్టిన్ వి 8 వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రోల్స్ రాయిస్ ఫాంటమ్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350 వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత ఖరీదైన కార్లు.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఇక 'రామ్ చరణ్ తేజ్' Mercedes Maybach GLS 600 SUV ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్ల ధరతో ప్రారంభించబడింది. ఈ లగ్జరీ కారుని 2021 కి 50 యూనిట్లు మాత్రమే కేటాయించబడ్డాయి. మెర్సిడెస్ బెంజ్ 2022 లో షెడ్యూల్ చేయబడిన యూనిట్ల కోసం రెండవ దశ బుకింగ్‌ను ప్రారంభించింది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

కొత్త మెర్సిడెస్-మేబాచ్ GLS 600 లగ్జరీ SUV మోడల్‌లో ఒకే ఒక వేరియంట్ ఉంది, కానీ కస్టమర్ డిమాండ్ ప్రకారం 4-సీటర్ లేదా 5 సీటర్ మోడల్స్ కొనుగోలు చేయవచ్చు. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

మేబాచ్ GLS 600 అత్యంత అధునాతన సదుపాయాలు కలిగిన కార్ల శ్రేణిలో ఒకటిగా నిలుస్తుంది. అధునాతన సాంకేతికత మరియు అనేక సాంకేతిక సౌకర్యాలు ఇందులో ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. ఇది ఇంటీరియర్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, 'మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఈ కారులోని ప్రతి సీటులో వెంటిలేటర్ మరియు మసాజ్ ఫంక్షన్ ఉంటాయి, ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ ప్రతి సీటులో ఉంటాయి. వెనుక భాగంలో రిఫ్రిజిరేటర్ కూడా ఉంది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 లో 12.3 ఇంచెస్ ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్, డాష్‌బోర్డ్‌లో నాప్ప లెదర్ వంటివి కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్ మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇవ్వబడింది.

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ మరియు ప్రీ-సేఫ్ సిస్టమ్ ఇవ్వబడ్డాయి. వీటితో పాటు పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, మసాజ్ సీట్ మరియు రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయి.

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది.

కొత్త కారు కొన్న మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్': ధర రూ. 4 కోట్లు

ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ బరువు మొత్తం 3,250 కిలోలు. అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉన్నందున దేశీయ మార్కెట్లో ఈ కొత్త లగ్జరీ కారుకి విపరీతమైన డిమాండ్ ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 14, 2021, 9:49 [IST]
English summary
Telugu actor ram charan buys mercedes maybach gls 600 worth rs 4 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+