Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా (Tesla) భారతదేశంలో ప్రవేశించేందుకు గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినదే. ఎలక్ట్రిక్ కార్ల విడుదల విషయంలో భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు కొనసాగిస్తోంది. తాజా సమాచారం, భారత మార్కెట్లో టెస్లా మోడల్ 3 కారుతో పాటుగా మరికొన్ని ఇతర మోడళ్లను కూడా విడుదల చేసేందుకు సదరు కంపెనీ భారత సర్కార్ గ్రీన్ సిగ్నల్ ప్రకటించినట్లు సమాచారం.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

టెస్లా సంస్థ ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు నగరంలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో తమ కంపెనీ పేరును కూడా రిజిస్టర్ చేసుకుంది. ప్రారంభంలో భాగంగా, టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించనుంది. ఆ తర్వాత, మార్కెట్లో ఈ కార్లకు లభించే ఆదరణను బట్టి, కంపెనీ వీటిని ఇక్కడే స్థానికంగా తయారు చేసే అంశాన్ని పరిశీలించనుంది.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

ఈ నేపథ్యంలో, భారతదేశానికి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలపై అధికంగా దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా అధికారులు మోదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. టెస్లా తమ భారతీయ వ్యాపార వ్యవహారాల కోసం ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా నియమించింది. అంతేకాకుండా, భారతదేశంలో తమ కార్లను అధికారికంగా విడుదల చేయడానికి ముందే న్యూఢిల్లీ, బెంగళూరు మరియు ముంబై నగరాల్లో ముందుగా షోరూమ్‌లను మరియు సర్వీస్ సెంటర్‌లను ప్రారంభించే పనిలో ఉంది.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

తాజా మీడియా నివేదిక ప్రకారం, అమెరికన్ ఆటో మేజర్ అయిన టెస్లా భారతదేశంలో ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను (EV లను) లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, భారతదేశంలో టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్‌ కారుతో పాటుగా మరో మూడు మోడళ్లను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి ఈ విషయాన్ని అటు టెస్లా సంస్థ కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

అమెరికన్ మార్కెట్లో టెస్లా మోడల్ 3 అనేది ఈ కార్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. భారతదేశంలో కూడా కంపెనీ ముందుగా ఈ కారునే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మరియు డ్యూయల్ మోటార్ ఆప్షన్లలో వివిధ రకాల రేంజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని ఎంట్రీ-లెవల్ మోడల్ రియర్ వీల్ డ్రైవ్ మరియు స్టాండర్డ్ రేంజ్ లను కలిగి ఉంటుంది. ఇందులోని బేసిక్ వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 423 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

విదేశాలలో టెస్లా మోడల్ 3 కారు ధర సుమారు 39,990 డాలర్లకు పైనే ఉంటుంది. అయితే, అధిక దిగుమతి సుంకాల కారణంగా మన దేశంలో ఈ కారు ధర సుమారు రూ. 70-80 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. టెస్లా మోడల్ 3 కారును కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎంచుకునే విధానాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ, రేంజ్, అటానమస్ డ్రైవింగ్ వంటి ఫీచర్లు మారుతూ ఉంటాయి. ఇది రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అలాగే, రెండు మోటార్లు కలిగిన టెస్లా మోడల్ 3 వేరియంట్ పూర్తి చార్జీపై 568 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ వేరియంట్ 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. మోడల్ 3 ఎలక్ట్రిక్ యొక్క రేంజ్-టాపింగ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ గరిష్టంగా గంటకు 260 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది 3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారులో స్వీప్‌బ్యాక్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టైల్‌లైట్లు, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, A-పిల్లర్ మౌంటెడ్ సైడ్ మిర్రర్స్, రియర్ బంపర్ మౌంటెడ్ రిఫ్లెక్టర్లు, బూట్ లిడ్ కోసం లిప్ స్పాయిలర్, అన్ని వైపులా కెమెరాలు మరియు ఆప్షనల్ ఏరో కిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో డాష్‌బోర్డ్ మధ్యలో ఓ పెద్ద టాబ్లెట్ లాంటి టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీని సాయంతోనే కారులోని అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు.

Tesla నుండి ఒకటి కాదు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

కారు లోపల అప్‌హోలెస్ట్రీ విషయానికి వస్తే, నలుపు రంగులో పూర్తి చేసిన లెదర్ అప్‌హోలెస్ట్రీ లేదా తెలుపు రంగు లెథర్ తో కూడిన అప్‌హోలెస్ట్రీ ఉంటాయి. కారు పైభాగం మొత్తం ధృఢమైన గ్లాస్ రూఫ్ ఉంటుంది. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారులో ఐదుగురు ప్రయాణికులకు సరిపడా సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. భారతదేశంలో మోడల్ 3 ని విడుదల చేసిన తర్వాత టెస్లా తమ మోడల్ S, మోడల్ X మరియు మోడల్ Y ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla to bring three more electric cars to india along with model 3 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X