పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'వ్యాగన్ఆర్' గత నెలలో స్విఫ్ట్, ఆల్టో అమ్మకాలను అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సంగతి తెలిసినదే. టాల్ బాయ్ కారుగా ప్రసిద్ధి చెందిన మారుతి వ్యాగన్ఆర్ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించింది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ మూడవ తరానికి చెందినది. గత 2019లో కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేసింది. గత రెండు తరాల వ్యాగన్ఆర్ కార్లతో పోలిస్తే, మారుతి సుజుకి ఈ మూడవ తరం మోడల్‌లో డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ మరియు ఇంజన్ పరంగా అనేక మార్పులు చేర్పులు చేసింది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

పాత వ్యాగన్ఆర్ కార్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం వ్యాగన్ఆర్ మరింత పెద్దదిగా, విశాలంగా ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఈ కారు మరింత శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ (స్విఫ్ట్ కారులో ఉపయోగించిన ఇంజన్)తో లభిస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

మారుతి వ్యాగన్ఆర్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే కాకుండా, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే, ప్రస్తుత వ్యాగన్ఆర్ అనేక రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా, ఇది కస్టమర్లను చక్కగా ఆకర్షిస్తోంది. మిని ఎస్‌యూవీ లాంటి డిజైన్‌ను కలిగిన ఈ కొత్త తరం కారు మార్కెట్లోకి ప్రవేశించి సుమారు 30 నెలలు కావస్తోంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

ఈ 30 నెలలో వ్యవదిలో 4 లక్షలకు పైగా కొత్త తరం వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇది దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, వ్యాగన్ఆర్ సిఎన్‌జి వెర్షన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సిఎన్‌జి కారుగా కూడా మారింది. భారతదేశంలో వ్యాగన్ఆర్ యొక్క 21 ఏళ్ల ప్రయాణంలో ఇప్పటి వరకూ 2.4 మిలియన్ యూనిట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ యజమానులలో నాలుగింట ఒక వంతు మంది తిరిగి అదే కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా 1999లో ఈ టాల్ బాయ్ కారుని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నది థర్డ్ జనరేషన్ మోడల్. దేశీయ విపణిలో దీని ధరలు రూ.4.19 లక్షల నుండి రూ.6.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మంచి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది మరియు మార్కెట్లో అధిక రీసేల్ విలువను కూడా కలిగి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఓ స్టార్ మోడల్. తక్కువ మెయింటినెన్స్ ఖర్చు మరియు అధిక మైలేజ్ కారణంగా వ్యాగన్ఆర్ ఓ మంచి సిటీ కారుగా ఉంటుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

ప్రస్తుత తరం మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను కంపెనీ రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తోంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ ఇంజన్, ఇది గరిష్టంగా 68 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 21.79 కిలోమీటర్ల మైలేజీని మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

ఇందులో రెండవది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 83 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.52 కిలోమీటర్ల మైలేజీని మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో 20.52 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

కాగా, సిఎన్‌జి వెర్షన్ వ్యాగన్ఆర్‌లో 1.0 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 60 బిహెచ్‌పి శక్తిని మరియు 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది మరియు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కేజీ సిఎన్‌జికి 32.52 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం పొడవు 3655 మిమీ, వెడల్పు 1620 మిమీ, ఎత్తు 1675 మిమీ మరియు వీల్‌బేస్ 2435 మిమీగా ఉంటుంది. ఈ కారుని బ్రాండ్ యొక్క పాపులర్ సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఫలితంగా ఈ మూడవ తరం మోడల్ మునుపటి తరం మోడల్ కంటే 65 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ అనే వేరియంట్లలో వైట్, సిల్వర్, గ్రే, ఆరెంజ్, బ్రౌన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో లేటెస్ట్ టెక్ ఫీచర్లు కూడా లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

ఇంకా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కంట్రోల్స్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబల్ రియర్ వ్యూ మిర్రర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు నాలుగు-డోర్లపై పవర్ విండోస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ డీఫాగర్, బాటిల్ హోల్డర్స్ వంటి కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

పాత వ్యాగన్ఆర్ కన్నా ఈ కొత్త వ్యాగన్ఆర్ కారునే తెగ కొనేస్తున్నారు.. ఎందుకంటే..?

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కొత్త తరం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Third gen maruti suzuki wagonr sold over 4 lakh units within 30 months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X