ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుమల. తిరుమలలో వెలసిన కలియుగ వేంకటేశ్వరుని దర్శిచుకోవడానికి ప్రపంచం అలుమూలల నుచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అంతే కాకుండా తిరుమల పచ్చని చెట్లమధ్య అత్యంత శోభాయమానంగా ఉంటుంది. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) వారు ఇటీవల ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటీవల తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఆలయ అవసరాల నిమిత్తం Tata Nexon ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మొత్తం 35 Tata Nexon కార్లను కొనుగోలుచేశారు.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

Tata Nexon కార్లను కొనుగోలు చేసిన తర్వాత టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరియు టిటిడి ఇఓ డాక్టర్ జవహర్ రెడ్డితో కలిసి వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించారు. ఈ కార్లు తిరుమల పరిసరాల్లో కాలుష్యాన్ని నివారించడానికి అనుకూలంగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించిన సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తిరుమలను కాలుష్యరహితంగా మార్చే ప్రయత్నానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తిరుమలలో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ప్రస్తుతం తిరుమలలో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను అంచెలంచెలుగా తగ్గిస్తూ వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబడతాయి. ఇందులో భాగంగానే, మొదటి దశలో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్వర్షన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన 35 Tata Nexon ఎలక్ట్రిక్ కార్లు తిరుమల రోడ్లపై తిరుగుతాయి.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

టిటిడి వారు కొనుగోలుచేసి ఈ కార్లకు నెలకు, ప్రతి వాహనానికి రూ. 33,600 చొప్పున మొత్తం 5 సంవత్సరాల పాటు ఈఎమ్ఐ చెల్లించనుంది. అయితే ఇక రెండవ దశలో, 20 తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత బస్సులు మరియు 12 ఆర్‌టిసి బస్సులతో సహా 32 ఎలక్ట్రిక్ బస్సులు ఆరు నెలల్లో చేర్చబడతాయని కూడా స్పష్టం చేశారు.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ఇప్పటికే టిటిడి అందించిన అధికారిక సమాచారం ప్రకారం, తిరుమల కొండపై ఉన్న శ్రీవారి పాదాలు, ఆకాశగంగ మరియు పాపవినాశనం మార్గాల మధ్య ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సులు నడపబడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభ్యర్థన మేరకు, ఆర్‌టిసి వచ్చే ఆరు నెలల్లో తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్లలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

తిరుమల కాలుష్య రహితంగా మార్చడానికి టిటిడి ఉద్యోగులు, స్థానికులు, వ్యాపారులు మరియు తిరుమల ఘాట్ రోడ్లపై ప్రయాణించే టాక్సీ ఆపరేటర్లు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా GM శేష రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

Tata Nexon ఎలక్ట్రిక్ కార్లు ఒక పూర్తి ఛార్జ్ తో దాదాపు 250 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ హేయడం కూడా సులభం, ఇది పూర్తి ఛార్జ్ చేయడానికి ఎసి కరెంట్‌తో ఎనిమిది గంటలు మరియు డిసి కరెంట్‌తో 90 నిమిషాలు పడుతుంది. అంటే ప్రతి ఛార్జీకి పూర్తిగా 30 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. ఒక యూనిట్ కరెంట్‌ కి అయ్యే ఖర్చు రూ. 6.70. దీన్ని బట్టి చూస్తే ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ప్రస్తుతం భారతదేశంలో అధికంగా పెరిగిన డీజిలు మరియు పెట్రోల్ ధరల కారణంగా ఎక్కువమంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో చాల కంపెనీలు కూడా ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి శ్రీకారం చుట్టిన TTD: 35 Tata Nexon కార్ల కొనుగోలు

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు మరియు సబ్సిడీలు వంటివి కూడా అందిస్తున్నారు. ఒక వైపు పెరుగుతున్న ఇంధన ధరలు వల్ల, ప్రభుత్వాలు అందించే రాయితీలకు ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి మొగ్గు చూపుతున్నారు.

Most Read Articles

English summary
Tirumala temple plans for green vehicles only introduces 35 electric cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X