డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

గత నెలలో దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితా విడుదలైంది. ఈసారి అనూహ్యంగా ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో కేవలం మారుతి మరియు హ్యుందాయ్ కార్లే ఉన్నాయి. టాప్ టెన్ స్థానాల్లో ఏడు స్థానాల్లో మారుతి సుజుకి కార్లు, మూడు స్థానాల్లో హ్యుందాయ్ కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఆల్టో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు దక్కించుకున్న మారుతి సుజుకి ఆల్టో, గత నెలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2019లో 15,489 ఆల్టో కార్లను విక్రయించగా, డిసెంబర్ 2020లో మొత్తం 18,140 కార్లను విక్రయించి 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

గత నవంబర్ నెలలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన మారుతి సుజుకి స్విఫ్ట్, ఇప్పుడు ఈ జాబితాలో రెండవ స్థానానికి పడిపోయింది. గత డిసెంబర్ 2020 నెలలో 18,131 స్విఫ్ట్ కార్లు అమ్ముడవగా, అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 14,749 యూనిట్లుగా ఉండి 23 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు డిసెంబర్ 2019తో పోలిస్తే డిసెంబర్ 2020లో స్వల్పంగా క్షీణించాయి. గత నెలలో మొత్తం 18,030 బాలనె కార్లు అమ్ముడుపోగా అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 18,464 యూనిట్లుగా నమోదై 2 శాతం క్షీణతను నమోదు చేశాయి.

Rank Model Dec-20 Dec-19 Growth (%)
1 Maruti Alto 18,140 15,489 17
2 Maruti Swift 18,131 14,749 23
3 Maruti Baleno 18,030 18,464 -2
4 Maruti WagonR 17,684 10,781 64
5 Maruti Dzire 13,868 15,286 -9
6 Hyundai Venue 12,313 9,521 29
7 Maruti Vitara Brezza 12,251 13,658 -10
8 Maruti Eeco 11,215 7,634 47
9 Hyundai Creta 10,592 6,713 58
10 Hyundai Grand i10 10,263 7,598 35
డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

మారుతి సుజుకి అందిస్తున్న మరో పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2020 నెలలో మారుతి సుజుకి మొత్తం 17,684 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 10,781 యూనిట్లుగా ఉండి గరిష్టంగా 64 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

కాగా, ఈ జాబితాలో టాప్-5 స్థానాన్ని కూడా మారుతి సుజుకి వాహనమేనే దక్కించుకుంది. ఇందులో స్విఫ్ట్ తోబుట్టువైన స్విఫ్ట్ డిజైర్ ఈ స్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్-సెడాన్‌గా కొనసాగుతోంది. గడచిన డిసెంబర్ 2020లో 13,868 స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడు కాగా, డిసెంబర్ 2019లో వీటి సంఖ్య 15,286 యూనిట్లుగా ఉండి 9 శాతం క్షీణతను నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ వెన్యూ. డిసెంబర్ 2020లో మొత్తం 12,313 వెన్యూ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 9,521 యూనిట్లుగా ఉండి 29 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:వావ్ అమేజింగ్.. ఒక్క స్కూటర్ బ్రాండ్, 2.5 కోట్ల మంది కస్టమర్స్

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

డిసెంబర్ 2020 టాప్-10 కార్ల జాబితాలో 7వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి విటారా బ్రెజ్జా. గత డిసెంబర్ 2020లో మారుతి సుజుకి మొత్తం 12,251 విటారా బ్రెజ్జా ఎస్‌యూవీలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 13,658 యూనిట్లుగా ఉండి 10 శాతం క్షీణతను నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

ఈ జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి. గడచిన డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 11,215 ఈకో వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 7,634యూనిట్లుగా ఉండి 47 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా గడచిన డిసెంబర్ 2020 నెలలో 10,592 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ జాబితాలో 9 స్థానానికి పడిపోయింది. అంతకు ముందు సంవ్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 6,713 యూనిట్లగా ఉండి, 58 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 గ్రాండ్ మోడల్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో గ్రాండ్ మరియు నియోస్ మోడళ్లు అమ్మకానికి ఉన్నాయి. గడచిన డిసెంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 10,263 ఐ10 కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 7,598 యూనిట్లుగా ఉండి 35 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో టాప్ 10 కార్లు; స్విఫ్ట్‌ను ఓడించిన మారుతి ఆల్టో

గత డిసెంబర్ 2020 నెలలో హ్యుందాయ్ వెన్యూ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారి మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా మోడళ్లను అధిగమించింది. ఈ కొత్త సంవత్సరం (2021)లో అనేక కొత్త మోడళ్లు మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో, ఈనెల అమ్మకాల్లో ఏయే మోడళ్లు టాప్-10 జాబితాలో ఉంటాయో వేచి చూడాలి.

Source: Autopunditz

Most Read Articles

English summary
Top 10 Best Selling Cars In December 2020. Maruti Alto Tops In The List. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X