జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గడచిన జనవరి 2021 నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మొదటి పది స్థానాల్లో ఏడు స్థానాలను మారుతి సుజుకి కంపెనీయే ఆక్రమించింది.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

మారుతి సుజుకి అందిస్తున్న పీపుల్స్ కార్ ఆల్టో హ్యాచ్‌బ్యాక్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాప్-10 కార్ల జాబితాలో ఈ ఎంట్రీ లెవల్ మారుతి కారు తన అధిపత్య స్థానాన్ని అలానే నిలుపుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు స్థానాలు కూడా మారుతి కార్లే దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు దక్కించుకున్న మారుతి సుజుకి ఆల్టో, గత నెలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. జనవరి 2021లో మారుతి సుజుకి మొత్తం 18,260 ఆల్టో కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 18,914 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 3 శాతం క్షీణించాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

మారుతి సుజుకి ఆల్టో తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. జనవరి 2021లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 17,180 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2020లో వీటి సంఖ్య 19,981 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 14 శాతం క్షీణించాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ గత నెలలో 17,166 యూనిట్ల అమ్మకాలతో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2020లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు 15,232 యూనిట్లుగా నమోదయ్యాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

మారుతి సుజుకి బ్రాండ్ నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో గత నెలలో 16,648 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, జనవరి 2020 నెలలో 20,485 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సమయంలో బాలెనో అమ్మకాలు 19 శాతం తగ్గాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

కాగా, ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది కూడా మారుతి సుజుకి కారే. కంపెనీ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ డిజైన్ జనవరి 2021లో 15,125 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌గా నిలిచింది. గత ఏడాది ఇదే సమయంలో డిజైర్ అమ్మకాలు 22,406 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో దీని అమ్మకాలు 32 శాతం క్షీణించాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

టాప్ 10 జాబితాలో మొదటి ఐదు స్థానాలను మారుతి దక్కించుకున్న తర్వాత ఆరవ స్థానాన్ని హ్యుందాయ్ క్రెటా దక్కించుకుంది. జనవరి 2021 నెలలో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 12,284 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 6,900 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు భారీగా 78 శాతం వృద్ధిని సాధించాయి.

Rank Model January 2021 January 2020 Growth (%)
1 Maruti Alto 18,260 18,914 -3.45
2 Maruti Swift 17,180 19,981 -14.01
3 Maruti WagonR 17,165 15,232 12.69
4 Maruti Baleno 16,648 20,485 -18.73
5 Maruti Dzire 15,125 22,406 -32.49
6 Hyundai Creta 12,284 6,900 78.02
7 Hyundai Venue 11,779 6,733 74.94
8 Maruti Eeco 11,680 12,324 -5.22
9 Hyundai Grand i10 NIOS 10,865 8,774 23.82
10 Maruti Vitara Brezza 10,623 10,134 4.82
జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

కాగా, జాబితాలో ఏడవ మరియు ఎనిమిదవ స్థానంలో హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి ఈకో మోడళ్లు ఉన్నాయి. జనవరి 2021లో ఈ రెండు మోడళ్లు వరుసగా 11,779 మరియు 11,680 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఈ సమయంలో వెన్యూ 75 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేయగా, ఈకో అమ్మకాలు 5 శాతం క్షీణించాయి.

జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు; ఆల్టో కారుదే అగ్రస్థానం

అదేవిధంగా, ఈ జాబితాలో టాప్ 9 అండ్ 10 స్థానాలను వరుసగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలు దక్కించుకున్నాయి. జనవరి 2021లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాలు 10,865 యూనిట్లుగా ఉండగా, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అమ్మకాలు 10,623 యూనిట్లుగా నమోదై వరుసగా 24 శాతం మరియు 5 శాతం వృద్ధిని సాధించాయి.

Source: Autopunditz.com

More from DriveSpark

Article Published On: Tuesday, February 2, 2021, 17:54 [IST]
English summary
Top-10 Best Selling Cars In India In January 2021, Maruti Suzuki Alto Retains Top In The List. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+