మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

ప్రపంచ మార్కెట్లో రోజురోజుకి ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఇంధనాన్ని వినియోగించే వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ పెరుగుతోంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో భారతదేశం ఇతరదేశాలతో పోలీసుకుంటే కొంత ఎనుకబడి ఉందనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోటానికి సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. అయితే మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపఞ్చవ్యాప్తంగా ఎక్కువమంది వినియోగదారులు ఇష్టపడుతున్న టాప్ 10 ఎలక్ట్రిక్ కార్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Tesla Model 3 (టెస్లా మోడల్ 3):

Tesla ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది ఇష్టపడే ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ. అయితే కంపెనీ యొక్క Tesla Model 3 ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో అమ్ముడైన బ్రాండ్ యొక్క మోడల్. టెస్లా కంపెనీ ప్రతి సంవత్సరం కనీసం 2,15,000 టెస్లా మోడల్ 3 కార్లను విక్రయిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

టెస్లా కంపెనీ తన Tesla Model 3 కారుని భారతీయ మార్కెట్లో కూడా విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. టెస్లా మోడల్ 3 కారు అత్యంత అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన కారు, అంతే కాకుండా ఇది వాహన వినియోగదారుల భద్రతకు ఎక్కువా ప్రాధాన్యతను ఇస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Wuling Hong Guang Mini EV (వులింగ్ హాంగ్ గ్వాంగ్ మినీ ఈవి):

ఇక్కడ మనం చెప్పుకుంటున్న Wuling Hong Guang Mini EV కారు చైనా మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మినీ సైజ్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు కూడా లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ కార్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ తయారీ దారు, ఈ Wuling Hong Guang Mini EV ని ప్రతి గంటకు కనీసం 14 కార్లను మరియు ప్రతి సంవత్సరం 1,25,925 కార్లను విక్రయిస్తున్నట్లు సమాచారం.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Tesla Model Y (టెస్లా మోడల్ వై):

Tesla Model Y కూడా టెస్లా కంపెనీ యొక్క ప్రజాదరణ పొందిన మోడల్. కంపెనీ యొక్క అత్యదిక సంఖ్యలో అమ్ముడైన రెండవ మోడల్ ఈ Tesla Model Y ఎలక్ట్రిక్ కార్. ఇది ప్రతి గంటకు కనీసం 11 కార్లకంటే ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

దీన్ని బట్టి చూస్తే, ప్రతి సంవత్సరం కంపెనీ దాదాపు 1,00,000 మోడల్ Y యూనిట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ టెస్లా వై మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్క చార్జితో దాదాపు 455 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Nissan Leaf (నిస్సాన్ లీఫ్):

అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీదారులో ఒకటి Nissan. నిస్సాన్ కంపెనీ యొక్క Nissan Leaf కారు ప్రపంచ ప్రసిద్దిగాంచిన టెస్లా మోడల్ 3 కి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ అమ్మకాల విషయంలో మరియు ప్రజాదరణ పొందే విషయంలో టెస్లా మోడల్ 3 కంటే వెనుకబడి ఉంటుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Nissan బ్రాండ్ యొక్క నిస్సాన్ లీఫ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన ఎలక్ట్రిక్ కార్ మోడళ్లలో ఒకటి. నిస్సాన్ ప్రతి గంటకు దాదాపు 10 లీఫ్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది, కావున ఇది ప్రతి సంవత్సరం దాదాపు 85,988 యూనిట్ల నిస్సాన్ లీఫ్ కార్లను విక్రయిస్తుంది. నిస్సాన్ ఇటీవల ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ 'కపిల్ దేవ్‌'కు Nissan Leaf ఎలక్ట్రిక్ కార్ గిఫ్ట్ గా అందించారు.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

BAIC EU-Series (బిఏఐసి ఈయు-సిరీస్):

చైనా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి BAIC EU-Series. అయితే ఈ BAIC EU-Series ఎలక్ట్రిక్ కార్ చైనా మార్కెట్లో అందుబాటులో లేదు. అమ్మకాల పరంగా ఈ కొత్త సెడాన్ 5 వ స్థానంలో ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని ప్రతి సంవత్సరం దాదాపు 65,333 యూనిట్లను విక్రయిస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Volkswagen ID.3 (వోక్స్‌వ్యాగన్ ఐడి.3):

మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన జర్మన్ కార్ల తయారీదారులలో వోక్స్‌వ్యాగన్ ఒకటి. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారు Volkswagen ID.3. ఇది ప్రపంచ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో 6 వ స్థానంలో ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని ప్రతి గంటకు 6 యూనిట్లను మరియు సంవత్సరానికి 54,495 యూనిట్లను విక్రయిస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

SAIC Baojun E- సిరీస్ EV:

చైనాలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికి అందులో ఎక్కువ వేగంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో 7 స్థానంలో నిలిచినా ఎలక్ట్రిక్ కారు ఈ SAIC Baojun E- సిరీస్ EV. SAIC గ్రూప్ MG మోటార్ యాజమాన్యంలో ఉంది. అంతే కాకుండా ఇది ఫోక్స్‌వ్యాగన్ మరియు జనరల్ మోటార్స్ వంటి వాటితో కూడా భాగస్వామిగా ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని ప్రతి సంవత్సరం దాదాపు 53,877 యూనిట్లను విక్రయిస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Hyundai Kona (హ్యుందాయ్ కోనా):

Hyundai Kona అనేది Hyundai కంపెనీ యొక్క ప్రజాదరణ పొందిన మరియు వేగంగా అమ్ముడవుతున్న మోడల్. Hyundai Kona జూలై 2019లో భారతదేశంలో ప్రారంభించబడింది, అయితే ఇది ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. హ్యుందాయ్ కంపెనీ తన కోన ఎలక్ట్రిక్ కారుని ప్రతి గంటకు 6 యూనిట్లను విక్రయిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క కోన ఎలక్ట్రిక్ వార్షిక అమ్మకాలు 52,184 యూనిట్లు.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Audi e-Tron (ఆడి ఇ-ట్రోన్):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi (ఆడి) తన ఎలక్ట్రిక్ కార్ అయిన ఈ-ట్రాన్‌ను మార్కెట్లో విడుదల చేసి మంచి ప్రజాదరణపొందుతోంది. Audi e-Tron కంపెనీ జాబితాలో చేరిన ఏకైక ప్రీమియం లగ్జరీ బ్రాండ్. ఆడి ప్రతి గంటకు ఐదు యూనిట్ల కంటే ఎక్కువ ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ 47,324 యూనిట్ల ఆడి ఈ-ట్రాన్ అమ్ముగలుగుతోంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

కంపెనీ Audi e-Tron యొక్క స్టాండర్డ్ మోడల్‌తో పాటు స్పోర్ట్‌బ్యాక్, GT మరియు RS వేరియంట్‌లతో సహా నాలుగు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నయి. ఇవన్నీ కూడా భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందగలుగుతున్నాయి.

మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే

Renault Zoe (రెనాల్ట్ జో):

ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ అయిన Renault యొక్క ఎలక్ట్రిక్ కార్ ఈ Renault Zoe. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అమ్మకాలు చేపడుతున్న టాప్ 10 కార్ల జాబితాలో ఇది చివరలో ఉంది. రెనాల్ట్ కంపెనీ ఈ కారును ప్రతి గంటకు కనీసం నాలుగు యూనిట్లను విక్రయిస్తోంది, అంటే సగటున ప్రతి సంవత్సరం 35,599 యూనిట్లను విక్రయిస్తోంది. ఈ ఎలెక్ట్రిక్ కార ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

Most Read Articles

English summary
Top 10 best selling electric cars tesla model 3 guang mini ev nissan leaf and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X