జనవరి 2021లో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్స్
జనవరి 2021లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ల వివరాలు వెల్లడయ్యాయి. గత నెలలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకి ఆల్టో, ఈ హ్యాచ్‌బ్యాక్‌ల విభాగంలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జనవరి 2021లో 18,260 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, జనవరి 2020తో పోల్చుకుంటే మాత్రం ఈ అమ్మకాలు స్వల్పంగా 3.45 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో మారుతి ఆల్టో అమ్మకాలు 18,914 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి స్విఫ్ట్. గత నెలలో స్విఫ్ట్ అమ్మకాలు 14 శాతం తగ్గాయి. జనవరి 2020లో 19,981 స్విఫ్ట్ కార్లను విక్రయించిన మారుతి సుజుకి జనవరి 2021లో 17,180 యూనిట్ల స్విఫ్ట్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. స్విఫ్ట్ మోడల్‌లో త్వరలోనే ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి ఆల్టో మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఈ బ్రాండ్ విక్రయిస్తున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. జనవరి 2020 నెలలో 15,232 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించిన మారుతి సుజుకి, జనవరి 2021లో 17,165 యూనిట్లను విక్రయించి 12.69 శాతం వృద్ధిని నమోదు చేసింది.
| Rank | Model | Jan'21 | Jan'20 | Growth (%) |
| 1 | Maruti Alto | 18,260 | 18,914 | -3.45 |
| 2 | Maruti Swift | 17,180 | 19,981 | -14.01 |
| 3 | Maruti WagonR | 17,165 | 15,232 | 12.69 |
| 4 | Maruti Baleno | 16,648 | 20,485 | -18.73 |
| 5 | Hyundai Grand i10 NIOS | 10,865 | 8,774 | 24 |
| 6 | Hyundai i20 | 8,505 | 8,137 | 5 |
| 7 | Tata Altroz | 7,378 | 4,505 | 64 |
| 8 | Maruti Celerio | 6,963 | 6,236 | 12 |
| 9 | Tata Tiago | 6,909 | 4,313 | 60 |
| 10 | Maruti S-Presso | 6,893 | 6,971 | -1 |

మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న బాలెనో హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. గత నెలలో 16,648 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. జనవరి 2020తో పోలిస్తే (20,485 యూనిట్లతో) ఈ మోడల్ అమ్మకాలు 18.73 శాతం తగ్గాయి. కాగా, ఈ జాబితాలో మొదటి నాలుగు కార్లు కూడా మారుతి సుజుకికి చెందినవే కావటం విశేషం.

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్. గత జనవరి 2021లో ఈ మోడల్ అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 10,865 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి సంఖ్య 8,774 యూనిట్లుగా ఉంది.

హ్యుందాయ్ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 అమ్మకాలు 5 శాతం పెరిగి 8,137 యూనిట్ల నుండి 8,505 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే విభాగంలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు 64 శాతం పెరిగి 4,505 యూనిట్ల నుండి 7,378 యూనిట్లకు పెరిగాయి.

మారుతి సెలెరియో అమ్మకాలు 12 శాతం పెరిగి 6,236 యూనిట్ల నుండి 6,963 యూనిట్లకు చేరుకున్నాయి. ఇకపోతే, టాటా టియాగో అమ్మకాలు 60 శాతం పెరిగి 4,313 యూనిట్ల నుండి 6,909 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ జాబితాలో చివరిగా మారుతి సుజుకి ఎస్-ప్రెసో అమ్మకాలు 1 శాతం క్షీణించి 6,971 యూనిట్ల నుండి 6,893 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications








