భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో అనేక కొత్త కార్లు విడుదలయ్యాయి. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో విధించిన లాక్‌డౌన్ మరియు అధిక డిమాండ్ కారణంగా కొన్ని రకాల వాహనాల వెయిటింగ్ పీరియడ్ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఈ కథనంలో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండే టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత, ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇవ్వడంతో కార్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు కొత్తగా వచ్చిన లేటెస్ట్ కార్లకు భారత యువత నుండి ఆదరణ పెరగడంతో వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు కొత్త కారు కావాలంటే, చాలా నెలల వేచి ఉండాల్సి వస్తోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ కొరత కూడా వాహనాల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తోంది. మరి, ప్రస్తుతం ఏయే కారుకు ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

మహీంద్రా థార్

దేశంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కారు మోడళ్ల జాబితాలో మహీంద్రా థార్ అగ్రస్థానంలో ఉంది. గతేడాది చివర్లో విడుదలైన ఈ కొత్త తరం మహీంద్రా థార్ కారుకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ కారు కోసం సుమారు 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది వివిధ రాష్ట్రాలు మరియు నగరాల్లో వేర్వేరుగా ఉంటుంది. కానీ, చాలా ప్రధాన నగరాల్లో ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 12 నెలల వరకూ ఉంటోంది. ఇప్పటికే ఈ కారును బుక్ చేసుకున్న వారు, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ గురించి కంప్లైంట్స్ చేస్తున్నారు.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

హ్యుందాయ్ క్రెటా

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా కూడా ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఆరంభంలో కంపెనీ ఇందులో లేటెస్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

కొత్త వెర్షన్ రాకతో క్రెటా అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ మోడల్ కోసం సుమారు 9 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. హ్యుందాయ్ క్రెటాకి ప్రత్యామ్నాయంగా ఈ విభాగంలో కియా సెల్టోస్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, స్కొడా కుషాక్ మరియు త్వరలో విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

మారుతి సుజుకి ఎర్టిగా

భారతదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎమ్‌పివిలలో మారుతి సుజుకి ఎర్టిగా కూడా ఒకటి. ఇది ఈ విభాగంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఈ కారుకి ఉన్న అధిక డిమాండ్ కారణంగా, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

మార్కెట్ సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఎర్టిగా కోసం సుమారు 3 నెలల నుండి 8 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదవరకు చెప్పుకున్నట్లుగా ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది డీలర్ వద్ద ఉండే స్టాక్ మరియు నగరాలను బట్టి మారుతూ ఉంటుంది. ఎర్టిగాలో పెట్రోల్ వెర్షన్‌తో పాటుగా సిఎన్‌జి వెర్షన్ కూడా లభిస్తుంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ ఇండియా, దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన అద్భుతమైన వాహనాలో మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఒకటి. సరసమైన ధర, లేటెస్ట్ టెక్నాలజీ మరియు మోడ్రన్ డిజైన్‌తో వచ్చిన ఈ కారు కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. భారత కస్టమర్ల నుండి ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

ప్రస్తుతం, దేశంలో నిస్సాన్ మాగ్నైట్ కోసం సుమారు 7 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుండి అప్‌గ్రేడ్ కోరుకునే వారిని మరియు కొత్తగా మొదటిసారి కారు కొనే కస్టమర్లను నిస్సాన్ మాగ్నైట్ ఆకర్షిస్తోంది. ఫలితంగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

కియా సొనెట్

కియా మోటార్స్ తమ సెల్టోస్ సక్సెస్ తర్వాత మార్కెట్లో ప్రవేశపెట్టిన లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్. వివిధ రకాల ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఈ కారుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ కస్టమర్ల నుండి మంచి ఆదరణ పొందుతున్న ఈ కారు వెయిటింగ్ పీరియడ్ సుమారు 5 నెలల వరకూ ఉంటోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

కియా సెల్టోస్

కియా మోటార్స్ నుండి లభిస్తున్న మరొక పాపులర్ ఎస్‌యూవీ

సెల్టోస్. క్రెటాకి ప్రత్యామ్నాయంగా సరసమైన ధరకే లభిస్తున్న ఈ కారుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో సెల్టోస్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ కారు కోసం సుమారు 5 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

టాటా నెక్సాన్

భారతదేశంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. అంతేకాదు, ఈ విభాగంలో అత్యంత విశ్వసనీయమైన మరియు ధృడమైన కారు కూడా టాటా నెక్సాన్ కావటం విశేషం. భద్రత విషయంలో నెక్సాన్ భరోసా మరియు, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా మార్కెట్లో ఈ కారు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

ఫలితంగా ఈ కారు వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం వివిధ నగరాల్లో టాటా నెక్సాన్ వెయిటింగ్ పీరియడ్ సుమారు 5 నెలల వరకూ ఉంటోంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

రెనో కైగర్

నిస్సాన్ మాగ్నైట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ రెనో కైగర్. నిర్మాణంలో మాగ్నైట్ మరియు కైగర్ రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, దాని ఫీచర్లు మరియు డిజైన్ విషయంలో మాత్రం ఇవి వేర్వేరుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ కారు కోసం సుమారు 4 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా, దేశంలో ఎమ్‌జి మోటార్ వాహనాల ఉత్పత్తి కొంత కాలం పాటు నిలిచిపోయింది. ఫలితంగా, ఈ కంపెనీ విక్రయించే కార్ల వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది. ఈ కంపెనీ అందిస్తున్న హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వీటి వెయిటింగ్ పీరియడ్ సుమారు 3 నెలల వరకూ ఉంటోంది.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

టాటా సఫారీ

చాలా ఏళ్ల తర్వాత టాటా మోటార్స్ తమ సఫారీ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాటా హారయర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిన టాటా సఫారీ పెద్ద కుటుంబాలను మరియు ఆఫ్-రోడ్ ప్రియులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం సుమారు 3 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుందని సమాచారం.

భారత మార్కెట్లో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న టాప్ 10 కార్లు

గమనిక: పైన పేర్కొన్న వాహనాల వెయిటింగ్ పీరియడ్ అనేది డీలర్‌షిప్ సామర్థ్యం మరియు నగరాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఖచ్చితమైన వెయిటింగ్ పీరియడ్ కోసం మీ సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించగలరు.

Most Read Articles

English summary
Top 10 cars in india with highest waiting period in august 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X