సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

గడచిన సెప్టెంబర్ 2021 నెల కార్ కంపెనీలకు నష్టాలనే మిగిల్చింది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో గత నెలలో కార్ల అమ్మకాలు కుదేలయ్యాయి. దేశంలోని రెండు అతిపెద్ద కార్ కంపెనీలైన మారుతి సుజుకి మరియు హ్యుందాయ్‌తో, దాదాపు అన్ని కార్ కంపెనీలు అమ్మకాలు క్షీణించాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రమే అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేశాయి.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

అంతేకాకుండా, గత నెలలో టాప్ 10 కార్ల జాబితాలో వాహనాల తీరు కూడా తారుమారైంది. ఈ జాబితాలో ఎల్లప్పుడూ టాప్ 5 స్థానాల్లో కనిపించే మారుతి స్విఫ్ట్, ఈసారి ఈ జాబితా నుండి మాయమైంది. మొత్తం అమ్మకాల పరంగా గత నెల టాప్ 10 కార్ బ్రాండ్ లిస్టుని గమనిస్తే, మొదటి మూడు స్థానాల్లో మారుతి, హ్యుందాయ్ మరియు టాటా పేర్లు వెలువడ్డాయి. ఇదే సమయంలో కియా, మహీంద్రా మరియు టొయోటా కార్లు కూడా బాగానే అమ్ముడయ్యాయి.

మరి సెప్టెంబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

1. మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)

భారతదేశంలో బెస్ట్ బడ్జెట్ ఫ్యామిలీ కారుగా ఉన్న మారుతి సుజుకి ఆల్టో గత నెలలో కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఎప్పటిలానే ఈసారి కూడా, ఆల్టో తమ గొప్ప అమ్మకాల ప్రదర్శనను కనబరిచింది. సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ మొత్తం 12,143 ఆల్టో కార్లను విక్రయించింది. గత నెల విక్రయాలలో కంపెనీ నుండి 10,000 యూనిట్లకి పైగా అమ్ముడైన కార్లలో ఆల్టో మొదటిది.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

2. మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)

గడచిన సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్లకు పైగా అమ్ముడైన రెండవ మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. గత నెలలో ఎర్టిగా మొత్తం అమ్మకాలు 11,308 యూనిట్లుగా నమోదయ్యాయి. మల్టీ పర్పస్ వెహికల్ విభాగంలో ప్రస్తుతం కస్టమర్ల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న ఎర్టిగా 7-సీటర్ సామర్థ్యంతో ఎక్కువ క్యాబిన్ స్థలం మరియు మైలేజీకి ప్రసిద్ధి చెందిన మోడల్ గా కొనసాగుతోంది. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో ఎర్టిగా అమ్మకాలు 13 శాతం పెరిగాయి.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

3. కియా సెల్టోస్ (Kia Seltos)

కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్) దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్ గత నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. ఈ జాబితాలో కియా సెల్టోస్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 2021 లో కియా సెల్టోస్ మొత్తం అమ్మకాలు 9,583 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఇది గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోల్చుకుంటే, ఇది 5 శాతం ఎక్కువ. కియా అమ్మకాల వృద్ధిలో సెల్టోస్ కీలక పాత్ర పోషిస్తోంది.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

4. టాటా నెక్సాన్ (Tata Nexon)

గత నెలలో మారుతి, హ్యుందాయ్ మొత్తం నెలవారీ అమ్మకాలు భారీగా తగ్గినప్పటికీ, టాటా మోటార్స్ అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఆగస్ట్ 2021 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో టాటా మోటార్స్ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. గత నెలలో టాటా మోటార్స్ మొత్తం 9,211 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీ లను విక్రయించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 50 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ఈ సమయంలో సెగ్మెంట్ లీడర్లు అయిన మారుతి విటారా బ్రెజ్జా మరియు హ్యుందాయ వెన్యూ వంటి కార్లను అధిగమించ టాటా నెక్సాన్ నాల్గవ స్థానంలో నిలిచింది.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

5. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)

ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది హ్యుందాయ్ క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీ. క్రెటాకు ఎప్పటి మాదిరిగానే అధిక డిమాండ్ ఉంటోంది. ఈ సెగ్మెంట్లోకి స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లు ప్రవేశించినప్పటికీ హ్యుందాయ్ క్రెటాకి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. గడచిన సెప్టెంబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 8,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, ఇవి కంపెనీ విక్రయించే నెలవారీ సగటు కంటే చాలా తక్కువ అని చెప్పాలి. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 33 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం సెమీకండక్టర్ చిప్స్ కొరత వలన పెరిగిన వెయిటింగ్ పీరియడ్.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

6. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

గడచిన సెప్టెంబర్ నెలలో, మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు భారీగా క్షీణించినప్పటికీ, ఇది ఆరవ స్థానంలో నిలిచింది. గత నెలలో మారుతి సుజుకి కేవలం 8,077 యూనిట్ల బాలెనో హ్యాచ్‌బ్యాక్ లను మాత్రమే విక్రయించగలిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయించిన 19,483 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో బాలెనో అమ్మకాలు 59 శాతం తగ్గాయి. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా మారుతి సుజుకి తమ బాలెనో కారును విక్రయిస్తోంది.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

7. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

గత నెలలో హ్యుందాయ్ యొక్క ప్రముఖ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ అమ్మకాలు కూడా గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే భారీగానే తగ్గాయి. సెప్టెంబర్ 2021 నెలలో హ్యుందాయ్ మొత్తం 7,924 యూనిట్ల వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయించింది. ఈ సమయంలో ఇది పాపులర్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అమ్మకాలను అధిగమించగలిగింది.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

8. మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco)

గత నెలలో అమ్ముడైన వివిధ కార్ బ్రాండ్ల యొక్క కొన్ని ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పోలిస్తే సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి ఈకో వ్యాన్ అమ్మకాలు చాలా స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో మొత్తం 7,844 యూనిట్ల మారుతి సుజుకి ఈకో వ్యాన్లు అమ్ముడయ్యాయి. అయితే, సెప్టెంబర్ 2020 తో పోలిస్తే, ఈ అమ్మకాలు దాదాపు 31 శాతం తక్కువగా ఉన్నాయి.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

9. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)

కొత్త తరం మోడల్ గా వచ్చిన వ్యాగన్ఆర్ పట్ల కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, సెప్టెంబరు 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలలో అతిపెద్ద తగ్గుదల కనిపించింది. ఈ జాబితాలో తొమ్మిదవ స్థానానికి పడిపోయిన వ్యాగన్ఆర్, గత నెలలో కేవలం 7,632 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. సెప్టెంబర్ 2020 లో ఈ మోడల్ అమ్మకాల సంఖ్య 17,581 యూనిట్లుగా నమోదైంది. ఈ సమయంలో వ్యాగన్ఆర్ అమ్మకాలు దాదాపు 57 శాతం క్షీణించాయి.

సెప్టెంబర్ 2021లో టాప్ 10 కార్లు: మారుతి ఆల్టో నుంచి టాటా ఆల్ట్రోజ్ వరకూ..

10. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఈ జాబితాలో టాప్ 10 స్థానంలో ఉంది. సెప్టెంబర్‌ 2020 నెలలో టాటా మోటార్స్ మొత్తం 5,772 యూనిట్ల ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించింది. గత నెలలో మొత్తం టాటా కార్ల విక్రయాలలో టాటా ఆల్ట్రోజ్ వాటా 20 శాతానికి పైగానే ఉంది.

Most Read Articles

English summary
Top 10 cars sold in india in september 2021 alto ertiga seltos nexon creta and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X