లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితులు ఇంకా తొలగిపోనప్పటికీ, గడచిన జూన్ 2021 నెలలో, కార్ల తయారీదారులు అమ్మకాల పరంగా ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేశారు. తాజాగా జూన్ 2021 నెలలో భారతదేశం నుండి ఎగుమతి చేసిన టాప్ 10 కార్ల జాబితా కూడా వెల్లడైంది. గత నెలలో భారతదేశం నుండి మొత్తం 52,935 కార్లు ఎగుమతి అయ్యాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

జూన్ 2020లో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా కేవలం 24,561 కార్లు మాత్రమే భారతదేశం నుండి ఎగుమతి అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ జాబితాలోని చాలా కార్లు హ్యుందాయ్ మరియు మారుతి సుజుకి బ్రాండ్లకు చెందినవే. ఈ టాప్ 10 జాబితాలో 4 కార్లు హ్యుందాయ్ ఉండగా, 3 మారుతి సుజుకికి కార్లు ఉన్నాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

ఇవి కాకుండా, నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్ మరియు కియా మోటార్స్ బ్రాండ్ల నుండి కూడా ఒక్కొక్క కారు ఈ టాప్ 10 జాబితాలో ఉంది. ఈ జాబితాలో 4,310 యూనిట్లతో నిస్సాన్ సన్నీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో నిస్సాన్ సన్నీ అమ్మకాలు 1,327 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మోడల్ ఎగుమతులు 224.79 శాతం పెరిగాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది హ్యుందాయ్ యొక్క పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా. గత నెలలో మొత్తం 4,141 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. గత ఏడాది జూన్‌లో కంపెనీ కేవలం 154 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. అప్పటితో పోల్చుకుంటే ఈ మోడల్ ఎగుమతులు 2589 శాతం పెరిగాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

ఇందులో మూడవ స్థానంలో మారుతి సుజుకి అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఉంది. గత నెలలో మొత్తం 3,901 యూనిట్ల బాలెనో కార్లు ఎగుమతి చేయబడ్డాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో, ఇవి 512 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో క్రెటా ఎగుమతులు 661.91 శాతం పెరిగాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

ఇకపోతే, ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది ఫోక్స్‌వ్యాగన్ వెంటో. జూన్ 2021లో వెంటో ఎగుమతులు 3,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం జూన్ నెలలో ఇవి 2,526 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఎగుమతులు 26.41 శాతం పెరిగాయి.

లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

టాప్ 10 జాబితాలో 5వ స్థానంలో ఉంది మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ మారుతి డిజైర్. గత నెలలో 3,024 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో, ఇవి 1,006 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మారుతి డిజైర్ ఎగుమతులు 200.60 శాతం పెరిగాయి.

Rank Exports Jun-21 Jun-20 Growth (%)
1 Nissan Sunny 4,310 1,327 224.79
2 Hyundai Creta 4,141 154 2,589
3 Maruti Baleno 3,901 512 661.91
4 Volkswagen Vento 3,193 2,526 26.41
5 Maruti Dzire 3,024 1,006 200.60
6 Hyundai Grand i10 2,999 767 291.00
7 Kia Seltos 2,848 2,493 14.24
8 Maruti S-Presso 2,674 939 184.77
9 Hyundai Verna 2,463 2,542 -3.11
10 Hyundai Aura 1,794 949 89.04
లాక్డౌన్ ఉన్నప్పటికీ, కార్ల ఎగుమతులు భేష్; జూన్‌లో టాప్ 10 కార్లు ఇవే..!

ఈ జాబితాలో 2,999 యూనిట్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ 6వ స్థానంలో ఉండగా, 2,848 యూనిట్లతో కియా సెల్టోస్ 7వ స్థానంలో, 2,674 యూనిట్లతో మారుతి ఎస్ప్రెస్సో 8వ స్థానంలో, 2,463 యూనిట్లతో హ్యుందాయ్ వెర్నా 9వ స్థానంలో మరియు 1,794 యూనిట్ల హ్యుందాయ్ ఔరా 10వ స్థానంలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 10 Exported Cars From India In June 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X