2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ప్రస్తుత (2021) సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థల జాబితా వెల్లడైంది. ఇప్పటి వరకూ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగిన జర్మన్ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

గతంలో రెండవ స్థానంలో ఉన్న జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. టొయోటా 2021 నాటికి 2 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీదారుల జాబితాలో ఉంది.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

టొయోటా విలువ గత ఏడాది 58.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో ఇది 59.47 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మెర్సిడెస్ బెంజ్ రెండో స్థానానికి పడిపోయింది.

MOST READ:ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

గడచిన 2020లో మెర్సిడెస్ బెంజ్ విలువ గత ఏడాది 65.04 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2021లో అది 58.22 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రజలు మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తులను స్వీకరించడం తగ్గించడమే ఈ భారీ క్షీణతకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మహమ్మారి కూడా బెంజ్ పతనానికి కారణమైంది.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ఈ జాబితాలో మెర్సిడెస్ బెంజ్ తరువాత ఫోక్స్‌వ్యాగన్ మూడవ అతిపెద్ద విలువైన కార్ల తయారీ సంస్థగా ఉంది. అనేక ఆటోమొబైల్ బ్రాండ్లను కలిగి ఉన్న ఈ కార్ బ్రాండ్ విలువ 2020లో 44.89 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది 2021 నాటికి 47.02 బిలియన్ల డాలర్లకు పెరిగింది.

MOST READ:ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ఇక నాల్గవ స్థానంలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ ఉంది. ఈ సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఆదాయం అత్యల్పంగా మాత్రమే క్షీణించింది. గత 2020లో బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ల సంస్థ విలువ 40.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2021లో అది 40.44 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ఐదవ స్థానంలో కూడా మరొక జర్మన్ కార్ కంపెనీయే స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ కంపెనీ పోర్ష్ విలువ 2020లో 33.91 బిలియన్ డాలర్లు ఉండగా, 2021లో అది 34.32 బిలియన్ డాలర్లకు పెరిగింది.

MOST READ:కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ప్రథమ స్థానాన్ని జపనీస్ కార్ బ్రాండ్ దక్కించుకోగా మిగిలిన నాలుగు స్థానాలను వరుసగా జర్మన్ కార్ బ్రాండ్లే దక్కించుకున్నాయి. ఆరవ స్థానంలో అమెరికన్ కార్ బ్రాండ్ టెస్లా నిలిచింది.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

టెస్లా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేస్తున్నప్పటికీ, ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలవడం విశేషం. గత 2020లో 12.41 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ విలువ 2021 నాటికి భారీగా పెరిగి 31.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

టెస్లా సంస్థ కనబరిచిన ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా సదరు కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ గత సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. ఈ అమెరికన్ కార్ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలో కూడా తమ వ్యాపారాన్ని సాగించేందుకు సిద్ధమైంది. త్వరలోనే మనదేశంలో కూడా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయి.

2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

టెస్లా తదుపరి (7వ) స్థానంలో జపనీస్ కార్ బ్రాండ్ హోండా నిలిచింది. ఈ సమయంలో హోండా బ్రాండ్ విలువ 33.10 బిలియన్ డాలర్ల నుండి 31.36 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఫోర్డ్ విలువ 18.51 బిలియన్ డాలర్ల నుండి 22.67 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Rank Brand 2021 Valuation In USD 2020 Valuation In USD
1 Toyota 59.47 Billion 58.07 Billion
2 Mercedes-Benz 58.22 Billion 65.04 Billion
3 Volkswagen 47.02 Billion 44.89 Billion
4 BMW 40.44 Billion 40.48 Billion
5 Porsche 34.32 Billion 33.91 Billion
6 Tesla 31.98 Billion 12.41 Billion
7 Honda 31.36 Billion 33.10 Billion
8 Ford 22.67 Billion 18.51 Billion
9 Volvo 17.75 Billion 16.91 Billion
10 Audi 17.18 Billion 16.97 Billion
2021లో ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 10 కార్ బ్రాండ్స్

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న స్వీడిష్ కార్ బ్రాండ్ వోల్వో విలువ 16.91 బిలియన్ డాలర్ల నుండి 17.75 బిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో జర్మన్ కార్ బ్రాండ్ ఆడి విలువ 16.97 బిలియన్ డాలర్ల నుండి 17.18 బిలియన్ డాలర్లకు పెరిగి పదవ స్థానంలో కొనసాగుతోంది.

Most Read Articles

English summary
Top 10 Most Valuable Car Brands In The World In 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X