అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

గడచిన అక్టోబర్‌ 2021 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్‌యూవీల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో, కొరియన్ కార్ కంపెనీ విక్రయిస్తున్న హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) మొదటి స్థానంలో నిలిచిది. గత అక్టోబర్ 2020లో హ్యుందాయ్ 8,828 యూనిట్ల వెన్యూ ఎస్‌యూవీలను విక్రయించగా, అక్టోబర్ 2021లో మొత్తం 10,554 యూనిట్లను విక్రయించి 19.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

కాగా, ఈ జాబితాలో కియా సెల్టోస్ (Kia Seltos) రెండవ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 2020లో కియా సెల్టోస్ అమ్మకాలు 8,900 యూనిట్లుగా ఉంటే, అక్టోబర్‌ 2021లో ఇవి 10,448 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో కియా సెల్టోస్ అమ్మకాలు 17.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ జాబితాలో టాటా నెక్సాన్ మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ గత ఏడాది అక్టోబర్ 2020లో కేవలం 6,888 యూనిట్ల నెక్సాన్ కార్లను మాత్రమే విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 2021లో ఈ సంఖ్య 10,096 యూనిట్లకు పెరిగింది. ఈ సమయంలో నెక్సాన్ అమ్మకాలు 46.5 శాతం పెరిగాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

టాటా నెక్సాన్ (Tata Nexon) కాంపాక్ట్ ఎస్‌యూవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఎస్‌యూవీల జాబితాలో నిలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టులో ఈ ఎస్‌యూవీ పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్న మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' కారుగా నిలిచింది. టాటా నెక్సాన్ అత్యుత్తమ సేఫ్టీ మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్ల కారణంగా, మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన టాటా పంచ్ (Tata Punch) ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. టాటా పంచ్ గడిన అక్టోబర్ 2021 నెలలో మార్కెట్లో విడుదలైంది. కాంపాక్ట్ సైజ్, స్టైలిష్ డిజైన్ మరియు విశిష్టమైన ఫీచర్ల కారణంగా, టాటా పంచ్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. టాటా పంచ్ గత అక్టోబర్‌ నెలలో 8,453 యూనిట్ల అమ్మకాలతో, అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

టాటా పంచ్ మార్కెట్లో విడుదలైన మొదటి నెలలో 8,453 యూనిట్ల విక్రయాలను నమోదు చేయడం నిజంగా గొప్ప విషయం. టాటా నెక్సాన్ కారు మాదిరిగానే, టాటా పంచ్ కారు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుని, దేశంలో కెల్లా అత్యంత సురక్షితమైన చిన్న కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ సేఫ్టీ రేటింగ్ కూడా టాటా పంచ్ అమ్మకాల పెరుగుదలకు కారణం అని చెప్పవచ్చు. మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి విక్రయిస్తున్న విటారా బ్రెజ్జా (Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యూవీ. గత ఏడాది అక్టోబర్ 2020 నెలలో మారుతి సుజుకి మొత్తం 12,087 యూనిట్ల విటారా బ్రెజ్జా ఎస్‌యూవీలను విక్రయించగా, అక్టోబర్‌ 2020లో అవి 8,032 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో విటారా బ్రెజ్జా అమ్మకాలు 33.5 శాతం తగ్గాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

హ్యుందాయ్ అందిస్తున్న మరొక పాపులర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 2020లో, హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 14,023 యూనిట్లుగా ఉంటే, అవి ఈ ఏడాది అక్టోబర్ (2021) నెలలో 6,455 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 53.9 శాతం క్షీణించాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

అలాగే, ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది కియా సొనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్‌యూవీ. గత ఏడాది అక్టోబర్ 2020 నెలలో కియా సొనెట్ అమ్మకాలు 11,721 యూనిట్లుగా ఉంటే, అవి ఈ ఏడాది అక్టోబర్‌ 2021 నెలలో 5,443 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో సోనెట్ అమ్మకాలు 53.5 శాతం క్షీణించాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

గత అక్టోబర్ 2020లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 అమ్మకాలు 4,882 యూనిట్లుగా ఉంటే, అవి అక్టోబర్ 2021లో 4,203 యూనిట్లకి పడిపోయాయి. ఈ సమయంలో ఎక్స్‌యూవీ300 అమ్మకాలు 13.9 శాతం క్షీణంచాయి. టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ ఎస్‌యూవీల మాదిరిగానే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. అయినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం తగ్గుతూనే వస్తున్నాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

మహీంద్రా అండ్ మహీంద్రా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఎస్‌యూవీ స్పెషలిస్ట్ నుండి ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ ఇటీవల మార్కెట్లో విడుదలైంది. గడచిన అక్టోబర్‌ 2021 నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 అమ్మకాలు 3,407 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే 65,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు కూడా జరిగాయి.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

కాబట్టి, రాబోయే నెలల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 డెలివరీల సంఖ్యను బట్టి, కంపెనీ మొత్తం విక్రయాల సంఖ్య కూడా పెరగే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) కాంపాక్ట్ ఎస్‌యూవీ. నిస్సాన్ ఈ ఏడాది అక్టోబర్‌ 2021 నెలలో మొత్తం 3,389 మాగ్నెట్ కార్లను విక్రయించింది. నిస్సాన్ మాగ్నైట్ గత ఏడాది డిసెంబర్ 2020లో ప్రారంభించబడింది. కాబట్టి, దాని విక్రయాల పరిమాణాన్ని గతేడాది అక్టోబర్ నెలతో పోల్చలేము.

అక్టోబర్ 2021 నెలలో టాప్ 10 ఎస్‌యూవీలు ఇవే.. పోటీదారులకు గట్టిగా పంచ్ ఇచ్చిన టాటా పంచ్..

సాధారణంగా, పండుగల సీజన్లో కార్ల అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, గడచిన అక్టోబర్ నెలలో ఆటోమొబైల్ కంపెనీలు సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా వాహనాల ఉత్పత్తిని తగ్గించడం, ఫలితంగా వాటి వెయిటింగ్ పీరియడ్ పెరగడంతో అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత నవంబర్ 2021 నెలలో మాత్రం అమ్మకాల ట్రెండ్ ప్రోత్సాహకరంగా ఉండొచ్చని తయారీదారులు భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Top 10 suv s sold in october 2021 hyundai venue tops the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X