భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న కార్లు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లతో లభిస్తున్నాయి. ఒకప్పుడు ఖరీదైన లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన చాలా ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ టెక్నాలజీ ఆధారంగా, అనేక రకాల కొత్త సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లు కూడా పుట్టుకొచ్చాయి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

గతంలో లగ్జరీ కార్లలో కూడా అందుబాటులో లేని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లు ఇప్పుడు భారతదేశంలో లభిస్తున్న కొన్ని కార్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ADAS అమర్చిన కార్లలో అత్యంత ఉపయోగకరమైన సిస్టమ్‌లలో ఒకటి అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ (Adaptive Cruise Control). అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ను అర్థం చేసుకోవడానికి, మనం ముందుగా క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

క్రూయిజ్ కంట్రోల్ అనేది దూరప్రయాణాలు మరియు హైవే డ్రైవింగ్ కోసం ఉపయోగించే ఓ కంఫర్ట్ ఫీచర్. సాధారణంగా, కారును నిరంతరాయంగా నడుపుతూ ఉండాలంటే, డ్రైవర్ యాక్సిలరేటర్ పెడల్ పై కాలు తీయకూడదు. కానీ, ఈ క్రూయిజ్ కంట్రోల్ సాయంతో, డ్రైవర్ కారును నిర్ధిష్ట వేగానికి తీసుకువెళ్లి ఈ ఫంక్షన్ ను ఆన్ చేయడం ద్వారా యాక్సిలరేటర్ ను నొక్కాల్సిన అవసరం లేకుండానే కారును ఆ నిర్ధిష్ట వేగంతో నడపవచ్చు.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

క్రూయిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ బ్రేక్ పెడల్ పై కాలు వేయగానే, సదరు ఫంక్షన్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. అయితే, తిరిగి దీనిని ఆన్ చేయాలంటే, డ్రైవర్ కారును మళ్ళీ నిర్ధిష్ట వేగానికి తీసుకువెళ్లి ఈ ఫంక్షన్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రూయిజ్ కంట్రోల్ బటన్ సాధారణంగా స్టీరింగ్ వీల్ పై అమర్చబడి ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే, కారు డ్రైవర్ నుండి ఎటువంటి ఇన్‌పుట్ లేకుండానే సెట్ చేసిన వేగం వద్ద రోడ్డుపై పరుగులు తీస్తూ ఉంటుంది.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ అనేది, క్రూయిజ్ కంట్రోల్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. సాధారణంగా, స్టాండర్డ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న కారు, డ్రైవర్ సెట్ చేసిన వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. కానీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న కారు, దాని ముందు వెళ్తున్న కారు యొక్క వేగాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

ఉదాహరణకు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉన్న డ్రైవర్, తన కారు యొక్క వేగాన్ని 60 కిమీ వేగం వద్ద సెట్ చేశాడని అనుకుంటే, ఖాళీ రోడ్డుపై ఆ కారు గంటకు 60 కిమీ వేగంతో డ్రైవర్ యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ముందుకు సాగిపోతుంది. కానీ, అదే కారు ముందు ఏదైనా వాహనం గంటకు 50 కిమీ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే, కారులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి, కారు వేగాన్ని కూడా ముందు వెళ్తున్న కారు వేగం కంటే తక్కువగా ఉండేలా క్రూయిజ్ కంట్రోల్ ని అడ్జస్ట్ చేస్తుంది.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

అదే సమయంలో, ముందు వెళ్తున్న కారు వేగం పుంజుకొని గంటకు 80 కి.మీ వేగంతో వెళ్తున్నట్లయితే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన కారు డ్రైవర్ సెట్ చేసినట్లుగా గంటకు 60 కిమీ వేగం వద్ద లాక్ అయి ముందుకు ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇందులో డ్రైవర్ ఒక్కసారి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ను ఎంగేజ్ చేస్తే సరిపోతుంది, మిగతాదంతా కారులోని సెన్సార్లు మరియు ఆన్-బోర్డ్ కంప్యూటర్లు చూసుకుంటాయి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

ఇదీ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ పనిచేసే విధానం. సింపుల్ గా చెప్పాలంటే ముందు వెళ్తున్న వాహనం వేగంగా వెళ్తుంటే, ఈ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కారు కూడా డ్రైవర్ సెట్ చేసిన నిర్దిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. అలాకాకుండా, ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్తుంటే, ఈ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కారు కూడా వేగం తగ్గించి, నెమ్మదిగా వెళ్తుంది. స్టాండర్డ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ లో ఈ ఫీచర్ ఉండదు, ఇందులో వేగం తగ్గించడానికి డ్రైవర్ జోక్యం చేసుకోవటం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

అడ్వాన్స్డ్ డ్రైవ్ర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఒకటి. మనదేశంలో ఈ ఫీచర్ తో లభిస్తున్న కార్లు మొత్తం మూడు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

1. ఎమ్‌జి గ్లోస్టర్ (MG Gloster)

మనదేశానికి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అడ్వాన్స్డ్ డ్రైవ్ర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను పరిచయం చేసింది చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్. ఈ కంపెనీ విక్రయిస్తున్న ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీలో ఇలాంటి మరెన్నో అధునాతన ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ జాబితాలో ఇదే అతిపెద్ద మరియు ఖరీదైన వాహనం. గ్లోస్టర్ ఒక ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

కంపెనీ ఈ కారులో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జర్, మసాజింగ్ సీట్లు, కూల్డ్ సీట్లు, PM2.5 ఫిల్టర్, ఆటో హెడ్‌లైట్లు, పవర్డ్ సీట్లు, డ్రైవ్ మోడ్‌లు మరియు అనేక ఫీచర్లను అందిస్తోంది. మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ ధరలు రూ. 29.98 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 37.68 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

2. మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీ మహీంద్రా XUV700 కూడా అడ్వాన్స్డ్ డ్రైవ్ర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లతో లభిస్తుంది. ఇంకా ఇందులో అతిపెద్ద ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (స్కైరూఫ్), డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పవర్ టెయిల్‌గేట్, పవర్డ్ సైడ్ మిర్రర్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, Apple CarPlay మరియు Android Autoతో కూడిన 10 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ ఇంజన్ 197 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. కాగా, ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్స్‌లో లభిస్తుంది. వీటిలో మొదటిది 182 bhp పవర్‌ని మరియు రెండవది 153 bhp పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధరలు 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

3. ఎమ్‌జి ఆస్టర్ (MG Astor)

ఎమ్‌జి మోటార్ నుండి తాజాగా వచ్చిన మరొక ఉత్పత్తి ఎమ్‌జి ఆస్టర్. ఆస్టర్ ఈ జాబితాలోకి తాజాగా వచ్చిన ఎస్‌యూవీ మాత్రమే కాదు, ADAS ఫీచర్లతో లభించే అత్యంత సరసమైన ఎస్‌యూవీ కూడా ఇదే. ఈ ఎస్‌యూవీలో లభించే ఇతర ఫీచర్లలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, క్రోమ్-టిప్డ్ టెయిల్‌పైప్స్, క్రోమ్ విండో లైన్లు, లెథర్ లేయర్డ్ డాష్‌బోర్డ్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 3 స్టీరింగ్ మోడ్‌లు, పవర్ విండోలు మరియు పవర్ సైడ్ మిర్రర్స్ వంటివి మరెన్నో ఉన్నాయి.

భారత్‍లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్లతో లభించే టాప్ 3 కార్లు

ఎమ్‌జి ఆస్టర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 108.5bhp పవర్ మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 8-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇకపోతే, రెండవది 138bhp పవర్ మరియు 220Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌. ఈ ఇంజన్ కేవలం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 9.78 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకూ ఉంటుంది.

Most Read Articles

English summary
Top 3 cars in india with adaptive cruise control and adas details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X