భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాదాపు చాలా కార్లలో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అహనా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటంతో పాటు, మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఇటువంటి ఆధునిక ఫీచర్స్ 2020 తరువాత మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో అందుబాటులో ఉన్నాయి.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

పవర్ విండోస్:

ఇంతకు ముందు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో పవర్ విండోస్ ఎత్తడానికి మరియు దించడానికి అనుకూలంగా ఒకరకమైన హ్యాండిల్ బార్ అందించేవారు. కొన్ని సందర్భాల్లో ఈ హ్యాండిల్ బార్లను ఉపయోగించి పవర్ విండోస్ ఆపరేట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా కార్లలో పవర్ విండోస్ హ్యాండిల్ చేయడానికి బటన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బటన్స్ ఉపయోగించి పవర్ విండోస్ ఆపరేట్ చేయడం చాలా సులభం. కావున ఇప్పుడు వాహన వినియోగదారులు ఈ పవర్ విండోస్ ఆపరేట్ చేయడానికి ఈ ఫీచర్ కోరుకుంటున్నారు.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

ఆటోమేటిక్ ఏసీ:

ప్రస్తుతం ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు కోరుకుంటున్న ఫీచర్ ఈ ఆటోమాటిక్ ఏసీ. ఈ ఆటోమేటిక్ ఏసీ టెక్నాలజీ ఫీచర్ కారు లోపలి భాగాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆటోమేటిక్ ఎసిలు ఆటోమేటిక్‌గా కారు లోపల ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోపడతాయి. ఈ కారణంగా ఎక్కువమంది వాహన దారులు ఈ ఫీచర్ కోరుకుంటున్నారు.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్:

ఇప్పుడు 'టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్' అనేది సర్వసాధారణమైన ఫీచర్. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేది వాహన వినియోగదారులకు చాలా మంది అనుభవాన్ని అందిస్తుంది.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్ లో 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఆపరేట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎక్కువమంది వినియోగదారులకు ఇష్టమైన ఫీచర్ కూడా.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

గ్లౌస్ బాక్స్:

కార్లలో గ్లౌస్ బాక్స్ కూడా వాహన వినియోగ్గదారులకు చాలా అనుకూలమైన ఫీచర్. ఇది ఒకప్పటి నుంచి కూడా అందుబాటులో ఉంది. ఇందులో డ్రైవర్ యొక్క గ్లౌస్ భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో లేదు, కావున డ్రైవర్లు చల్లని వాతావరణంలో కారుని డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ పట్టుకోవడానికి మరియు హ్యాండ్స్ వెచ్చగా ఉండటానికి గ్లౌస్ ధరించేవారు. తరువాత వాటిని తీసి గ్లౌస్ బాక్స్ లో పెట్టేవారు.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

అయితే ఇప్పుడు అత్యవసరమైన వస్తువులను ఉంచడానికి ఈ గ్లౌస్ బాక్స్ లు ఉపయోగపడుతున్నాయి. కావున వాహనదారులు ఈ ఫీచర్ కూఆ ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎక్కువమంది వాహనదారులు కోరుకునే ఫీచర్స్ లో ఈ గ్లౌస్ బాక్స్ కూడా ఒకటి. ప్రస్తుతం అందుబటులో ఉన్న దాదాపు అన్ని కార్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్:

కారులో అత్యంత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని పొందాలనుకునే వారు తప్పనిసరిగా ఈ ఫీచర్‌ని కలిగి ఉండాలి. ఈ ఫీచర్ డ్రైవర్ సీటు ఎత్తును సరిగా సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ కారణంగా భారతీయులు ఈ సదుపాయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అనేది రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ కాగా, మరొకటి మాన్యువల్ అడ్జస్టబుల్. ఇందులో ఎక్కువమంది ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ కోరుకుంటారు. ఇది చాలా అనుకూలమైన ఫీచర్.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు మరణాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కార్ల తయారీదారులందరూ తమ కార్లకు కనీసం 6 ఎయిర్‌బ్యాగులు ఇవ్వాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ ఫీచర్స్.. వివరాలు

భారతదేశంలో ఎక్కువ భాగం ఖరీదైన కార్లలోనే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి, కానీ తక్కువ ధర వద్ద లభించే కార్లలో కూడా ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ అందిస్తే ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య బాగా తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాబోయే రోజుల్లో, ఎయిర్‌బ్యాగులు విండోస్ మరియు మిర్రర్స్ రూపంలో కార్లలో అంతర్భాగంగా మారతాయి.

Most Read Articles

English summary
Top 5 car features used by indians details
Story first published: Thursday, September 30, 2021, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X