భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు మరియు ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడయ్యే బాడీ టైప్ వహనాలు. కానీ, ఈ మూడింటినీ మిళితం చేసి రూపొందించిన క్రాసోవర్ కార్లు మాత్రం ఇప్పుడు మన మార్కెట్లో కనిపించడం లేదు. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రాచుర్యంలోకి రాక ముందు వరకూ మనదేశంలో క్రాసోవర్ కార్లకి ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. కానీ, ఇప్పుడదని కనిపించడం లేదు.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

క్రాసోవర్ కార్లు పాత కాలపు ఎస్టేట్ వ్యాగన్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటాయి. ముందు వైపు నుండి చూడటానికి హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ రూపాన్ని కలిగి ఉండి, వెనుక వైపు ఎత్తుగా మరియు వాలుగా ఉండే నిర్మాణంతో ఎస్‌యూవీ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటినే క్రాసోవర్‌లు అంటారు.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

పేరుకు తగినట్లుగానే వీటిని హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మరియు ఎస్‌యూవీల డిజైన్ సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. హ్యాచ్‌బ్యాక్‌కు మరియు ఎస్‌యూవీకి మధ్యలో ఉన్న అంతరాన్ని పూడ్చడంలో ఈ క్రాసోవర్‌లు చక్కటి పాత్రను పోషిస్తాయి. హ్యాచ్‌బ్యాక్ నుండి పెద్ద కారుకి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారు మరియు పెద్ద ఎస్‌యూవీలను ఖర్చును భరించలేని వారికి ఈ క్రాసోవర్‌లు మంచి ఆప్షన్‌గా ఉంటాయి.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

భారత మార్కెట్లో సుమారు ఆరేడేళ్ల క్రితం వరకూ క్రాసోవర్ విభాగానికి మంచి డిమాండ్ ఉండేది. అయితే, ఇటీవలి కాలంలో సరసమైన ధరలకే కాంపాక్ట్ ఎస్‌యూవీలు రావడం, ప్రజలు కూడా కాస్తంత ధర ఎక్కువైనా ఎస్‌యూవీ బాడీ టైప్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో, దేశీయ మార్కెట్లో క్రాసోవర్ కార్లు క్రమక్రమంగా కనుమరుగైపోయాయి.

మరి మన దేశీయ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయిన టాప్-5 క్రాసోవర్లు కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

రెనో క్యాప్చర్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, 2017లో క్యాప్చర్ అనే క్రాసోవర్‌ని భారత మార్కెట్లో విడుదల చేసింది. రెనో ప్రీమియం ఎస్‌యూవీ డిఎన్ఏ‌తో వచ్చిన క్రాసోవర్ మోడలే ఈ క్యాప్చర్. అప్పట్లో ఈ క్రాస్ఓవర్ కొంత మంది కస్టమర్లను సంపాదించుకున్నప్పటికీ, చాలా మంది రెనో క్యాప్చర్ యొక్క కఠినమైన రూపాన్ని గమనించలేదనే చెప్పాలి.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

రెనో క్యాప్చర్ 210 మిమీ వద్ద గ్రౌండ్ క్లియరెన్స్‌తో మంచి ప్రాక్టికాలిటీతో, రగ్గడ్ లుక్ మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఈ మోడల్ విఫలమైంది. ఫలితంగా, రెనో ఇండియా 2020లో ఈ క్రాసోవర్ అమ్మకాలను భారత మార్కెట్లో నిలిపివేసింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్

ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్, ఈ కారు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఈ కారు 2013 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో భారతదేశంలో క్రాస్ఓవర్లకు మంచి డిమాండ్ ఉండేది. నిజానికి ఇది స్టాండర్డ్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారు యొక్క స్పోర్టియర్ వెర్షన్‌గా ఉంటుంది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

స్టాండర్డ్ ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే, ఈ పోలో క్రాస్ మోడల్ ఎక్స్టీరియర్ డిజైన్ కాస్తంత భిన్నంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది. రగ్గడ్ లుక్ కోసం కంపెనీ ఈ క్రాసోవర్ మోడల్‌లో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను పూర్తిగా రీడిజైన్ చేసింది. అంతేకాకుండా, ఈ కారు చుట్టూ నల్లటి ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ కూడా ఉంటుంది.

పోలో మరియు పోలో క్రాస్ మోడళ్ల మధ్య కేవలం చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు మినహా, పెద్ద మార్పులు ఏవీ లేకపోవటంతో మార్కెట్లో ఈ క్రాసోవర్ మోడల్ ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్ కారును ప్రవేశపెట్టిన రెండు సంవత్సరాల తర్వాత 2015లో కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

టాటా అరియా

పైన పేర్కొన్న రెండు క్రాసోవర్లు వినియోగదారులను ఆకర్షించడంలో వెనుకపడ్డాయి. కానీ, టాటా ఆరియా మాత్రం గణనీయమైన కస్టమర్లను సంపాదించుకోగలిగింది. ఈ విభాగంలో కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవి500 వంటి మోడళ్లతో పెరిగిన పోటీ కారణంగా టాటా మోటార్స్ ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

టాటా ఆరియా చూడటానికి ముందు వైపు నుండి ఇండికా లాంటి డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. కేవలం ఆరేళ్లలో టాటా ఆరియా మార్కెట్ నుండి తొలగిపోయింది. ఆ తర్వాత కంపెనీ దీని స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు హెక్సా అనే మోడల్‌ను ప్రవేశపెట్టింది. కానీ, టాటా హెక్సా ఎమ్‌పివి కూడా ఈ రేసులో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

టొయోటా ఎతియోస్ క్రాస్

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, భారత మార్కెట్లో విక్రయించిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ లివా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఇందులో ఎతియోస్ క్రాస్ పేరిట ఓ రగ్గడ్ లుకింగ్ క్రాసోవర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

ఎతియోస్ లివా క్రాస్ చుట్టూ బలమైన ప్లాస్టిక్ ప్యానెల్స్‌, ముందు మరియు వెనుక వైపున పెద్ద స్పోర్టీ బంపర్స్, సిల్వర్ యాక్సెంట్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లతో ఈ క్రాసోవర్‌ను రూపొందించారు. స్టాండర్డ్ ఎతియోస్ లివాతో పోల్చుకుంటే, ఎతియోస్ లివా క్రాస్ మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉండేది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

అంతేకాదు, స్టాండర్డ్ ఎతియోస్ లివాతో పోలిస్తే, ఎతియోస్ క్రాస్ మోడల్ అదనపు పొడవు, వెడల్పు మరియు ఎత్తు కూడా కలిగి ఉండేది. టొయోటా నుండి ఈ కారు చాలా అందమైన క్రాస్‌ఓవర్‌లలో ఒకటిగా పరిగణించబడినప్పటికీ, అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్ ఫీచర్‌లు లేనందున ఇది 2020 లో మార్కెట్ నుండి తొలగిపోయింది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

ఫియట్ అవెంచురా

ఫియట్ అవెంచురాను కంపెనీ ఓ లైఫ్‌స్టైల్ యుటిలిటీ వాహనంగా ప్రవేశపెట్టింది. ఇది హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీల కలయికతో ఉంటుంది. ఫియట్ అందించిన పుంటో హ్యాచ్‌బ్యాక్ కారు ఆధారంగా దీనిని రూపొందించారు. పుంటోతో పోలిస్తే, ఇది ఎక్కువ పొడవు, వెడల్పు మరియు ఎత్తు మాత్రమే కాకుండా 205 మిమీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కలిగి ఉండేది.

భారత మార్కెట్లో కనుమరుగైపోయిన క్రాసోవర్లు.. కారణం..?

అంతేకాదు, ఫియట్ అవెంచురా వెనుక భాగంలో స్పేర్ వీల్‌ను బూట్ డోరుపై అమర్చబడి ఉండేది. ఫియట్ బ్రాండ్‌కి భారత మార్కెట్లో సరైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఈ మోడల్ కూడా ఇతర ఫియట్ కార్ల మాదిరిగానే మార్కెట్లో ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఫియట్ 2019లో ఈ క్రాస్ఓవర్ అమ్మకాలను నిలిపివేసింది.

Most Read Articles

English summary
Top 5 crossovers that are no longer available in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X