చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో గత కొంత కాలంగా కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ప్రత్యేకించి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంటోంది. మొదటిసారిగా కారు కొనేవారు మరియు హ్యాచ్‌బ్యాక్ నుండి అప్‌గ్రేడ్ కోరుకునే కస్టమర్లు కూడా ఎక్కువగా ఈ చిన్న ఎస్‌యూవీలను ఎంచుకోవడంతో దేశీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

ఇందుకు ప్రధాన కారణం, చిన్న సైజ్ ఎస్‌యూవీలు హ్యాచ్‌బ్యాక్ కార్ల కన్నా ఎక్కువ స్థలాన్ని, సేఫ్టీని మరియు ఫీచర్లను కలిగి ఉండటంతో పాటుగా వాటి మధ్య ధరల వ్యత్యాసం కూడా చాలా స్వల్పంగా ఉంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, కస్టమర్లు కాంపాక్ట్ / మిడ్-సైజ్ ఎస్‌యూవీలకే తమ ఓటు అంటున్నారు. అయితే, మధ్యతరగతి ప్రజలకు మాత్రం హ్యాచ్‌బ్యాక్ లు వారి డ్రీమ్ కారుగా చెప్పవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో సరసమైన ధరకే అనేక చిన్న కార్లు లభిస్తున్నాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

భారత మార్కెట్లో మారుతి సుజుకి ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియో నుండి అనేక హ్యాచ్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి, ఇవే కాకుండా, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా హ్యాచ్‌బ్యాక్ లను అధికంగా విక్రయిస్తున్నాయి. గడచిన సెప్టెంబర్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 హ్యాచ్‌బ్యాక్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

1. మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)

ఈ జాబితాలో ఎప్పటిలానే మొదటిగా వినిపించే పేరు మారుతి సుజుకి ఆల్టో. దేశంలో అత్యధికంగా విక్రయించబడే సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి గత సెప్టెంబర్ 2021 నెలలో మొత్తం 12,143 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. అయితే, సెప్టెంబర్ 2020 నెలలో విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే, గత నెల అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

గతేడాది ఇదే సమయంలో మారుతి సుజుకి మొత్తం 18,246 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఈ జాబితాలో ఆల్టో మొదటి స్థానంలోనే ఉన్నప్పటికీ, గతేడాదితో పోలిస్తే, అమ్మకాలు 33 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రతి నెల అమ్మకాల పరంగా టాప్ 5 జాబితాలో ఉంటోంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 3.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

2. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

ఈ జాబితాలో రెండవ పేరు కూడా మారుతి సుజుకి బ్రాండ్ వాహనామే. కంపెనీ తమ నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు గత నెలలో భారీగా క్షీణించాయి. సెప్టెంబర్ 2021 లో మొత్తం 8,077 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాలెనో అమ్మకాలు 58 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌ 2020లో కంపెనీ మొత్తం 19,433 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

3. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)

మారుతి సుజుకి నుండి లభిస్తున్న మరొక పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్, ఇది ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు భారతీయ వినియోగదారులలో మంచి ప్రాచుర్యం పొందింది. ఇది చూడటానికి చిన్నసైజు ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నాల్గవ తరం వ్యాగన్ఆర్ మునుపటి మోడళ్ల కన్నా పెద్దదిగా ఉండి, ఎక్కువ క్యాబిన్ మరియు బూట్ స్పేస్ ను ఆఫర్ చేస్తుంది.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

కొత్త వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు శక్తివంతమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులో స్టాండర్డ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. కంపెనీ ఈ కారును ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ తో కూడా అందిస్తోంది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 7,632 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. సెప్టెంబర్ 2020లో విక్రయించిన 17,581 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు భారీగా 57 శాతం క్షీణించాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

4. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ఈ జాబితాలోకి చేరిన నాల్గవ మోడల్ టాటా ఆల్ట్రోజ్. టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇది. సెప్టెంబర్ 2021 నెలలో టాటా మోటార్స్ మొత్తం 5,772 యూనిట్ల ఆల్ట్రోజ్ కార్లను విక్రయించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 2020 నెలలో కంపెనీ 5,952 యూనిట్ల ఆల్ట్రోజ్ కార్లను విక్రయించింది. ఈ టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు స్వల్పంగా 3 శాతం తగ్గాయి.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

5. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)

దక్షిణ కొరియాకి చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20. నిజానికి, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, కస్టమర్ల మొదటి ఛాయిస్ ఐ20 అని చెప్పొచ్చు. అయితే, గత నెలలో టాటా ఆల్ట్రోజ్ ఈ అంచనాను తారుమారు చేసింది. అమ్మకాల పరంగా, టాటా ఆల్ట్రోజ్ ఐ20 అమ్మకాలను అధిగమించి నాల్గవ స్థానాన్ని సాధించింది.

చిన్న ఎస్‌యూవీల దెబ్బకి కుదేలవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు: సెప్టెంబర్‌లో ఇవే టాప్ 5

హ్యుందాయ్ ఐ20 అమ్మకాల విషయానికి వస్తే, సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ మొత్తం 5,153 యూనిట్ల ఐ20 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 నెలలో) కంపెనీ మొత్తం 9,852 యూనిట్ల ఐ20 కార్లను విక్రయించింది. ఈ సమయంలో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు 48 శాతం క్షీణతను నమోదు చేశాయి.

Most Read Articles

English summary
Top 5 hatchbacks sold in september 2021 alto baleno wagonr i20 altroz
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X