భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ప్రస్తుతం దేశంలో ఎవరైనా కొత్త కారును కొనుగోలు చేయాలంటే ప్రధానంగా చూసే అంశం దాని యొక్క సేఫ్టీ రేటింగ్. ఈ నేపథ్యంలో, తయారీదారులు తమ కార్లను అత్యంత సురక్షితంగా ఉండేలా తయారు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అనేక సురక్షితమైన కార్లు మార్కెట్లోకి వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ప్రస్తుత సంవత్సరంలో కూడా మూడు కొత్త కార్లు క్రాష్ టెస్టులలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొత్తం ఐదు మోడళ్లు ఉన్నాయి. మరి 2021లో ఈ క్రాష్ పరీక్షలలో పాస్ అయిన ఐదు కార్లు ఏవో చూసేద్దాం రండి.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

1. టాటా పంచ్ (Tata Punch)

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్, ఈ విభాగంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న మొదటి కారుగా రికార్డు సృష్టించింది. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, సేఫ్టీ విషయంలో మాత్రం ఈ కారు ఎక్కడా రాజీ పడదు. టాటా పంచ్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీలో టాటా పంచ్ 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్స్ స్కోర్ సాధించింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ఇకపోతే, చిన్న పిల్లల రక్షణ విషయంలో కూడా పంచ్ మెరుగ్గానే ఉంది. ఈ విషయలో టాటా పంచ్ 49 పాయింట్లకు గాను 40.89 పాయింట్లను స్కోర్ చేసింది. రేటింగ్స్ పరంగా చూస్తే పెద్దలో భద్రతలో దీనికి 5 స్టార్స్, పిల్లల భద్రతలో 4 స్టార్స్ లభించాయి. ఓవరాల్‌గా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. గత అక్టోబర్‌లో ప్రారంభించబడిన టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో రూ.5.49 లక్షల నుంచి రూ.9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విక్రయించబడుతోంది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

2. మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XVU700)

మహీంద్రా బ్రాండ్ నుండి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరికొత్త ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 కూడా సేఫ్టీ విషయంలో శభాష్ అనిపించుకుంటుంది. సరికొత్త లోగో మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన ఈ ఎస్‌యూవీ కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల సేఫ్టీ విషయంలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ఇండివిడ్యువల్ రేటింగ్స్ పరంగా చూస్తే, ఈ కారుకి అడల్ట్ సేఫ్టీ విషయంలో 5-స్టార్ మరియు చైల్డ్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఓవరాల్‌గా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కారులో ప్రధానంగా లభించే సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్లలో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్) సిస్టమ్ ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తోంది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

3. టాటా టియాగో (Tata Tiago) మరియు టాటా టిగోర్ (Tata Tigor)

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ కంటే ముందుగా గ్లోబల్ ఎన్‌క్యాప్ ఏజెన్సీ టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా టిగోర్ కార్లను క్రాష్ టెస్ట్ చేసింది. టాటా టియాగో పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేసి 4-స్టార్ రేటింగ్ దక్కించుకోగా, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను స్కోర్ చేసి 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. ఓవరాల్ రేటింగ్ విషయానికి వస్తే, ఈ బడ్జెట్ కారుకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ఇక టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ విషయానికి వస్తే, ఇది కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.కాగా, ఈ క్రాష్ టెస్టులో వెర్షన్ టాటా టిగోర్ అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను స్కోర్ చేసింది. టాటా టియాగో మరియు టిగోర్ కార్లలో ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు స్టాండర్డ్‌గా లభించవు. కాబట్టి, ఈ రెండు కార్లకు చైల్డ్ సేఫ్టీలో 3-స్టార్ రేటింగ్ లభించింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

4. టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV)

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ఎలక్ట్రిక్ కారు రికార్డు సృష్టించిన టాటా టిగోర్ ఈవీ, ఈ పరీక్షలో ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. టిగోర్ ఈవీ పెద్దల భద్రత విషయంలో విషయంలో 17 పాయింట్లకు గాను 12 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.24 పాయింట్లను స్కోర్ చేసింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

అయితే, ఈ కారులో మరిన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేసి ఉంటే, టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ దీని కన్నా ఎక్కువ సేఫ్టీ రేటింగ్ పొంది ఉండేదని గ్లోబల్ ఎన్‌క్యాప్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు రివర్స్‌ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తోంది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

5. నిస్సాన్ మాగ్నైట్ SUV (Nissan Magnite)

పైన పేర్కొన్న నాలుగు మోడళ్లు దేశీయ కార్ కంపెనీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు కాగా, జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్ కూడా సేఫ్టీలో భేష్ అనిపించుకుంది. ఈ చిన్న కారు కోసం ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ఈ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఎఓపి) కోసం 39.02 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి) కోసం 16.32 పాయింట్లు సాధించింది. సేఫ్టీ అసిస్ట్ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్ 15.28 పాయింట్లు సాధించి, మొత్తంగా 70.60 పాయింట్ల స్కోరును దక్కించుకుంది. దీంతో ఈ క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

భారత మార్కెట్లో లభించే కార్లు సురక్షితమేనా..? 2021లో క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన కార్లు ఏవంటే..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో కంపెనీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. వీటిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇఎస్‌సి (ఇంజన్ స్టెబిలిటీ కంట్రోల్), సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 5 indian cars that scored more than 3 star safety rating in global ncap crash tests in 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X