భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

ఇటీవల మార్కెట్లో కొత్తగా కార్లు కొనే కస్టమర్లు కారులోని ఫీచర్స్, డిజైన్ వంటి వాటితో పాటు మైలేజ్ కూడా తప్పనిసరిగా తెలుసుకుంటారు. సామాన్యప్రజలు కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుంటారు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల వల్ల డబ్బు కొంత ఆదా అవుతుంది.

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

ఈ కారణంగానే ఇప్పటికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాల మార్కెట్ జోరుగా సాగుతోది. గతంలో డీజిల్ కార్లు మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇస్తాయని నమ్మే వారు, అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కార్ల విషయంలో డీజిల్ మరియు పెట్రోల్ కార్ల మైలేజ్ విషయంలో పెద్దగా వ్యత్యాసాన్ని గమనించలేము. ప్రస్తుత కాలంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం రండి.

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ భారత మార్కెట్లో ఇటీవల కాలంలోనే డుగుపెట్టింది. ఈ కారు మంచి అప్డేటెడ్ ఫీచర్స్ మరియు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇటీవల కాలంలో వాహనదారునికి అన్నివిధాలా సరిపోయే విధంగా సి 5 ఎయిర్‌క్రాస్ చాలా అద్బుతమగా ఉంటుంది.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కేవలం ఒకే ఇంజన్ ఆప్సన్ తో తీసుకువచ్చారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగిన ఈ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఇది ఒక లీటరుకు 18.6 కి.మీ మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

జీప్ కంపాస్

జీప్ కంపెనీ తన కంపాస్ ఎస్‌యూవీని ఇటీవల కొత్త అవతార్‌లో ప్రవేశపెట్టారు. ఇది చూడటానికి చాలా ఆకాస్ర్హనీయమైన డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంది. అయితే దాని ఇంజిన్‌లో మార్పులు చేయలేదు. జీప్ కంపాస్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను 17.3 కిమీ / లీటరుతో అందిస్తుంది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

హ్యుందాయ్ టక్సన్

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ నుండి వచ్చిన ఈ టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీ చాలా కాలంగా మార్కెట్లో ఉంది. కానీ దాని ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవలేకపోయింది. హ్యుందాయ్ టక్సన్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న డీజిల్ ఇంజిన్ ఒక లీటరుకి 16.98 కిమీ మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

టయోటా ఫార్చ్యూనర్

టయోటా కంపెనీ తన ఫార్చ్యూనర్ కారుని ఇటీవలే కొత్త అవతార్ లో రెగ్యులర్ మరియు లెజెండ్ అనే వేరియంట్లలో ప్రవేశపెట్టింది. టయోటా ఫార్చ్యూనర్ అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇది దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగటం వల్ల కంపెనీ దీనిని కొత్త అవతార్ లో ప్రవేశపెట్టింది.

MOST READ:మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 2.8-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 3,000 - 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 201 బిహెచ్‌పి పవర్ మరియు 1,600-2,800 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త లెజెండర్ కేవలం 10 సెకన్లలోపు గంటకు 0 నుంచి 100 కి.మీ వేగవంత అవుతుంది. టయోటా ఫార్చ్యూనర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో ఒక లీటరుకి 15.04 కిమీ మైలేజ్ అందిస్తుంది.

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

ఎంజి గ్లోస్టర్

ఎంజీ మోటార్ యొక్క ప్రీమియం ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్లోని వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. ఈ ఎస్‌యూవీ మంచి మైలేజ్ గణాంకాలను అందిస్తుంది. ఇది టర్బో ఇంజిన్‌తో లీటరుకు 14.5 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఎంజీ గ్లోస్టర్‌ను ఆఫ్ రోడ్ ఎస్‌యూవీగా కూడా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మంచి మైలేజ్ అందించే కార్లను గురించి తెలుసుకున్నారు కదా, అయితే ఇందులో మాకు నచ్చిన మోడల్ ఎంచుకోండి. ఎప్పటికప్పుడు ఆటో మొబైల్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎల్లప్పుడు 'డ్రైవ్‌స్పార్క్ తెలుగు' ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top 5 Mileage Of Premium SUV. Read in Telugu.
Story first published: Monday, April 26, 2021, 11:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X