భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

భారతదేశంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. వాస్తవానికి, వీటి సరసమైన ధర మరియు అద్భుతమైన ఫీచర్ల కారణంగా, దేశీయ విపణిలో ఈ విభాగంలోని కార్లు అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తుంటాయి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగం నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారి కోసం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎక్కువ ఫీచర్‌లను అందిస్తాయి. అంతేకాదు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు మెరుగైన ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో, చౌకైన హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లను అందిస్తుంటాయి. మరి ఈ కథనంలో మనదేశంలో రూ.10 లక్షల ధరలో లభించే టాప్ 5 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

1. మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనో మనదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ మోడల్ గరిష్టంగా 23 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌లో 5 మంది హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఏబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ లాక్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో ధరలు రూ.5.98 లక్షల నుండి రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

2. హ్యుందాయ్ ఐ20

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో లభిస్తున్న మరొక అద్భుతమైన మోడల్ హ్యుందాయ్ ఐ20. ఇది మెరుగైన క్యాబిన్ స్పేస్ మరియు సీటింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ 5-సీటర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లే 311 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంటుంది.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఈ కారులోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి మొదలైన ఫీచర్లు లభిస్తాయి. మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 ధరలు రూ.6.85 లక్షల నుండి రూ.11.34 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

3. టాటా ఆల్ట్రోజ్

మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 మోడళ్ల తర్వాత భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్. ఈ కారు ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన మరియు అత్యుత్తమ అంతర్నిర్మిత నాణ్యత కూడిన కారు. గ్లోబల్ క్రాష్ టెస్టులో టాటా ఆల్ట్రోజ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

పెట్రోల్ మోడల్ లీటరుకు 19.05 కిమీ మైలేజీని మరియు డీజిల్ మోడల్ లీటరు 25.11 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఎబిఎస్ విత్ ఇబిడి వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి. మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ.5.80 లక్షల నుంచి రూ.59.56 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

4. ఫోక్స్‌వ్యాగన్ పోలో

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ నుండి లభిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ పోలో. ఇధి ప్రీమియం ఫీచర్లతో పాటుగా ధృడమైన అంతర్నిర్మిత-నాణ్యతను కలిగి ఉంటుంది. భారతదేశంలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.16 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో 280 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఎసి వెంట్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

5. టొయోటా గ్లాంజా

మారుతి సుజుకి బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షనే ఈ టొయోటా గ్లాంజా. బాలెనో మరియు గ్లాంజా మోడళ్ల ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్లలో అనేక పోలికలు ఉంటాయి. టొయోటా గ్లాంజా కూడా మారుతి బాలెనో మాదిరిగానే పెట్రోల్ మరియు తేలికపాటి హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇవి మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు

ఈ కారులో స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో టొయోటా గ్లాంజా ధరలు రూ.7.01 లక్షల నుంచి రూ.8.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 5 Premium Hatchbacks Available In India Under Rs 10 Lakh Budget. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X