భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

సెడాన్ బాడీ టైప్ కార్లు అధిక బూట్‌స్పేస్‌ను కలిగి ఉండి, డ్రైవర్, ప్యాసింజర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. నిజానికి, సెడాన్ కార్లు హ్యాచ్‌బ్యాక్‌లు మరియు ఎస్‌యూవీల కన్నా ప్రీమియం రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటాయి. భారతదేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా, ఫోర్డ్ సహా అనేక ఇతర కంపెనీలు సెడాన్ బాడీ టైప్ కలిగిన కార్లను విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో, భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభిస్తున్న సెడాన్ల వివరాలు తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

1. టాటా టిగోర్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నుండి లభిస్తున్న అత్యంత సరసమైన కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్. మార్కెట్లో దీని ధరలు రూ.5.60 లక్షల నుంచి రూ.7.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. టాటా టిగోర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

ఈ కారు సగటున సిటీలో లీటరుకు 12-15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది మరియు హైవేపై సగటున లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇది సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ కారులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటుగా పలు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

2. మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కారు. మార్కెట్లో మారుతి డిజైర్ ధరలు రూ.5.98 లక్షల నుంచి రూ.9.02 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 378 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. మారుతి డిజైర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో ఫీచర్‌ను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

3. హ్యుందాయ్ ఔరా

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఔరా. మార్కెట్లో దీని ధరలు రూ.5.97 లక్షల నుంచి రూ.9.31 లక్షల మధ్యలో ఉంటాయి. ఈ కారును పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటుగా, పవర్ విండోస్, ఏబిఎస్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. దీని బూట్ స్పేస్ 402 లీటర్లుగా ఉంటుంది.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

4. హోండా అమేజ్

హోండా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధరలు రూ.6.22 లక్షల నుండి రూ.9.99 లక్షల మధ్యలో ఉంటాయి. ఈ కారు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్స్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (సివిటి) ఆప్షన్లతో లభిస్తుంది. హోండా అమేజ్కారులో 420 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారులో సరికొత్త డిజిప్యాడ్ 2.0 కనెక్టివిటీ టెక్నాలజీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

5. మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి నుండి లభిస్తున్న మరొక అద్భుతమైన సెడాన్ సియాజ్. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.52 లక్షల నుంచి రూ.11.50 లక్షల మధ్యలో ఉంటాయి. మారుతి సియాజ్‌లో 1.5 లీటర్ తేలికపాటి హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభించే బెస్ట్ సెడాన్ కార్లు

మారుతి సుజుకి సియాజ్ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఏబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

Most Read Articles

English summary
Top 5 Sedans Available In India Under Rs 10 Lakh: Tigor, Dzire, Aura And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X