భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ కార్లు వాహనదారునికి మంచి మైలేజ్ అందించడమే కాకుండా, తక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఇవి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పెద్ద సంఖ్యలో హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయిస్తున్నాయి. కానీ భారతదేశంలో విక్రయించబడుతున్న చాలా కార్ మోడళ్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు. కావున ఇప్పుడు వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులు మాత్రం ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

వాహనదారులు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉన్న వాహనాలపై శ్రద్ద వహింస్తున్నందువల్ల వాహన తయారీదారులు కూడా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు మనం భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి తెలుసుకుందాం..

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

టాటా ఆల్ట్రోజ్:

భారతదేశంలో ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థగా ఉన్న టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా తన కార్ల నాణ్యతపై మరియు పనితీరుపై దృష్టి సారించింది. టాటా మోటార్స్ తన కొత్త కార్లన్నింటినీ అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తోంది. టాటా మోటార్స్ లేటెస్ట్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

ఈ రేటింగ్‌తో, ఆల్ట్రోజ్ భారతదేశం యొక్క సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ గా నిలిచింది. టాటా మోటార్స్ నెక్సాన్ మరియు హారియర్ కార్లకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా లభిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ కారుకు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ కారును టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో కూడా విక్రయిస్తారు. టాటా ఆల్ట్రోజ్ కారు ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.7 లక్షలు.

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

టాటా టియాగో:

సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంది సేఫ్టీ రేటింగ్ లో రెండవ స్థానంలో నిలిచినా కారు ఈ టాటా టియాగో. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం రూ. 4.8 లక్షలు.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ పోలో :

ఫోక్స్‌వ్యాగన్ కార్లు మంచి పనితీరు కలిగి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఫోక్స్‌వ్యాగన్ కార్ బిల్డ్ క్వాలిటీ కూడా అద్భుతమైనది. ఫోక్స్‌వ్యాగన్ పోలో భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో 4 స్టార్‌ రేటింగ్ పొందింది.

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

ఈ కారు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్-ఇబిడి, పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. ఈ కారును 1.0 లీటర్ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో భారతదేశంలో విక్రయిస్తున్నారు. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 6 లక్షలు.

MOST READ:ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

ఫోర్డ్ ఫిగో :

అమెరికన్ ఫోర్డ్ కంపెనీ మంచి సేఫ్టీ ఫీచర్స్ తో వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో ఎస్‌యూవీ, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయిస్తుంది. ఫిగో అత్యంత సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ యొక్క హ్యాచ్‌బ్యాక్ కారు.

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

ఫోర్డ్ ఫిగో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్‌ రేటింగ్ పొందింది. ఈ కారులో ఎబిఎస్-ఇబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఫోర్డ్ ఫిగో యొక్క టాప్-ఎండ్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఈ కారు ధర భారత మార్కెట్లో రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూమ్‌).

MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

మారుతి సుజుకి ఆల్టో, స్విఫ్ట్, వాగన్ఆర్ మరియు హ్యుందాయ్ ఐ 10 వంటి భారతదేశంలోని చాలా ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్‌లు 2 లేదా అంతకంటే తక్కువ భద్రతా రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఇవి కూడా మార్కెట్లో మంచి అమ్మకాలను కొనసాగిస్తున్నాయి.

Most Read Articles

English summary
Top Safe Hatchbacks In India. Read in Telugu.
Story first published: Tuesday, February 16, 2021, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X