Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ Tata Motors గత కొంత కాలంగా అభివృద్ధి చేస్తూ వచ్చిన మైక్రో/మినీ ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. గత ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన Tata HBX కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన సరికొత్త మినీ ఎస్‌యూవీ Tata Punch (టాటా పంచ్)ను కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

వాస్తవానికి, Tata Motors ఈ కారును Tata Hornbill (టాటా హార్న్‌బిల్) పేరుతో లాంచ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు కంపెనీ ఈ కారుకి Tata Punch అనే పేరును ధృవీకరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ మినీ ఎస్‌యూవీ ఈ విభాగంలోని ఇతర చిన్న ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

ప్రస్తుతం Tata Motors యొక్క ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో Tata Punch నాల్గవ మోడల్‌గా రానుంది. కంపెనీ ఇప్పటికే, Nexon, Harrier మరియు Safari అనే మూడు రకాల ఎస్‌యూవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. మరి ఈ Punch ఎస్‌యూవీలో ఉన్న టాప్ 5 విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

1. Tata Punch డిజైన్

మొదటి చూపులో Tata Punch చూడటానికి ముందు వైపు నుండి Harrier, Safari మోడళ్ల మాదిరిగా అనిపిస్తుంది. కాకపోతే, ఇదొక మినీ ఎస్‌యూవీ రూపంలో ఉంటుంది. దీని మొత్తం పొడవు 4 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుందని సమాచారం. కంపెనీ ఈ కారును కూడా తమ సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించింది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

అందుకే, దీని ఫ్రంట్ ఫాసియా Tata Harrier మరియు Tata Safari మోడళ్లకి సమానంగా ఉంటుంది. కంపెనీ ఈ కారుకు మజిక్యులర్ డిజైన్‌ను ఇచ్చింది, ఫలితంగా ఇది మంచి రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన చిత్రం ప్రకారం, ఈ కారులో ముందు వైపు X ఆకారంలో ఉండే పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు క్రోమ్ గార్నిష్ వంటి అంశాలను చూడొచ్చు.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

అంతేకాకుండా, ఇందులో నలుపు రంగులో ఉండే పెద్ద ఫ్రంట్ బంపర్ మరియు దానిలో ఇరువైపులా అమర్చిన గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, బాడీ చుట్టూ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, రూఫ్ కలర్‌తో మ్యాచ్ అయ్యే సైడ్ మిర్రర్స్ మరియు సి పిల్లర్ వద్ద అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్ (కొత్త స్విఫ్ట్‌లో మాదిరిగా) వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

2. Tata Punch ఇంటీరియర్స్

ప్రస్తుతానికి Tata Motors తమ Punch ఎస్‌యూవీకి సంబంధించిన ఎక్స్టీరియర్ డిజైన్‌ను మాత్రమే వెల్లడి చేసింది. ఈ కారు ఇంటీరియర్‌కు సంబంధించి ఎలాంటి ఫొటోలను కానీ లేదా వివరాలను కానీ కంపెనీ వెల్లడించలేదు. అయితే, గతంలో కంపెనీ ఆవిష్కరించిన కాన్సెప్ట్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసిన ఇంటీరియర్‌లను ఈ కొత్త ఎస్‌యూవీలో కూడా ఆశించవచ్చని తెలుస్తోంది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

ఈ మినీ ఎస్‌యూవీలో Tata Nexon తరహాలో 7 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటు ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా, Tata Punch లో కంపెనీ Harman ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించవచ్చు. ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆశించవచ్చు.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

3. Tata Punch ఇంజన్

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

ఇకపోతే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

4. Tata Punch కాంపిటీషన్

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, Tata Punch ఈ విభాగంలో హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు మరియు మినీ ఎస్‌యూవీలకు గట్టిపోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి మోడళ్లతో పాటుగా త్వరలో రాబోయే Hyundai Casper వంటి మోడళ్లతో కూడా పోటీపడే అవకాశం ఉంది.

Tata Punch తో మిగతా చిన్న కార్లకు గట్టి పంచ్.. టాప్ 5 డీటేల్స్

5. Tata Punch ధర

ప్రస్తుతానికి Tata Motors ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించిన అనేక వివరాలు చాలా గోప్యంగా ఉంచింది. అయితే, మార్కెట్లో పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మరియు అమ్మకాలు గణనీయంగా పెంచుకునేందుకు కంపెనీ ఈ Tata Punch ఎస్‌యూవీని సరసమైన ధరకే విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్ అంచనా ప్రకారం ఈ ఎస్‌యూవీ ధరలు రూ.5 లక్షల నుంచి రూ.8.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Article Published On: Tuesday, August 24, 2021, 15:45 [IST]
English summary
Top 5 things you should know about all new tata punch mini suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+