2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో

మరికొద్ది రోజుల్లోనే 2021వ సంవత్సరం ముగియబోతోంది. ఓవరాల్‌గా కరోనా మహమ్మారి ప్రభావం 2021 సంవత్సరంపై చాలా భారీగానే ఉన్నప్పటికీ, భారత ఆటోమొబైల్ మార్కెట్లో మాత్రం దాని ప్రభావం మిశ్రమంగా ఉందొని చెప్పవచ్చు. ఈ ఏడాది ఆటో పరిశ్రమ చాలా హెచ్చు తగ్గులను చూసింది. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్ కొరత ఆటో పరిశ్రమను అతలాకుతలం చేసింది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా వాహనాల ఉత్పత్తి తగ్గి, అమ్మకాలు కూడా క్షీణించాయి. అంతేకాకుండా, మార్కెట్లో విడుదల కావల్సిన కొత్త కార్లు సైతం జాప్యాన్ని ఎదుర్కున్నాయి. అయితే, ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వేగాన్ని పుంజుకుంది. ఈ సంవత్సరం ఆటోమొబైల్ పరిశ్రమలో చోటు చేసుకున్న అతిపెద్ద మార్పులలో కొన్ని ప్రముఖ కార్లు మరియు కార్ బ్రాండ్లు భారతదేశానికి బైబై చెప్పేశాయి. మరి ఈ 2021లో భారత మార్కెట్‌కు వీడ్కోలు పలికిన ఆ వాహనాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

1. ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour)

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారతదేశంలో వస్తున్న నష్టాల కారణంగా ఇక్కడి నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. భారత్‌లో ఉన్న రెండు తయారీ కేంద్రాలను ఫోర్డ్ ఇండియా మూసివేసింది. దీంతో ఫోర్డ్ అందిస్తున్న పాపులర్ ఎండీవర్ ఎస్‌యూవీతో సహా ఇతర మోడళ్ల తయారీ కూడా నిలిచిపోయింది. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలిచిన ఫోర్డ్ ఎండీవర్ ఫుల్-సైజ్ 7-సీటర్ ఎస్‌యూవీ ఈ విభాగంలో ఒక ప్రముఖమైన మోడల్ గా ఉండేది. ఇది శక్తివంతమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ స్టాండర్డ్ 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభ్యమయ్యేది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

2. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport)

ఫోర్డ్ ఇండియా నిర్ణయం వలన ప్రభావితమైన మరొక మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్. భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాని తెరలేపిన మొదటి అతికొద్ది మోడళ్లలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కూడా ఒకటి. ఈ విభాగంలో ఒకప్పుడు రారాజు నిలిచిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్, కంపెనీ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత మార్కెట్లో నిలిపివేయబడింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు 9 సంవత్సరాలు పూర్తయినా కంపెనీ ఇందులో ఓ కొత్త తరాన్ని వినియోగదారులకు పరిచయం చేయలేకపోయింది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

3. ఫోర్డ్ ఫిగో/ఫ్రీస్టైల్/ఆస్పైర్ (Ford Figo/Freestyle/Aspire)

ఫోర్డ్ ఇండియా భారతదేశం నుండి నిష్క్రమించడం అంటే, దాని ఎంట్రీ-లెవల్ మోడళ్లయిన ఫిగో, ఫ్రీస్టైల్ మరియు ఆస్పైర్‌ మోడళ్లకు కూడా పూర్తిగా ముగింపు పలికినట్లే అర్థం. ఈ మూడు మోడళ్లు కూడా ఒకే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకున్నవి మరియు ఒకే ఫిగో కుటుంబానికి చెందినవి. ఫిగోలో ఆఫర్ చేసిన అవే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లనే ఈ మూడు కార్లు పంచుకున్నాయి.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

ఈ సంవత్సరం జూలై నెలలోనే, ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2-లీటర్ ఆటోమేటిక్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. అయితే, సెప్టెంబర్ 2021లో, కంపెనీ భారతదేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది. ఫోర్డ్ ఆస్పైర్ సబ్-కాంపాక్ట్ సెడాన్ మరియు ఫ్రీస్టైల్ క్రాస్-హాచ్ రెండూ కూడా ఫిగో కాంపాక్ట్ హాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడ్డాయి మరియు 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో ఆఫర్ చేయబడ్డాయి.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

4. స్కోడా రాపిడ్ (Skoda Rapid)

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటోకు గేమ్ ఛేంజర్ మోడల్ అయిన స్కోడా ర్యాపిడ్ భారత మార్కెట్ నుండి దూరమైంది. ఈ కారును భారతదేశంలో ప్రారంభించబడి దాదాపు ఒక దశాబ్దం పూర్తయిన తర్వాత స్కోడా ఈ సంవత్సరం రాపిడ్ సెడాన్ ఉత్పత్తిని ముగించింది. స్కోడా ర్యాపిడ్ ఇప్పటికీ కంపెనీ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అయితే, ఇప్పుడు ఈ మోడల్ కి తర్వాతి తరం లేదా పూర్తిగా ఓ కొత్త మోడల్ తో రీప్లేస్‌మెంట్ ఎంతో అవసరం. అందుకే, కంపెనీ కఠినమైనా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

స్కోడా ర్యాపిడ్ ఔత్సాహికులను నిరుత్సాహపరచకుండా కంపెనీ తమ అభిమానుల కోసం ఓ సరికొత్త కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశం కోసం స్కోడా ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా స్కోడా స్లావియా (Skoda Slavia) అనే సెడాన్ ను పరిచయం చేసింది. అలాగే, ర్యాపిడ్ సెడాన్ విషయంలో కూడా ప్రత్యేక మాట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది, ఇది భారతదేశంలో అమ్మకానికి వచ్చిన రాపిడ్ సెడాన్ యొక్క చివరి భాగం అవుతుంది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

5. టొయోటా యారిస్ (Toyota Yaris)

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారీ ఆశలతో మరియు అంచనాలతో మార్కెట్లోకి తీసుకువచ్చిన కాంపాక్ట్ సెడాన్ టొయోటా యారిస్. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన కొత్త కస్టమర్లను బాగానే ఆకక్టున్నప్పటికీ, ఆ తర్వాత క్రమంగా దీని అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 3 సంవత్సరాలకు పైగా భారత మార్కెట్లో ఉన్న తర్వాత టొయోటా యారిస్ సెడాన్ ను కంపెనీ ఇక్కడి మార్కెట్లో నిలిపివేసింది. టొయోటా యారిస్ భారతీయ కార్ల కొనుగోలుదారులపై శాశ్వత ముద్ర వేయలేకపోయింది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

టొయోటా యారిస్ అమ్మకాలు భారీగా క్షీణించడంతో, కంపెనీ ఈ మోడల్ ను భారత మార్కెట్ నుండి తొలగించి వేసింది. అయితే, టొయోటా యారిస్ సెడాన్ స్థానంలో మారుతి సుజుకి సియాజ్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ టొయోటా బెల్టా (Toyota Belta) అనే పేరుతో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త సంవత్సరంలో మారుతి సియాజ్ ఆధారిత టొయోటా సెడాన్ ను మనం చూసే అవకాశం ఉంది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

6. ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ (Volkswagen T-Roc)

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కూడా ఈ ఏడాది రెండు మోడళ్లను భారత మార్కెట్ నుండి తొలగించింది. వాటిలో మొదటిది ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. మొదట్లో ఇంపోర్టెడ్ మోడల్ గా ఈ కారును విదేశాల నుండి దిగుమతి చేసుకొని ఫోక్స్‌వ్యాగన్ ఇక్కడి మార్కెట్లో విక్రయించేది. అయితే, అధిక ధర మరియు ఇతర ఆంక్షల కారణంగా టొయోటా టి-టోర్ అమ్మకాలు మందగించాయి. దీంతో వేరే గత్యంతరం లేక ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ కారును డిస్‌కంటిన్యూ చేసింది. అయితే, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ టైన్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

2021లో భారత్‌కు బైబై చెప్పిన టాప్ 7 కార్లు: ఫోర్డ్ ఫిగో, ఎండీవర్, స్కోడా ర్యాపిడ్, టిగువాన్ ఆల్‌స్పేస్ మరెన్నో..

7. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ (Volkswagen Tiguan Allspace)

ఫోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది మార్కెట్లో నిలిపివేసిన రెండవ మోడల్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్. ఈ కారును కూడా కంపెనీ గతంలో సిబియూ రూపంలో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించేది. ఫోక్స్‌వ్యాగన్ నుండి వచ్చిన 7-సీటర్ ఎస్‌యూవీ ఇది. అయితే, కొన్ని కారణాల వలన కంపెనీ ఈ కారును నిలిపివేసింది. కాగా, ఇప్పుడు దాని స్థానంలో చిన్నది మరియు 5-సీటర్ వెర్షన్ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ 2.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో విక్రయించబడేది.

Most Read Articles

English summary
Top 7 cars discontinued in india in 2021 ford figo aspire tiguan allspace and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X