అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిరంతరం పెరగుతుండటంతో, ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనం విషయానికి వస్తే, మనదేశంలో సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) విరివిగా మరియు తక్కువ ధరకే లభ్యమవుతోంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

ప్రస్తుతం మన మార్కెట్లో పెట్రోల్‌తో పాటుగా సిఎన్‌జి గ్యాస్‌తో నడిచే వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే, అత్యధిక మైలేజీని కూడా ఆఫర్ చేస్తాయి. అంతేకాదు, సిఎన్‌జి ఇంధనంతో నడిచే కార్లు పర్యావరణానికి కూడా చాలా సురక్షితమైనవి. మరి మన మార్కెట్లో లభిస్తున్న అత్యధిక మైలేజీని టాప్ 8 సిఎన్‌జి కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

1. Maruti Suzuki WagonR : మైలేజ్- 32.52 కిమీ/కేజీ

Maruti Suzuki WagonR దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సిఎన్‌జి కారు. టాల్‌బాయ్ కారుగా ప్రసిద్ధి చెందిన WagonR లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మూడవ తరం మోడల్. మునుపటి తరం మోడళ్లతో పోలిస్తే, ఈ కొత్త తరం మోడల్ మెరుగైన ఎక్స్టీరియర్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్స్, విశాలమైన క్యాబిన్ స్పేస్, ఎక్కువ బూట్ స్పేస్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్స్ మరియు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

Maruti Suzuki WagonR ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్-సిఎన్‌జి కిట్‌తో లభిస్తుంది. ఈ కారు భారతీయ రహదారులపై అత్యధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి కారు. మీరు రోజూ కారులో దూర ప్రయాణం చేసేవారైతే, ఇది ప్రతి నెలా మీకు వేలాది రూపాయలను పెట్రోల్‌పై ఆదా చేస్తుంది. మార్కెట్లో సిఎన్‌జి మోడల్‌లో లభించే WagonR LXi (O) వేరియంట్ ధర రూ.5.78 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ సుజుకి స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, మాన్యువల్ ఏసి, నాలుగు పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

2. Maruti Suzuki Alto : మైలేజ్- 31.59 కిమీ/కేజీ

Maruti Suzuki Alto ఈ కంపెనీ నుండి లభిస్తున్న అత్యంత చవకైన హ్యాచ్‌బ్యాక్ కారు. అంతేకాదు, ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఫ్యామిలీ కార్ కూడా. Alto కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్-సిఎన్‌జి కిట్‌తో లభిస్తుంది. ఈ కారు ఒక కిలో సిఎన్‌జితో గరిష్టంగా 31.59 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

మార్కెట్లో Maruti Suzuki Alto సిఎన్‌జి వేరియంట్ ధరలు రూ. 4.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, కీలెస్ ఎంట్రీ, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

3. Maruti Suzuki S-Presso : మైలేజ్- 31.2 కిమీ/కేజీ

Alto కన్నా కాస్తంత మెరుగైన మరియు పెద్దదైన కారు కోరుకునే వారికి Maruti Suzuki S-Presso తక్కువ ధరలో ఓ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. కంపెనీ ఈ కారును కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో విక్రయిస్తోంది. మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.36 లక్షలుగా ఉంది. ఇది కేజీకి 31.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

డిజైన్ పరంగా, Maruti Suzuki S-Presso చూడటానికి ఓ చిన్నసైజు మినీ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ఈ కారులో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

4. Maruti Suzuki Celerio: మైలేజ్- 30.47 కిమీ/కేజీ

భారత మార్కెట్లో Maruti Suzuki Celerio హ్యాచ్‌బ్యాక్ చాలా కాలంగా విక్రయానికి ఉంది. ఇది SWift కన్నా చిన్నదిగా మరియు Alto కన్నా పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు మోడళ్ల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. మార్కెట్లో Celerio CNG వేరియంట్ ధరలు రూ.5.95 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

Maruti Suzuki Celerio ఎస్-సిఎన్‌జి వెర్షన్ కేజీ సిఎన్‌జికి గరిష్టంగా 30.47 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 10 కేజీల నిల్వ సామర్థ్యం కలిగిన సిఎన్‌జి ట్యాంక్ ఉంటుంది. ఈ కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసి, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, సింగిల్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

5. Hyundai Santro : మైలేజ్- 30.48 కిమీ/కేజీ

Maruti Suzuki సిఎన్‌జి కార్లకు పోటీగా Hyundai ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Santro, పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తోంది. మార్కెట్లో Hyundai Santro సిఎన్‌జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.99 లక్షలు (మాగ్నా) మరియు రూ.6.21 లక్షలు (స్పోర్జ్)గా ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

సిఎన్‌జి వెర్షన్ Hyundai Santro కేజీకి 30.48 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను మగనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, రియర్ పార్కింగ్ కెమెరా, ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

6. Hyundai Aura : మైలేజ్- 28 కిమీ/కేజీ

సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏకైక కాంపాక్ట్ సెడాన్ Hyundai Aura. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంటుంది. సిఎన్‌జి ఆప్షన్‌తో Aura కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.7.67 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

Hyundai Aura కేజీ సిఎన్‌జికి 28 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ ఏసి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

7. Maruti Suzuki Ertiga : మైలేజ్- 26 కిమీ/కేజీ

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎమ్‌పివి విభాగంలో అందుబాటులో ఉన్న సరసమైన మోడల్ ఈ Maruti Suzuki Ertiga. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్-సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తుంది. Maruti Suzuki Ertiga VXi వేరియంట్‌లో సిఎన్‌జి ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది కేజీ సిఎన్‌జికి 26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ 7 సీటటర్ ఎమ్‌పివి ధర రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 8 సిఎన్‌జి కార్లు; ఇక పెట్రోల్ కార్ల గురించి మర్చిపోండి!

8. Maruti Suzuki Eeco : మైలేజ్ - 20.88 కిమీ/కేజీ

Maruti Suzuki Eeco మార్కెట్లో చౌకైన మల్టీ యుటిలిటీ వెహికల్. ఈ కారులో కంపెనీ చాలాకాలంగా సిఎన్‌జి వెర్షన్‌ను విక్రయిస్తోంది. ఈ వ్యాన్ మంచి ఇంటీరియర్ స్పేస్ మరియు మైలేజ్ విషయాల్లో ప్రసిద్ధి చెందినది. ఇది కేజీ సిఎన్‌జికి గరిష్టంగా 20.88 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మార్కెట్లో ఈ సిఎన్‌జి వెర్షన్ Eeco వ్యాన్ ధరలు రూ .5.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభం అవుతాయి.

Most Read Articles

English summary
Top 8 best mileage cng cars in india wagonr alto santro aura ertiga eeco
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X