భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీ (స్పోర్స్ట్ యుటిలిటీ వెహికల్) విభాగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలోని కస్టమర్లు చిన్నపాటి హ్యాచ్‌బ్యాక్స్ మరియు సెడాన్ల కంటే ఎక్కువగా ఎస్‌యూవీలనే ఎంచుకుంటున్నారు. ఈ చిన్న కార్లతో పోల్చుకుంటే, చిన్న మరియు పెద్ద సైజు ఎస్‌యూవీలు భారతీయ కస్టమర్ల అభిరుచికి మరియు వినియోగానికి అనువుగా ఉండి, మంచి ప్రాక్టికాలిటీని ఆఫర్ చేస్తున్నాయి.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

ఫలితంగా, దేశంలో ఎస్‌యూవీల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ విభాగంలో ఉన్న మోడళ్లను వేళ్ల మీద లెక్కించగలిగేవాళ్లం, కానీ ఇప్పుడు అనేక కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి, మరికొన్ని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి.

ఈ ఏడాది కూడా భారత మార్కెట్లో సరికొత్త ఎస్‌యూవీలు విడుదల కానున్నాయి. అందులోని టాప్ 8 మోడళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

1. టాటా హెచ్‌బిఎక్స్

టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం మరో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. గత ఏడాది ఆటో ఎక్స్‌పో 2020లో హోండా కాన్సెప్ట్ రూపంలో పరిచయం చేసిన హెచ్‌బిఎక్స్ మోడల్ ఆధారంగా కంపెనీ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని డెవలప్ చేస్తోంది. దీనిని టాటా నెక్సాన్‌కి దిగువన ఆఫర్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ కారు ధర రూ.5 లక్షల నుండి రూ.7 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

2. రెనో కిగర్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇటీవలో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్'కి సంబంధించిన ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌ను సిఎమ్‌ఎఫ్‌ఎ ప్లస్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై రెనో అనుబంధ సంస్థ నిస్సాన్ కూడా తమ మాగ్నైట్ ఎస్‌యూవీని నిర్మించింది. ఈ కారును 2 రకాల ఇంజన్ ఆప్షన్లతో రూ.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చని అంచనా.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

3. స్కొడా కుషాక్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్న ఓ కొత్త ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసినదే. స్కొడా కుషాక్ పేరుతో కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేయనుంది. గతంలో కంపెనీ ప్రదర్శించిన స్కొడా విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని దీనిని తయారు చేస్తున్నారు. ఇది 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో రావచ్చని సమాచారం.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

4. ఫోక్స్‌వ్యాగన్ టైగన్

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ తమ కొత్త టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా వెల్లడి చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై స్కొడా కుషాక్ కూడా తయారవుతోంది. ఇది కూడా 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

5. మహీంద్రా ఎక్స్‌యూవీ 500

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న ఎక్స్‌యువీ 500లో కూడా ఓ సరికొత్త వెర్షన్ ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది. ఇప్పటి వరకూ లభించిన ఎక్స్‌యువీ 500 మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 మోడల్ పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, దాని ఇంజన్ ఆప్షన్లలో కూడా మార్పులు ఉండొచ్చని సమాచారం.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

6. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్

ఫ్రెంచ్ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ ముందుగా తమ సి5 ఎయిర్‌క్రాస్ మోడళ్లను ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనుంది. భారత్‌లో ఈ కంపెనీ ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ మోడల్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రానుంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.30.00 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

7. హ్యుందాయ్ క్రెటా 7-సీటర్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న సక్సెస్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా మోడల్‌లో కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. ఇది కూడా ఈ సంవత్సరంలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత తరం హ్యుందాయ్ క్రెటా మాదిరిగానే ఈ కొత్త 2021 హ్యుందాయ్ క్రెటా 7-సీటర్ మోడల్ కూడా అదే డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజన్ ఆప్షన్లను ముందుకు తీసుకువెళ్తుంది.

భారత్‌లో 2021లో విడుదల కానున్న టాప్ 8 సరికొత్త ఎస్‌యూవీలు ఇవే..

8. ఎమ్‌జి జెడ్‌ఎస్ పెట్రోల్

చైనీస్ కార్ బ్రాంజ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ పెట్రోల్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఈ కొత్త మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Top 8 Upcoming SUVs In India In 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X