ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యా‌చ్‌బ్యాక్ నుండి ఫుల్-సైజ్ ఎస్‌యూవీ వరకూ అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఏ కారు కొనుగోలు చేసినా, అందులో బూట్ స్పేస్ (లగేజ్ స్పేస్) అనేది చాలా ముఖ్యం. వాస్తవానికి, చిన్నకార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. మరి ఏయే కార్లలో ఎంత బూట్ స్పేస్ లభిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

హోండా జాజ్ - 354 లీటర్లు

భారత మార్కెట్లో లభించే అత్యంత విశాలమైన హ్యాచ్‌బ్యాక్‌లలో హోండా జాజ్ కూడా ఒకటి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో లభించే ఈ కారులో 5 పెద్దలు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ బూట్ స్పేస్ 354 లీటర్లుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఉత్తమ బూట్ స్పేస్ కలిగిన కార్లలో ఒకటి.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

టాటా అల్ట్రోజ్ - 345 లీటర్లు

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మేడ్ ఇన్ ఇండియా కార్లలో టాటా ఆల్ట్రోజ్ కూడా ఒకటి. ఇది ఈ విభాగంలోనే చాలా సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్. టాటా అల్ట్రోజ్ భద్రతలోనే కాకుండా, బూట్ స్పేస్‌లో కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ కారు బూట్ స్పేస్ 345 లీటర్లుగా ఉంటుంది.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ - 340 లీటర్లు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మునుపటి కన్నా మెరుగైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క బూట్ స్పేస్ 340 లీటర్లుగా ఉంటుంది. కంపెనీ ఇందులో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

మారుతి సుజుకి బాలెనో - 339 లీటర్లు

మారుతి వ్యాగన్ఆర్ మాదిరిగానే, మారుతి సుజుకి బాలెనో కూడా ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. బాలెనో కారులోని ప్రీమియం క్యాబిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ స్పేస్ మరియు సమర్థవంతమైన ఇంజన్ వంటి అంశాలు ఈ కారు యొక్క హైలైట్స్, ఇందులో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు. బాలెనో బూట్ స్పేస్ 339 లీటర్లుగా ఉంటుంది.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

హ్యుందాయ్ ఐ20 - 311 లీటర్లు

హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది తమ కొత్త 2020 మోడల్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ వీల్‌బేస్ కాస్తంత పొడవుగా ఉంటుంది, కాబట్టి ఈ కారు క్యాబిన్‌లో విశాలమైన స్థలం లభిస్తుంది. హ్యుందాయ్ ఐ20 యొక్క బూట్ స్పేస్ 311 లీటర్లుగా ఉంటుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది 26 లీటర్లు ఎక్కువ.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

కియా సోనెట్ - 392 లీటర్లు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో కియా సోనెట్ అగ్రస్థానంలో ఉంది. కియా సోనెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దీని బూట్ స్పేస్ మాత్రం పెద్దదిగా ఉంటుంది. కియా సొనెట్ కారు బూట్ స్పేస్ 392 లీటర్లుగా ఉంటుంది.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

హ్యుందాయ్ వెన్యూ - 350 లీటర్లు

కియా సోనెట్ యొక్క ప్రధాన పోటీదారులలో హ్యుందాయ్ వెన్యూ కూడా ఒకటి. ఈ కారు యొక్క బూట్ స్పేస్ 350 లీటర్లు. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్ అయిన హ్యుందాయ్ వెన్యూ భారతీయ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. క్రెటాను కొనుగోలు చేయలేని కస్టమర్లు హ్యుందాయ్ వెన్యూని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.

ఎక్కువ బూట్‌స్పేస్ కలిగిన టాప్ 9 కార్లు: క్రెటా, సెల్టోస్, వ్యాగన్ఆర్, బాలెనో, ఐ20..

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ - 433 లీటర్లు

హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ఈ రెండూ కూడా సరిగ్గా 433 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటాయి. ఇవి రెండూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీలు. మార్చి 2020లో హ్యుందాయ్ క్రెటా యొక్క కొత్త తరం మోడల్ రావడంతో, సెల్టోస్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

Most Read Articles

English summary
Top 9 Cars With Largest Boot Space In India: Hyundai Creta, Kia Seltos And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X