భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వీటిలోని ఫీచర్స్ అదుర్స్

భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమ కరోనా మహమ్మారి గుప్పెటి నుంచి బయటపడిన తరువాత మెల్లమెల్లగా కోలుకుంది. ఈ సమయంలో చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో అనేక ఆధునిక మరియు అప్డేటెడ్ కార్ మోడల్స్ ప్రవేశపెట్టాయి. ఇందులో స్కోడా కుషాక్, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజార్ మరియు టాటా పంచ్ మొదలైనవి ఉన్నాయి. 2021 లో విడుదలైన ఆధునిక కార్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

స్కోడా కుషాక్ (Skoda Kushaq):

ప్రముఖ కార్ తయారీ సంస్థ అయిన స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో కుషాక్ SUV ని విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త SUV ధర రూ. 10.79 లక్షల నుండి రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కుషాక్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

స్కోడా కుషాక్ మొత్తం 7 వేరియంట్లలో మరియు యాంబియంట్, యాంబిషన్, స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో అందించబడుతుంది. ఈ SUV రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇంజిన్ ఎంపికలలో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG గేర్‌బాక్స్‌లతో అందుబాటులోకి వచ్చాయి.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

ఫోర్స్ గూర్ఖా (Force Gurkha):

Force Motors (ఫోర్స్ మోటార్స్) యొక్క Force Gurkha భారతీయ మార్కెట్లో రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలైంది. ఇది మహీంద్రా థార్ SUV కి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త Force Gurkha 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. Force Gurkha ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

2021 Force Gurkha బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండే, 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 1,400-2,400 ఆర్‌పిఎమ్ వద్ద 115 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారును 4WD సిస్టమ్‌తో పాటు 5-స్పీడ్ మెర్సిడెస్ G-28 ట్రాన్స్‌మిషన్‌తో జతచేయవచ్చు.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar):

హ్యుందాయ్ కంపెనీ యొక్క కొత్త అల్కాజార్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్). కొత్త ఆల్కాజర్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజన్ ఆప్షన్లలో తీసుకురాబడింది, వీటిలో 1.5-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. దీని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్ మరియు 191 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్-డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

టాటా సఫారి (Tata Safari):

దేశీయ వాహన తయారు సంస్థ అయిన టాటా మోటార్స్ తన కొత్త సఫారిని 2021 ఫిబ్రవరి నెలలో రూ. 14.99 లక్షల నుండి రూ. 23.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇది కొత్త దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

కొత్త తరం టాటా సఫారి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 173 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

టాటా టిగోర్ ఈవి (Tata Tigor EV):

కొత్త Tata Tigor EV ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.99 లక్షలు. కొత్త Tata Tigor EV యొక్క ముందు భాగంలో కొత్త ట్రై-యారో నమూనా, బ్లూ కలర్ స్లేట్ మరియు ఈవి బ్యాడ్జ్‌లు చాలా చోట్ల ఇవ్వబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు దాని స్టాండర్డ్ మోడల్ కి చాలా భిన్నంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

కొత్త Tata Tigor EV ఇప్పుడు అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇది 306 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. Tata Tigor EV యొక్క మునుపటి మోడల్ ఇంతకూ ముందు ఒక చార్జితో 90 నుండి 100 కిమీ పరిధిని అందించేది. కానీ ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఏకంగా దీని పరిధి 306 కిమీ వరకు పెరిగింది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

టాటా పంచ్ (Tata Punch):

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో SUV. దేశీయ మార్కెట్లో ఇది రూ. 5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా ఇది మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందగలిగింది. కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

ఎమ్‌జి ఆస్టర్ (MG Astor):

ఎమ్‌జి మోటార్స్ యొక్క ఎంజి ఆస్టర్ దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క లేటెస్ట్ మోడల్. కొత్త ఎమ్‌జి ఆస్టర్ యొక్క ప్రారంభ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. కంపెనీ యొక్క ఈ కారు ఇప్పటికే దాదాపు 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

భారతీయ మార్కెట్లో 2021 లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. ఇందులోని ఫీచర్స్ అదుర్స్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

Most Read Articles

English summary
Top hot car launches in year 2021 xuv700 astor punch tigor ev and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X